MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Health
  • Tamarind Water: రోజూ చింతపండు రసం తాగితే ఏం జరుగుతుందో తెలుసా? శరీరంలో వచ్చే మార్పులివే!

Tamarind Water: రోజూ చింతపండు రసం తాగితే ఏం జరుగుతుందో తెలుసా? శరీరంలో వచ్చే మార్పులివే!

Tamarind Water: చింతపండును కూరలు, చారు, పప్పుల్లో వేస్తాం. సాంబార్ చేస్తాం, పులిహోర చేసుకుంటాం. చింతపండుతో ఆ వంటలకు వచ్చే రుచే వేరు. ఈ చింతపండుతో హెల్త్ బెనిఫిట్స్ బోలెడు ఉన్నాయి. రోజూ చింతపండు రసం తాగితే రోగాలకు చెక్ పెట్టొచ్చు.  

2 Min read
Author : Nandini Arava
Published : May 14 2026, 01:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
చింతపండు రసంతో శరీరంలో జరిగే మార్పులు ఇవే!
Image Credit : Getty

చింతపండు రసంతో శరీరంలో జరిగే మార్పులు ఇవే!

చింతపండు కేవలం వంటలకే కాదు..మన ఆరోగ్యానికి ఒక అద్భుతమైన సంజీవని లాంటిది. రోజూ ఉదయాన్నే చింతపండు నానబెట్టిన నీటిని తాగడం వల్ల నేటి ఆధునిక జీవనశైలి కారణంగా వచ్చే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఇందులో ఉండే మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
రోగనిరోధక శక్తిని పెంచే చింతపండు
Image Credit : Getty

రోగనిరోధక శక్తిని పెంచే చింతపండు

చింతపండులో దాగున్న పోషకాల గని మన శరీరానికి ఒక పవర్‌హౌస్‌లా పనిచేస్తుంది. దీనిలో ఉండే విటమిన్లు, ఖనిజ లవణాలు మనల్ని రోజువారీ ఇన్ఫెక్షన్ల నుండి కాపాడటమే కాకుండా, దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చింతలో ఉండే విటమిన్ 'సి' రోగనిరోధక శక్తిని పెంచుతుంది. యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా కాపాడతాయి. వృద్ధాప్య ఛాయలను తగ్గించి, చర్మం ఎల్లప్పుడూ కాంతివంతంగా ఉండేలా చేస్తాయి. చింతపండులో థయామిన్, రైబోఫ్లేవిన్, నియాసిన్ వంటి బి-కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనం తినే ఆహారాన్ని శక్తిగా మార్చడంలో, నరాల వ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో, మెదడు చురుకుదనాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

Related Articles

Related image1
Tea: హోటల్ టీ అంత రుచిగా ఎందుకుంటుందో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే!
Related image2
Mixer Grinder: మిక్సీని 3 నిమిషాల కంటే ఎక్కువ వాడితే ఏమవుతుందో తెలుసా?
37
గ్యాస్ సమస్యలు, అల్సర్లు ఉన్నవారు చింతపండు తీసుకోకూడదు
Image Credit : Asianet News

గ్యాస్ సమస్యలు, అల్సర్లు ఉన్నవారు చింతపండు తీసుకోకూడదు

భోజనం చేసిన తర్వాత చాలా మంది ఎదుర్కొనే ప్రధాన సమస్య కడుపు ఉబ్బరం లేదా పొట్ట భారంగా అనిపించడం. దీనికి చింతపండు రసం ఒక అద్భుతమైన సహజ ఔషధంగా పనిచేస్తాయని గ్యాస్ట్రోఎంటరాలజీ  నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు. 

చింతపండు నీరు జీర్ణక్రియకు ఎంతో మేలు చేసినప్పటికీ, తీవ్రమైన గ్యాస్ట్రిక్ అల్సర్లు లేదా ఎసిడిటీ ఉన్నవారు దీనిని ఖాళీ కడుపుతో తీసుకోకపోవడమే మంచిది. మీ శరీర తత్వాన్ని బట్టి, పరిమిత పరిమాణంలో తీసుకుంటేనే ఆశించిన ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. ఎక్కువగా తాగితే విరేచనాలు అయ్యే ప్రమాదం ఉంది.

47
ఆహారం జీర్ణమై కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది
Image Credit : Getty

ఆహారం జీర్ణమై కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది

చింతపండులో ఉండే సహజ ఆమ్లాలు శరీరంలోని జీర్ణ రసాలను, ఎంజైమ్‌లను ప్రేరేపిస్తాయి. దీనివల్ల మనం తిన్న ఆహారం ఎలాంటి ఆటంకం లేకుండా చాలా సులభంగా జీర్ణమవుతుంది. ఫలితంగా, గ్యాస్, కడుపు ఉబ్బరం, పొట్టలో అసౌకర్యం వంటి సమస్యలు రావు. 

చింతపండు రసంలో సహజంగానే నీటి శాతం, ఎలక్ట్రోలైట్లు (Electrolytes) అత్యధికంగా ఉంటాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు లేదా అలసటగా అనిపించినప్పుడు ఈ నీటిని తాగడం వల్ల శరీరం వెంటనే యాక్టివ్ అవుతుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా, రోజంతా యాక్టివ్‍గా ఉండటానికి ఇది ఒక అద్భుతమైన నేచురల్ డ్రింక్.

57
పీరియడ్స్ నొప్పి నివారణకు చింతపండు రసం బెస్ట్ మెడిసిన్
Image Credit : Getty

పీరియడ్స్ నొప్పి నివారణకు చింతపండు రసం బెస్ట్ మెడిసిన్

మధ్యాహ్నకాగానే చాలా మందిలో బద్ధకం, నీరసంగా అయిపోతుంటారు. అలాంటప్పుడు ఒక గ్లాసు చింతపండు నీళ్లు తాగితే, అది శరీరానికి తక్షణ శక్తిని అందించి నీరసాన్ని మాయం చేస్తుంది. అంతేకాదు మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు శాశ్వతంగా దూరమవుతాయి. నెలసరి సమయంలో వచ్చే కడుపునొప్పి,  Cramps మహిళలను తీవ్రంగా వేధిస్తాయి. చింతపండులో ఉండే యాంటీ ఇన్‍ఫ్లమేటరీ గుణాలు, పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని తగ్గించి, శరీరానికి మంచి ఉపశమనాన్ని ఇస్తాయి.

67
గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది
Image Credit : Getty

గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది

చింతపండు నీళ్లు మన గుండెను పటిష్టంగా ఉంచడంలో ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు, శరీరంలో వచ్చే మార్పులను అదుపు చేయడంలో సహాయపడుతుంది. చింతపండు నీళ్లలో ఉండే పీచు పదార్థం, యాంటీఆక్సిడెంట్లు రక్తనాళాల్లో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని నివారించి, రక్తప్రసరణ సక్రమంగా సాగేలా చేస్తుంది. ఫలితంగా గుండెపోటు వంటి తీవ్రమైన గుండె జబ్బుల ముప్పు చాలా వరకు తగ్గుతుంది.

77
అనారోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్లను అడిగి తీసుకోవడం మంచిది
Image Credit : Getty

అనారోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్లను అడిగి తీసుకోవడం మంచిది

చింతపండు నీళ్లను మరీ ఎక్కువగా తాగినా సమస్యే. ఇది కొన్ని రకాల మందుల పనితీరుకు అడ్డుపడవచ్చు. కాబట్టి, మోతాదుకు మించి తీసుకోకపోవడమే మంచిది. అనారోగ్య సమస్యలు ఉన్నవారు…డాక్టర్లను సంప్రదించి తాగడం ఉత్తమం. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Related Stories
Recommended image1
Tea: హోటల్ టీ అంత రుచిగా ఎందుకుంటుందో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే!
Recommended image2
Mixer Grinder: మిక్సీని 3 నిమిషాల కంటే ఎక్కువ వాడితే ఏమవుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved