MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Sleep:ఈ తప్పులే మీ నిద్రలేమికి కారణాలు.. వాటికి వెంటనే చెక్ పెట్టండి!

Sleep:ఈ తప్పులే మీ నిద్రలేమికి కారణాలు.. వాటికి వెంటనే చెక్ పెట్టండి!

Health Tips: ఉదయం పూట మనం చేసే కొన్ని తప్పుల వల్ల రాత్రిపూట నిద్ర దెబ్బతింటుంది. రాత్రిపూట తగినంత నిద్ర లేకపోతే లేదా గాఢనిద్రకు ఆటంకం కలిగితే, దానివల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంతకీ ఆ తప్పులేంటో తెలుసుకోండి. 

2 Min read
Author : Rajesh K
Published : Jul 24 2025, 05:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
పదేపదే స్నూజ్ బటన్ నొక్కడం
Image Credit : Getty

పదేపదే స్నూజ్ బటన్ నొక్కడం

ఉదయం అలారం మోగిన వెంటనే నిద్రలో నుంచి లేవకుండా  "ఇంకో ఐదు నిమిషాలు" అని 'స్నూజ్' బటన్ నొక్కడం చాలామందికి అలవాటు. ఇలా చేస్తే కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చని భావించినప్పటికీ, వాస్తవానికి ఈ అలవాటు మీ నిద్ర నాణ్యతను తగ్గిస్తుంది. ఇలా పదే పదే చేయడం వల్ల మీరు గాఢనిద్రను పొందలేరు. దీనివల్ల, మీరు ఉత్సాహంగా లేవడానికి బదులుగా, మరింత అలసిపోయి, నీరసంగా ఉంటారు. అలారం మోగిన వెంటనే వెంటనే లేవడమే ఉత్తమ అలవాటు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
మంచంలో ఎక్కువ సమయం గడపడం:
Image Credit : Getty

మంచంలో ఎక్కువ సమయం గడపడం:

రాత్రి నిద్ర సరిగ్గా లేకపోతే ఉదయం అలసటగా అనిపించడం సహజమే. కానీ ఆ కారణంగా ఎక్కువసేపు మంచంలోనే ఉండడం మంచిది కాదు. ఇలా చేయడం వల్ల శరీరానికి శక్తిని ఇవ్వడం కంటే.. మానసికంగా నిరాశ, శారీరకంగా నీరసాన్ని కలిగిస్తుంది. అందుకే, అలారం మోగిన వెంటనే లేచి, తాజా శ్వాసతో రోజును ప్రారంభించడమే సరైన అలవాటు

37
అతిగా కాఫీ తాగడం
Image Credit : Getty

అతిగా కాఫీ తాగడం

ఉదయం నిద్రమత్తు పొయేందుకు చాలామంది ఓ కప్పు కాఫీ  తాగుతారు. కాఫీ ఓ ఉత్తేజ పానీయం అయినప్పటికీ, అతిగా తాగితే.. అది మేలు కంటే కీడే ఎక్కువ చేస్తుంది. అతిగా తాగితే నిద్ర రాక, ఆందోళన వంటి సమస్యలకు దారితీస్తుంది. కాఫీ లోని కాఫిన్ చాలా గంటల పాటు శరీరంలో ఉంచబడుతుంది. అలా ఉదయం తాగిన కాఫీ ప్రభావం రాత్రి నిద్రను భంగం చేస్తుంది.

47
వ్యాయామం మానేయడం:
Image Credit : Getty

వ్యాయామం మానేయడం:

అలసిపోయినప్పుడు వ్యాయామం చేయాలనిపించకపోవచ్చు. కానీ పూర్తిగా మానేస్తే, అది మీ శక్తి స్థాయిని ఇంకా తగ్గించుతుంది. కఠినమైన వ్యాయామాలకన్నా, తేలికపాటి నడక, యోగా లేదా జాగింగ్ చేయడం ఆరోగ్యానికి మేలు. ఈ వ్యాయామాల వల్ల శరీరంలో ఎండార్ఫిన్‌లు విడుదలై శారీరక శక్తి, ఉత్సాహం, మానసిక ఉత్తేజం కలుగుతాయి. అంతేకాకుండా..ఇది రాత్రి గాఢ నిద్ర రావడానికీ ఎంతో సహాయపడుతుంది. 

