పారితోషికం సగం కట్ చేశాడు, మామ నాగార్జునపై సుమంత్ కంప్లెయింట్.. మొదటి రెమ్యూనరేషన్ ఎంతంటే?
అక్కినేని హీరో సుమంత్.. తన ఫస్ట్ రెమ్యూనరేషన్ గురించి బయటపెట్టాడు. మామ నాగార్జున తనకు సగం కట్ చేసి పారితోషికం ఇచ్చాడని అలీకి కంప్లెయింట్ చేశాడు సుమంత్.
అక్కినేని హీరో సుమంత్ ఒకప్పుడు స్టార్ హీరోగా రాణించారు. వరుస విజయాలతో మంచి స్టార్‌డమ్‌ని సొంతం చేసుకున్నాడు. అటు లవ్ స్టోరీస్, ఇటు మాస్ సినిమాలతోనూ మెప్పించాడు. అయితే కొన్ని రాంగ్ ఛాయిస్ కారణంగా పరాజయాలు ఫేస్ చేశాడు సుమంత్. ఇది కెరీర్‌ని డౌన్ చేసింది. ఇప్పుడు మళ్లీ హీరోగా నిలబడే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన బలమైన క్యారెక్టర్స్ కూడా చేస్తున్నాడు.
సుమంత్ హీరోగా సినిమాల కంటే వెబ్ సిరీస్, ఇతర హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో మెరుస్తున్నాడు. ఇటీవల ఆయన `సార్` సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు. అలాగే `సీతారామం` చిత్రంలోనూ ఓ బలమైన పాత్రలో మెప్పించాడు. హీరోగా మాత్రం ఆచితూచి చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే ఆ మధ్య ఓ పాత ఇంటర్వ్యూలో `దేశముదురు` సినిమాని మిస్ చేసుకున్నట్టు తెలిపిన విషయం తెలిసిందే. పూరీ ఆ కథని తనకే మొదట చెప్పాడని, తాను నో చెప్పడం వల్లే అల్లు అర్జున్ వద్దకు వెళ్లిందన్నారు. ఆ సినిమా చేసి ఉంటే సుమంత్ కెరీర్ మరోలా ఉండేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఇక సుమంత్ మరో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. తన మొదటి పారితోషికం గురించి వెల్లడించారు. సుమంత్ హీరోగా పరిచయం అవుతూ `ప్రేమ కథ` సినిమా చేశాడు. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీకి రామ్ గోపాల్ వర్మ దర్శకుడు. ఈ సినిమాలో చివర్లో హీరోహీరోయిన్లు చనిపోతారు. దీంతో సినిమా ఆడలేదు.
తమ పాత్రలు చనిపోవడం వల్లే సినిమా పోయిందన్నారు సుమంత్. అయితే దీనికి ఆయన పారితోషికం తీసుకోలేదు. అన్నపూర్ణ స్టూడియోలో నాగార్జున ఈ మూవీని నిర్మించారు. దీని ద్వారా సుమంత్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
ఆ తర్వాత `యువకుడు` సినిమాలో నటించాడు సుమంత్. సుమంత్‌కి జోడీగా భూమికా చావ్లా హీరోయిన్‌గా నటించింది. కరుణాకరన్ దర్శకత్వం వహించాడు. నాగార్జున నిర్మాత. ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. రొమాంటిక్ డ్రామాగా యువతని బాగా ఆకట్టుకుంది. మొదటిసారి ఈసినిమాకి పారితోషికం అందుకున్నాడట సుమంత్.
అయితే అది కూడా సగం కట్ చేసి ఇచ్చాడట మామ నాగార్జున. అన్నీ కట్ చేసుకుని చివరకు ఐదు లక్షలు చేతిలో పెట్టాడని తెలిపాడు సుమంత్. `అలీతో సరదాగా` షోలో ఈ విషయం బయటపెట్టాడు సుమంత్.
సుమంత్ కెరీర్ పరంగా.. `పెళ్లి సంబంధం`, `రామ్మా చిలకమ్మా`, `స్నేమంటే ఇదేరా` చిత్రాలతో అలరించారు. `సత్యం` సినిమాతో పెద్ద హిట్‌ని కమర్షియల్ బ్రేక్ ని అందుకున్నాడు. `గౌరీ`, `ధన 51`, `మహానంది` వంటి మాస్ యాక్షన్ సినిమాలతో మెప్పించాడు. `గోదావరి`తో క్లాస్ వైపు టర్న్ తీసుకున్నారు. ఈ కూల్ ఎంటర్‌టైనర్ చాలా రోజులు ఆడియెన్స్ మదిలో నిలిచిపోయింది. `చిన్నోడు`, `క్లాస్ మేట్స్`, `మధుమాసం`తో డీసెంట్స్ హిట్స్ అందుకున్నాయి.
`పౌరుడు`, `బోనీ`, `గోల్కోండ హై స్కూల్`(ఇది బాగానే ఆడింది), `రాజ్`, `దగ్గరగా దూరంగా`, `ఏమో గుర్రం ఎగరావచ్చు`, `నరుడు డోనరుడు` చిత్రాలతో కొంత ట్రాక్ తప్పాడు. `మళ్లీరావా`తో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత చేసిన సినిమాలు ఆడలేదు. దీంతో క్యారెక్టర్స్ వైపు టర్న్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు హీరోగా `అనగనగా ఒక రౌడీ`, `వారథి` సినిమాలు చేస్తున్నారు. వీటికి సంబంధించిన అప్‌డేట్స్ లేవు. షూటింగ్ జరుగుతున్నాయా? ఆగిపోయాయా? అనేది తెలియాల్సి ఉంది.
read more:23 హిట్స్ ఇచ్చిన దర్శకుడినే అవమానించిన చిరంజీవి.. బహిరంగంగానే సెటైర్లు వేసిన స్టార్ డైరెక్టర్
also read: యాక్షన్ దెబ్బకి రూట్ మార్చిన రామ్ పోతినేని.. కొత్త సినిమా ఎలా ఉండబోతుందంటే?