Stomach cancer: ఈ లక్షణాలు కనిపిస్తే.. కడుపు క్యాన్సర్ కావొచ్చు!
Stomach cancer: ఈ రోజుల్లో కడుపు క్యాన్సర్ బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్యాన్సర్ ను ముందుగానే గుర్తించి, సరైన చికిత్స తీసుకోవాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం. ఈ క్యాన్సర్ లక్షణాలు ఏమిటో తెలుసుకోండి.

కడుపు క్యాన్సర్
క్యాన్సర్‌లో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో ఒకటి జీర్ణకోశ క్యాన్సర్. ప్రపంచ క్యాన్సర్ పరిశోధనా సంస్థ ప్రకారం.. అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ ల్లో జీర్ణకోశ క్యాన్సర్ ఒకటి. ఈ క్యాన్సర్ మహిళల కంటే పురుషులను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారిలో ఈ సమస్య పెరుగుతుంది. ముఖ్యంగా బీడీలు, సిగరెట్లు తాగేవారికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ. జీర్ణకోశ క్యాన్సర్ చాలా ప్రమాదకరమైన వ్యాధి. కానీ ప్రారంభ దశలోనే దీనిని గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు. జీర్ణకోశ క్యాన్సర్ లక్షణాలు సాధారణంగా ఉన్నప్పటికీ, అవి తీవ్రమైతే పరిస్థితిని మరింత దిగజారుతుంది. జీర్ణకోశ క్యాన్సర్ (కడుపు క్యాన్సర్) లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం..
గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లక్షణాలు
1. ఆకలి లేకపోవడం: గ్యాస్ట్రిక్ క్యాన్సర్ మొదటి లక్షణం ఇది. ఒక వ్యక్తి సాధారణం కంటే తక్కువగా తినడం ప్రారంభిస్తే, దాని ప్రభావం అతని బరువుపై పడుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఆకలి లేకపోవడం లేదా కొద్దిగా తిన్న కూడా కడుపు నిండినట్లు అనిపిస్తుంది. అయితే.. దీనిని నిర్లక్ష్యం చేయకూడదు.
2. కడుపు నొప్పి : కడుపు నొప్పి సాధారణ సమస్యే. అయినప్పటికీ, నొప్పి కొనసాగితే లేదా నొప్పి తీవ్రమైతే.. అది గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లక్షణం కావచ్చు. ఇది కాకుండా.. నిరంతరం అసౌకర్యంగా అనిపిస్తే, అది కూడా ఈ క్యాన్సర్ లక్షణమే.
ఇతర లక్షణాలు
3. తీవ్ర అలసట, బలహీనత : ఎటువంటి కారణం లేకుండా తీవ్ర అలసట, బలహీనత ఉంటే.. అది జీర్ణకోశ క్యాన్సర్ లక్షణం కావచ్చు. ఎందుకంటే శరీరంలో క్యాన్సర్ కణాలు పెరిగినప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి. మీరు ప్రతిరోజూ అలసిపోయినట్లు అనిపిస్తే దానిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
4. కారణం లేకుండా బరువు తగ్గడం: ఎటువంటి కారణం లేకుండా మీ బరువు తగ్గుతూ ఉంటే దానిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఏమిటో తెలుసుకోండి. ఎందుకంటే ఇది కూడా జీర్ణకోశ క్యాన్సర్ లక్షణం కావచ్చు. జీర్ణకోశ క్యాన్సర్ ఉన్నప్పుడు ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. శరీరానికి కావాల్సిన పోషకాలు లభించవు. దీనివల్ల బరువు తగ్గుతుంది.
మరికొన్ని లక్షణాలు
5. జీర్ణ సమస్యలు : కడుపులో గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను ఎదుర్కొంటుంటే దానిని నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే ఇవి జీర్ణకోశ క్యాన్సర్ లక్షణాలు కావచ్చు.
ఇతర లక్షణాలు :
- వికారం, వాంతులు కూడా జీర్ణకోశ క్యాన్సర్ లక్షణం కావొచ్చు.
- మీరు తినేటప్పుడు ఆహారాన్ని మింగడంలో ఇబ్బంది పడితే.. అది జీర్ణకోశ క్యాన్సర్ లక్షణం.
- మలం నల్లగా రావడం లేదా రక్తం పడటం జీర్ణకోశ క్యాన్సర్ లక్షణాలలో ఒకటి.
- కొన్నిసార్లు చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారడం జీర్ణకోశ క్యాన్సర్ లక్షణం కావచ్చు.
గమనిక : పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.