Weight Loss Tips: ఇలా ఉపవాసం చేస్తే.. ఇట్టే బరువు తగ్గుతారట..
Weight Loss Tips: బరువు తగ్గాలనుకునేవారి ఫస్ట్ ఆప్షన్ వాకింగ్. నడక శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే.. బరువు తగ్గడానికి కేవలం నడక సరిపోతుంది. నడకతో పాటు ఉపవాసం కూడా ఎంతగానో ఉపయోగపడుతుందట. అదెలాగో చూద్దాం..

బరువు తగ్గడానికి నడక
ఆరోగ్యంగా ఉండటానికి నడక చాలా మంచిది. గుండె, ఊపిరితిత్తులు, కండరాల ఆరోగ్యానికి నడక ఎంతో మేలు చేస్తుంది. త్వరగా బరువు తగ్గడానికి నడకతో పాటు ఉపవాసం కూడా ఎంతగానో ఉపయోగపడుతుందట. ఎలానో తెలుసుకుందాం.
బరువు తగ్గడానికి
నడక బరువు తగ్గడానికి ఒక మంచి వ్యాయామం, ఇది కేలరీలు బర్న్ చేయడంలో సహాయపడుతుంది. కానీ, బరువు తగ్గడానికి ఇది ఒక్కటే మార్గం కాదు. మీరు బరువు తగ్గడానికి ఇతర వ్యాయామాలతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. వేపుళ్ళు, తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి.
నడక
తిన్న తర్వాత 10 నిమిషాలు నడవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే, ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం 30 నిమిషాలు నడక బరువు నియంత్రణకు సహాయపడుతుంది.
ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ బరువు తగ్గడానికి అత్యంత ప్రాచుర్యం పొందిన మార్గం. ఇదొక ఆహార నియమం. నిర్దిష్ట సమయానికి ఆహారం తీసుకునే పద్దతి. ఈ పద్దతిలో 8 గంటల పాటు తినవచ్చు, ఆ తర్వాత 16 గంటలు ఉపవాసం ఉండాలి. మీరు 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఆహారాన్ని తీసుకోవచ్చు, ఆ తర్వాత 16 గంటలు ఉపవాసం ఉండాలి. ఈ పద్దతి వల్ల కొవ్వు తగ్గుతుంది. తద్వారా బరువు తగ్గుతారు.
గమనిక : రోజూ వ్యాయామం, మంచి ఆహారం, సరైన నిద్ర, ఉపవాసం పాటిస్తే త్వరగా బరువు తగ్గుతారు.