Sleep: తక్కువ నిద్రపోతున్నారా? త్వరలో గజినీలా మారడం పక్కా !
Sleeping: మనిషికి నిద్ర చాలా అవసరం. సగటున 7 - 8 గంటలపాటు నిద్రపోవాలి. అలా కాకుండా తక్కువ సమయం నిద్రించే వారికి వివిధ రకాల వ్యాధులు చుట్టుముట్టే అవకాశం ఉంది. అయితే తక్కువ నిద్రపోయే వారిలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయో తెలుసుకుందాం..

నిద్రలేమి
Sleeping: తక్కువ నిద్ర ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది ఆలోచనశక్తి, అర్థం చేసుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. మెదడుపై ఒత్తిడి పెరిగి జ్ఞాపకశక్తి మందగిస్తుంది. చిన్నవాళ్లు, పెద్దవాళ్లు రోజూ కనీసం 7–8 గంటలు నిద్రించడం అవసరం. సరైన నిద్ర మెదడును కాపాడుతుంది, అల్జీమర్స్ వంటి న్యూరోలాజికల్ సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
అల్జీమర్స్ అంటే ఏమిటి?
అల్జీమర్స్ ఒక న్యూరోలాజికల్ వ్యాధి, ఇది మెదడును ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి వల్ల క్రమంగా జ్ఞాపకశక్తిని తగ్గించి, ఆలోచనా సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. రోజువారీ పనులను కూడా స్వయంగా చేసుకోలేకపోతారు. మెదడులో బిటా-అమిలాయిడ్, టావ్ అనే ప్రోటీన్లు అధికమవడం వల్ల మెదడు కణాలు నశించాయి. సాధారణంగా ఇది వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తుంది, అందువల్ల దీనిని "వృద్ధాప్య మరపు వ్యాధి"గా కూడా పరిగణిస్తారు.
నిద్రలేమి, అల్జీమర్స్ కి సంబంధం?
గాఢ నిద్రలో మెదడు తనను తాను శుభ్రపరుచుకునే ప్రక్రియ జరుగుతుంది. ఈ సమయంలో అమిలాయిడ్ ప్రోటీన్లు వంటి వ్యర్థ పదార్థాలు తొలగిస్తాడు. నిద్రలేమి వలన ఈ ప్రోటీన్లు మెదడులో పేరుకుపోయి, అల్జీమర్స్‌కు దారితీస్తాయి. అందువల్ల నాణ్యమైన నిద్ర అల్జీమర్స్‌ను నిరోధించడంలో కీలకం.
వైద్యులు ఏం చెబుతున్నారు?
మెదడు శుభ్రపరచడం: నిద్ర సమయంలో మెదడు పగటిపూట ఏర్పడే వ్యర్థాలను, ముఖ్యంగా అమిలాయిడ్ ప్రోటీన్లను, శుభ్రపరుస్తుంది. సరైన నిద్ర లేకపోతే ఈ వ్యర్థాలు మెదడులో చేరిపోతాయి. దీని వల్ల జ్ఞాపకశక్తి మందగించి, కాలక్రమేణా అల్జీమర్స్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి మెదడు ఆరోగ్యానికి నాణ్యమైన నిద్ర ఎంతో అవసరం.
జ్ఞాపకశక్తి లోపం: తక్కువ నిద్ర జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తుంది. మొదట ఇది సాధారణ మరపుగా కనిపించవచ్చు, కానీ దీర్ఘకాలంగా చూస్తే ఇది అల్జీమర్స్ వంటి న్యూరోలాజికల్ వ్యాధికి దారితీయవచ్చు. మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు 7–8 గంటలు నాణ్యమైన నిద్ర తప్పనిసరి.
భయంకరమైన కలలు
కొన్ని పరిశోధనలు చెబుతున్నట్లు, వారానికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువసార్లు చెడు కలలు కలగడం అల్జీమర్స్‌కు ముందస్తు సూచన కావచ్చు. ఇది నిద్ర నాణ్యత , మెదడు ఆర్యోగం మధ్య గల బలమైన సంబంధాన్ని తెలియజేస్తుంది. చెడు కలలు, గాఢ నిద్ర లోపం, మెదడు శుభ్రపరిచే ప్రక్రియకు అంతరాయం కలిగించవచ్చు, దీని వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుంది.
అల్జీమర్స్ ప్రారంభ లక్షణాలు
- నిద్రలో ఇబ్బంది
- రాత్రి తరచుగా మేల్కొనడం
- కాళ్లు ఆడించే సమస్య (Restless Leg Syndrome)
- పగటిపూట అలసట, నిద్రపోతుండటం
- తీవ్రమైన, గందరగోళమైన కలలు
ఈ లక్షణాలు మెదడులో మార్పుల సంకేతాలు కావచ్చు. అవి అల్జీమర్స్ వంటి న్యూరోలాజికల్ వ్యాధుల ప్రారంభ సూచనలుగా పరిగణించబడుతున్నాయి.
ఏమి చేయాలి?
మెదడు ఆరోగ్యానికి నిద్ర కీలకం. వైద్యుల ప్రకారం, మంచి నిద్ర అల్జీమర్స్ వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. ఇందుకోసం:
- ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, మేల్కొనడం అలవాటు చేసుకోవాలి.
- నిద్రించే గదిలో చీకటి, నిశ్శబ్దం, చల్లగా ఉండేలా చూసుకోండి.
- వ్యాయామం నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.
ఈ చిన్నజాగ్రత్తలు మెదడు శుభ్రత, జ్ఞాపకశక్తిని కాపాడడంలో ఎంతో దోహదపడతాయి.