MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Best Summer Drinks: వేసవిలో కాఫీ, టీ బదులు ఈ డ్రింక్స్ తాగితే ఎంత మంచిదో తెలుసా?

Best Summer Drinks: వేసవిలో కాఫీ, టీ బదులు ఈ డ్రింక్స్ తాగితే ఎంత మంచిదో తెలుసా?

సాధారణంగా చాలామంది కాఫీ, టీలతో డేని స్టార్ట్ చేస్తుంటారు. కానీ వేసవిలో కాఫీ, టీలు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. వాటికి బదులు, సహజ డ్రింక్స్ తాగితే చాలా సమస్యల నుంచి బయటపడవచ్చు అంటున్నారు. ఆ డ్రింక్స్ ఏంటో చూద్దాం. 

2 Min read
Author : Kavitha G
Published : Apr 28 2026, 01:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కాఫీ, టీ బదులు తాగాల్సిన డ్రింక్స్
Image Credit : pinterest

కాఫీ, టీ బదులు తాగాల్సిన డ్రింక్స్

వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ శరీరంలో నీటి లోపం, అలసట, తలనొప్పి, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇలాంటి టైంలో అధికంగా కాఫీ, టీ తీసుకోవడం వల్ల శరీరంలో మరింత వేడి పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కాఫీలో ఉండే కేఫీన్ శరీరంలోని నీటిని తగ్గించడమే కాకుండా, కొన్ని సందర్భాల్లో అలసటను కూడా పెంచుతుంది. అందుకే వేసవిలో కాఫీ, టీకి బదులు శరీరాన్ని చల్లగా ఉంచే డ్రింక్స్ తీసుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ చూద్దాం.

26
కొబ్బరి నీరు
Image Credit : Getty

కొబ్బరి నీరు

వేసవిలో అత్యంత ఆరోగ్యకరమైన డ్రింక్స్‌లో మొదటిది కొబ్బరి నీరు. ఇది సహజ ఎలక్ట్రోలైట్స్‌తో నిండి ఉంటుంది. శరీరాన్ని వెంటనే హైడ్రేట్ చేస్తుంది. ఎక్కువ చెమట పట్టడం వల్ల కోల్పోయే ఖనిజాలను తిరిగి అందించడంలో చాలా బాగా సహాయపడుతుంది. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు కొబ్బరి నీరు తాగడం వల్ల శరీరం చల్లగా ఉండటమే కాకుండా శక్తి కూడా పెరుగుతుంది. ఇది కాఫీ, టీకి చక్కని ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది.

Related Articles

Related image1
Summer Face Packs: వేసవిలో మెరిసే చర్మానికి బెస్ట్ ఫేస్ ప్యాక్స్ ఇవిగో
Related image2
Summer Fashion: సమ్మర్‌లో కాటన్ కాకుండా ఏ దుస్తులు బెటర్? కంఫర్ట్, స్టైల్ కోసం బెస్ట్ ఫ్యాబ్రిక్స్..
36
మజ్జిగ
Image Credit : Pixabay

మజ్జిగ

మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. వేసవిలో ఎక్కువగా వచ్చే అజీర్తి, గ్యాస్ సమస్యలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. మజ్జిగలో కొద్దిగా జీలకర్ర పొడి, పుదీనా ఆకులు కలిపితే మరింత రుచిగా ఉండటమే కాకుండా శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. కాఫీ, టీ బదులు మధ్యాహ్నం లేదా సాయంత్రం మజ్జిగ తీసుకోవడం చాలా ఆరోగ్యకరం.

46
లెమన్ వాటర్
Image Credit : Getty

లెమన్ వాటర్

లెమన్ వాటర్ కూడా వేసవిలో చాలా మంచి ఎంపిక. నిమ్మకాయలో ఉండే విటమిన్ C రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కొద్దిగా ఉప్పు, తేనె కలిపి తీసుకుంటే ఇది సహజ ఎనర్జీ డ్రింక్‌లా పనిచేస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగడం వల్ల శరీరం డీటాక్స్ అవుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు.

56
నీరా
Image Credit : Social media

నీరా

నీరాలో సహజ ఎలక్ట్రోలైట్స్, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. వేసవిలో తాగడానికి ఇది అనువైన డ్రింక్‌. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే సహజ చక్కెరలు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి.

66
బార్లీ వాటర్
Image Credit : Getty

బార్లీ వాటర్

బార్లీ వాటర్ శరీరంలో వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది. మూత్ర సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుంది. బార్లీ నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తీసుకుంటే రుచి కూడా బాగుంటుంది. ఇది కాఫీ, టీ లాంటి వాటికి మంచి ప్రత్యామ్నాయం. అలాగే పుచ్చకాయ జ్యూస్, కీరా జ్యూస్ వంటి సహజ ఫ్రూట్ జ్యూసులు కూడా వేసవిలో చాలా మంచివి. ఇవి శరీరానికి నీటిని అందించడమే కాకుండా విటమిన్లు, మినరల్స్ ని కూడా ఇస్తాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Anti Aging: మ‌నిషి 150 ఏళ్లు బ‌త‌క‌గ‌ల‌డా.? పెద్ద క‌ష్ట‌మేమి కాదంటోన్న నిపుణులు
Recommended image2
Beer : ఈ మండుటెండల్లో చల్లని బీర్లు తాగుతున్నారా..? అయితే మీ బాడీకి రిపేర్లు తప్పవు..!
Recommended image3
Cancer Test: ఒక్క ర‌క్త ప‌రీక్ష‌తో క్యాన్స‌ర్ గుర్తింపు.. స‌రికొత్త ప‌ద్ధ‌తి అభివృద్ధి
Related Stories
Recommended image1
Summer Face Packs: వేసవిలో మెరిసే చర్మానికి బెస్ట్ ఫేస్ ప్యాక్స్ ఇవిగో
Recommended image2
Summer Fashion: సమ్మర్‌లో కాటన్ కాకుండా ఏ దుస్తులు బెటర్? కంఫర్ట్, స్టైల్ కోసం బెస్ట్ ఫ్యాబ్రిక్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved