రాంచరణ్ ని చూడగానే రమా రాజమౌళి ఫస్ట్ రియాక్షన్ ఇదే..రాజమౌళికి ఏం చెప్పారో తెలుసా, భారీ బడ్జెట్ మూవీ అనగానే
మెగా పవర్ స్టార్ రాంచరణ్ చిరుత చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి తనయుడిగా ఫస్ట్ మూవీలో అందరిని మెప్పించాడు. డ్యాన్సులు, ఫైట్స్ విషయంలో ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గలేదు. ఆ విధంగా చరణ్ కి గ్రాండ్ ఎంట్రీ లభించింది.
మెగా పవర్ స్టార్ రాంచరణ్ చిరుత చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి తనయుడిగా ఫస్ట్ మూవీలో అందరిని మెప్పించాడు. డ్యాన్సులు, ఫైట్స్ విషయంలో ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గలేదు. ఆ విధంగా చరణ్ కి గ్రాండ్ ఎంట్రీ లభించింది. వాస్తవానికి చరణ్ ఫస్ట్ మూవీనే రాజమౌళి దర్శకత్వంలో ఉండాల్సింది. మొదట తాను చరణ్ బాడీ లాంగ్వేజ్ ని గమనించాలి అని.. దానిని బట్టి సెకండ్ మూవీ కథ రెడీ చేస్తాను అని రాజమౌళి చిరంజీవికి చెప్పారు.
Magadheera
చిరుత చిత్రంలో రాంచరణ్ సీరియస్ లుక్స్ రాజమౌళికి బాగా నచ్చాయి. భారీ బడ్జెట్ చిత్రాన్ని కూడా క్యారీ చేయగలడు అనే కాన్ఫిడెన్స్ వచ్చిందట. ఆ విధంగా మగధీర చిత్రం మొదలైంది. అయితే రాంచరణ్ ని ఫస్ట్ టైం చూసినప్పుడు రాజమౌళి భార్య రమా రాజమౌళి రియాక్షన్ ఆసక్తికరంగా ఉంది.
రమా రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాంచరణ్ తో హార్స్ రైడింగ్ సీన్లు, యోధుడిగా భారీ ఫైట్స్ చేసే సన్నివేశాలతో సినిమా చేస్తున్నాం అని చెప్పారు. భారీ బడ్జెట్ అని కూడా చెప్పారు. నేను చరణ్ అప్పటి వరకు నేరుగా చూడలేదు. చిరుత చిత్రంలోనే చూశాను. చిరుత మూవీ చూస్తున్నప్పుడు రాంచరణ్ కళ్ళు చాలా పవర్ ఫుల్ గా అనిపించాయి. కరెక్ట్ గా ప్రెజెంట్ చేస్తే స్క్రీన్ ప్రెజన్స్ బావుంటుంది అని అనుకున్నా.
Ram Charan
మగధీర లుక్ టెస్ట్ కోసం ఫస్ట్ టైం రాంచరణ్ ని నేరుగా మీట్ అయ్యా. అప్పుడు చరణ్ ని చూసినప్పుడు కళ్ళతో పాటు హెయిర్ అద్భుతంగా ఉంది అనిపించింది. వెంటనే రాజమౌళితో ఆ అబ్బాయి హెయిర్ చాలా బావున్నాయి. హార్స్ రైడింగ్ సీన్లు ఉన్నాయి కాబట్టి గాల్లో హెయిర్ ఎగురుతుంటే చాలా స్టైలిష్ గా ఉంటుంది అని రాజమౌళితో చెప్పినట్లు రమా రాజమౌళి అన్నారు. వెంటనే రాజమౌళి.. అవును హెయిర్ బాగా పెంచుదాం, ఎంత పొడవుగా వీలైతే అంత పెంచుదాం.. ఆ తర్వాత లుక్ డిసైడ్ చేద్దాం అని చెప్పారట.
ఆ విధంగా మగధీరతో రాంచరణ్ లాంగ్ హెయిర్ లుక్ ఫైనల్ అయింది. రాంచరణ్ ఈ చిత్రంలో వారియర్ కాబట్టి ఆర్మర్ డిజైనింగ్ లో ప్రత్యేక శ్రద్ద తీసుకున్నట్లు రమా రాజమౌళి తెలిపారు. మగధీర చిత్రానికి ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసిన సంగతి తెలిసిందే.