57
తప్పుడు ఆహారాన్ని తీసుకోవడం
Image Credit : Getty

తప్పుడు ఆహారాన్ని తీసుకోవడం

నిద్ర తక్కువగా ఉన్నప్పుడు.. శరీరం తక్షణ శక్తి కోసం చక్కెర, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహారాల్ని కోరుతుంది. అయితే ఇవి ఆ సమయంలో ఊహించిన శక్తిని ఇచ్చినా, వెంటనే రక్తంలో చక్కెర స్థాయి పడిపోయి, మరింత అలసట, చిరాకు కలిగిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రోటీన్, ఫైబర్, మంచి కొవ్వులు అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవడం ఉత్తమం. పండ్లు, కూరగాయలు, బాదం, వేరుశనగ, విత్తనాలు వంటివి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల రోజంతా స్థిరమైన శక్తిని అందుతుంది. 

67
ఎక్కువ సేపు ఫోన్ చూడటం :
Image Credit : Getty

ఎక్కువ సేపు ఫోన్ చూడటం :

అలసటగా ఉన్నప్పుడు చాలా మంది ఫోన్, ల్యాప్‌టాప్, టీవీ లాంటి స్క్రీన్‌లను చూస్తూ సమయం గడుపుతారు. కానీ, ఈ స్క్రీన్‌ల నుండి వెలువడే నీలి కాంతి శరీరంలో మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. మెలటోనిన్ అనేది నిద్రను ప్రేరేపించే హార్మోన్. దీని ఉత్పత్తి తగ్గితే.. రాత్రిళ్ళు మీకు నిద్ర రావడం కష్టం. నిద్ర లేమి మరింత పెరుగుతుంది. అందుకే  ఉదయం లేచిన వెంటనే స్క్రీన్‌లకు దూరంగా ఉండటం, సహజ కాంతిలో కొంతసేపు ఉండటం, లేదా పుస్తకం చదవడం మంచి అలవాటు. 

77
పగటి నిద్ర ఎక్కువైతే..
Image Credit : Getty

పగటి నిద్ర ఎక్కువైతే..

రాత్రి నిద్రలేమి కారణంగా పగటిపూట ఎక్కువసేపు నిద్రపోవాలనుకోవడం సహజం. కానీ, 30 నిమిషాలకుపైగా నిద్రపోతే, అది శరీరంలోని సహజ బయోలాజికల్ క్లాక్‌ను దెబ్బతీస్తుంది. ఫలితంగా రాత్రి నిద్ర రాక, నిద్ర సమయంలో గందరగోళం కలగవచ్చు. మీకు నిజంగా అలసటగా అనిపిస్తే.. 15–20 నిమిషాల చిన్న నిద్ర సరిపోతుంది. ఇది మీ శరీరానికి వెంటనే శక్తిని, ఉత్సాహాన్ని అందిస్తుంది.రాత్రి నిద్రను కూడా ప్రభావితం చేయదు. 

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఆరోగ్యం
మహిళలు
పురుషులు
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Drinking Water Before Brushing: ఉదయం బ్రష్‌ చేయకుండా నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?
Recommended image2
ఎప్పుడూ ఒక‌వైపే న‌మిలి తింటున్నారా.? ఏం జ‌రుగుతుందో తెలిస్తే వెంట‌నే ఆపేస్తారు
Recommended image3
ట్యాబ్లెట్స్ కంటే ఇంజ‌క్ష‌న్‌తో త్వ‌ర‌గా రిలీఫ్ ఎందుకు వ‌స్తుంది? వెనుకున్న సైన్స్ ఏంటంటే?
Related Stories
Recommended image1
Sleep: అర్థరాత్రి వేళ ఆ సమయాల్లో మెళకువ వస్తుందా ? అయితే.. జాగ్రత్త..
Recommended image2
Sleep: తక్కువ నిద్రపోతున్నారా? త్వరలో గజినీలా మారడం పక్కా !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved