Telugu

Mixer Grinder: మిక్సీని 3 నిమిషాల కంటే ఎక్కువ వాడితే ఏమవుతుందో తెలుసా?

Telugu

ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు

మిక్సీ వాడకం ఎంత సులువో, అజాగ్రత్తగా ఉంటే అంత ప్రమాదం. చిన్న పొరపాట్లు ఒక్కోసారి పెద్ద ప్రమాదాలకు, పేలుళ్లకు దారితీయొచ్చు. మిక్సీ సురక్షితంగా ఉండాలంటే ఈ 5 తప్పులు అస్సలు చేయకండి.

Image credits: Google Gemini
Telugu

జార్‌ను ఓవర్‌లోడ్ చేయడం

జార్ నిండుగా ఉంటే బ్లేడ్లు తిరగడానికి కష్టమవుతుంది. దీనివల్ల మోటార్ వేడెక్కి కాలిపోవడం లేదా షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. జార్‌లో సగం వరకే వేయడం సురక్షితం.

Image credits: GEMINI
Telugu

30 సెకన్ల రూల్

మిక్సీని ఏకధాటిగా 3-5 నిమిషాలు వాడొద్దు. దీనివల్ల మోటార్ వేడెక్కి పేలే ప్రమాదముంది. ప్రతి 30 సెకన్లకు ఆపుతూ '30 సెకన్ల రూల్' పాటిస్తే మిక్సీ సురక్షితంగా, ఎక్కువ కాలం మన్నుతుంది.

Image credits: Amazon\Flipkart website
Telugu

ఎయిర్ వెంట్స్ బ్లాక్ అవ్వడం

మిక్సీ కింద భాగంలో వేడి గాలి బయటకు వెళ్లడానికి చిన్న రంధ్రాలు ఉంటాయి. ఈ వెంట్స్ దుమ్ము, ధూళితో మూసుకుపోతే, మోటార్ ఓవర్‌హీట్ అయి మిక్సీ పేలిపోయే ప్రమాదం ఉంది.

Image credits: gemini
Telugu

జార్ లీకేజీ

మిక్సీ జార్ నుంచి నీళ్లు లేదా జ్యూస్ లీక్ అవుతుంటే, అది మోటార్ లోపలికి వెళ్లి షార్ట్ సర్క్యూట్ లేదా మంటలు చెలరేగడానికి కారణం కావచ్చు. లీకేజీని గమనించిన వెంటనే దాన్ని సరిచేయాలి.

Image credits: Amazon\Flipkart website
Telugu

తప్పుడు సాకెట్ వాడకం

హై పవర్ మిక్సర్లను నాసిరకం ఎక్స్‌టెన్షన్ బోర్డులతో అస్సలు వాడొద్దు. ఎప్పుడూ గోడకు ఉండే సురక్షితమైన, సరైన వాల్ సాకెట్‌లనే ఉపయోగించాలి.

Image credits: Amazon Website
Telugu

బ్లేడ్లు జామ్ అవ్వడం

జార్ బ్లేడ్లు సరిగ్గా తిరగకపోతే, మోటార్‌పై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే, ఎప్పటికప్పుడు బ్లేడ్లను శుభ్రం చేయాలి. అవి సులభంగా తిరుగుతున్నాయో లేదో చెక్ చేసుకోవాలి.

Image credits: Amazon Website
Telugu

దుమ్ము, ధూళి

మిక్సీని వాడుతున్నప్పుడు మోటార్‌పై దుమ్ము, జిడ్డు పేరుకుపోతుంది. దీనివల్ల స్పార్కింగ్, ఓవర్‌హీటింగ్ ప్రమాదం పెరుగుతుంది. అందుకే మిక్సీ మోటార్ భాగాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.

Image credits: Gemini

Cotton Night Dress: స్టైల్, కంఫర్ట్ కోసం ఈ కాటన్ నైటీస్ బెస్ట్ ఆఫ్షన్!

Hairstyles: రెండు నిమిషాల్లో వేసుకోగల క్యూట్ హెయిర్ స్టైల్స్

Mirror Work Bangles: చేతులకు కొత్త మెరుపునిచ్చే మిర్రర్ వర్క్ గాజులు

Silver Anklets: సన్నటి వెండి పట్టీలు.. డైలీవేర్ కి సూపర్ గా ఉంటాయి