Kidney Health: కిడ్నీ ప్రాబ్లమ్స్‌కు తులసితో చెక్.. ఈ ఆయుర్వేద మొక్కతో ఇన్ని లాభాలా?
Tulsi Tea for Kidney Stones: భారతీయ సంస్కృతిలో తులసికి ఎంతో ప్రాధాన్యత ఉంది. హిందువులు ఈ మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆయుర్వేదం ప్రకారం కిడ్నీ స్టోన్స్ సమస్యను తొలగించడంలో తులసి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దాన్ని ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.

తులసి ప్రాముఖ్యత
భారతీయ సనాతన ధర్మంలో తులసికి ప్రత్యేక స్థానం ఉంది. హిందువులు తులసిని దేవతలా పూజిస్తారు. పవిత్రంగా భావించే తులసిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇందులో విటమిన్లు, సోడియం, ఐరన్ , కాల్షియం వంటి పోషకాలుంటాయి. ఇది మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అంతేకాకుండా కిడ్నీ స్టోన్స్ సమస్యను తులసితో చెక్ పెట్టవచ్చట. ఈ పరిష్కరించడం కోసం తులసిని ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.
కిడ్నీలో రాళ్లు
మానవ శరీరంలో మూత్రపిండాలు చాలా ముఖ్యమైన అవయవాలు. అవి సక్రమంగా పనిచేస్తేనే శరీరంలోని మిగతా అన్ని అవయవాలు సరిగ్గా పని చేస్తాయి. ఈ మధ్యకాలంలో చాలా మందిలో కిడ్నీలో రాళ్లు ఏర్పడుతున్నాయి. దీనికి చాలా కారణాలు ఉండవచ్చు. ఆహారపు అలవాట్లే ప్రధాన కారణం. కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు.. నొప్పి అకస్మాత్తుగా పెరుగుతుంది. దాన్ని భరించడం కష్టం. కొంతమందికి వాంతులు లేదా వికారం, తరచుగా మూత్ర విసర్జన, చలి లేదా అధికంగా చెమట పట్టడం వంటి సమస్యలు కూడా ఉండవచ్చు.
కిడ్నీ స్టోన్స్ సమస్యకు చెక్
కిడ్నీలో రాళ్ల సమస్యకు సకాలంలో చికిత్స చేయకపోతే, దాని పరిమాణం పెరుగుతుంది. రాళ్లను తొలగించడానికి మందులు తీసుకోవడం లేదా శస్త్రచికిత్సనే సరైన మార్గం. కానీ ఇంటి చిట్కాల సహాయంతో, కిడ్నీ రాళ్లను కరిగించి మూత్రం ద్వారా బయటకు పంపవచ్చు. ఆ పవర్ పుల్ మెడిసన్ నే తులసి. దానిని వాడటం వల్ల కిడ్నీ స్టోన్స్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఎలాగంటే?
తులసి టీలో
కిడ్నీ స్టోన్స్ సమస్య ఉంటే తులసి టీ తాగవచ్చు. తులసి టీలో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది రాళ్ల వల్ల వచ్చే నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే.. కిడ్నీలోని చిన్న రాళ్లను కరిగించడంలో సహాయపడుతుంది. తులసిలోని లిథియాసిస్ కిడ్నీ లోని స్టోన్స్ పరిమాణాన్ని విచ్ఛిన్నం చేయడానికి, తగ్గించడానికి సహాయపడుతుంది.
గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోరకు మాత్రమే.. మరిన్ని వివరాల కోసం ఎల్లప్పుడూ నిపుణుడిని లేదా మీ వైద్యుడిని సంప్రదించండి.