MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Health
  • Health tips: ఆఫీసులో అలసిపోతున్నారా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే!!

Health tips: ఆఫీసులో అలసిపోతున్నారా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే!!

Health tips: ఆఫీసులో కాసేపు పనిచేసినా అలసిపోతున్నారా? శరీరంలోనూ, మనసులోనూ అలసటగా అనిపిస్తుందా? ఈ ఆరు చిట్కాలు పాటిస్తే అలసట తగ్గి, ఉత్సాహంగా పనిచేయవచ్చు.

2 Min read
Author : Rajesh K
Published : Jul 08 2025, 09:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పని ఒత్తిడిని తగ్గించాలంటే..
Image Credit : stockPhoto

పని ఒత్తిడిని తగ్గించాలంటే..

పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి మొదట మీ దినచర్యను పరిశీలించుకోవాలి. ఉదయం నుండి రాత్రి వరకు ఏమి చేస్తారు? ఎంత సేపు పని చేస్తారు? ఎంత సేపు విశ్రాంతి తీసుకుంటారు? అనేది నోట్‌బుక్ లేదా మొబైల్‌లో రాసుకోండి. దాంతో పాటు ఏ సమయంలో ఎక్కువ అలసట వస్తుందో ? ఏ పనులు శరీరానికి, మనస్సుకు ఒత్తిడిగా మారుతున్నాయో గుర్తించవచ్చు. చిన్నమార్పులు కూడా పెద్ద తేడా తీసుకురాగలవు. ఉదాహరణకు గంటలకొద్ది కూర్చునే పని చేస్తే, ప్రతి గంటకోసారి లేచి నడవడం లేదా కాసేపు కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకోవడం వంటివి అలసటను తగ్గించడంలో ఎంతో సహాయపడతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
సరైన ప్రణాళిక
Image Credit : stockPhoto

సరైన ప్రణాళిక

సమయాన్ని సరిగ్గా వినియోగించుకోకపోవడం కూడా పని ఒత్తిడికి ఒక కారణం. చాలా పనులు ఉన్నట్లుగా అనిపించినా, సరైన ప్రణాళికతో వాటిని సులభంగా నిర్వహించవచ్చు.  ముందుగా ఏ పనులు పూర్తి చేయాలో నిర్ణయించుకుని, చేయాల్సిన పనుల జాబితాను రాసుకోవడం వల్ల ఏదీ మర్చిపోకుండా, పనులను సక్రమంగా చేయవచ్చు. ఒకేసారి ఒక పనిపై మాత్రమే దృష్టి పెట్టండి. మీకు సమయం లేనప్పుడు లేదా ఇప్పటికే చాలా పని ఉన్నప్పుడు, అదనపు బాధ్యతలను తీసుకోవడానికి నిరాకరించడం నేర్చుకోండి. ఇది మీ సమయాన్ని, శక్తిని ఆదా చేస్తుంది.

36
ఆఫీస్ పనిని ఇంటికి తీసుకురావద్దు
Image Credit : stockPhoto

ఆఫీస్ పనిని ఇంటికి తీసుకురావద్దు

ఆఫీస్ పని ముగిసిన తర్వాత కూడా ఈమెయిల్స్ చెక్ చేయడం, ఫోన్ కాల్స్ తీసుకోవడం, పని గురించి ఆలోచించడం వల్ల మీ విశ్రాంతి సమయం దెబ్బతింటుంది. ఇది వ్యక్తిగత జీవితం, కుటుంబ సంబంధాలపై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే,  ఉద్యోగానికి, వ్యక్తిగత జీవితానికి మధ్య స్పష్టమైన గీతను గీయాలి. ఇంట్లో ఉన్నప్పుడు కుటుంబంతో, స్నేహితులతో సమయం గడపడం, మీకు ఇష్టమైన పనుల్లో పాల్గొనండి. ఇలా చేస్తే మీ మనసు ఉల్లాసంగా మారుతుంది. 

46
 వృత్తి, వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యత
Image Credit : stockPhoto

వృత్తి, వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యత

పనికి ప్రాధాన్యత ఇవ్వడంలో తప్పు లేదు, కానీ వ్యక్తిగత జీవితం, కుటుంబం, స్నేహితులు, వినోదం, వ్యాయామం, విశ్రాంతి కూడా ముఖ్యమే. ఇవన్నీ సమతుల్యంగా ఉండాలి.  దేని ప్రాధాన్యత తగ్గినా మిగతావి కూడా ప్రభావితమవుతాయి. ఉదాహరణకు తగిన విశ్రాంతి లేకుండా నిరంతరం పనిచేస్తే శారీరక, మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. కాబట్టి, వారాంతాలు లేదా సెలవులు వచ్చినప్పుడు పని పక్కనబెట్టి పూర్తిగా రిలాక్స్ అవ్వండి. ప్రయాణాలు చేయండి, పుస్తకాలు చదవండి, మీకు ఇష్టమైన వాటితో సమయం గడపండి. ఇలాంటివి  మిమ్మల్ని తిరిగి ఉత్సాహంగా మార్చుతుంది.

56
ఆనందానికి కారణం ఆరోగ్యమే
Image Credit : stockPhoto

ఆనందానికి కారణం ఆరోగ్యమే

శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనసు ఉత్సాహంగా, పని చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అందుకే పోషకాహారం, వ్యాయామం, నిద్ర  ఈ మూడింటిపైనా శ్రద్ధ వహించాలి. జంక్ ఫుడ్‌కు బదులు కూరగాయలు, పండ్లు, ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవాలి. రోజుకు కనీసం 2–3 లీటర్ల నీరు తాగాలి. ప్రతి రోజు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయండి. ఇవి మీ శరీరాన్ని చురుకుగా, మనసును ఉల్లాసంగా ఉంచుతుంది. అలాగే 7–8 గంటల నిద్ర శరీరానికి పూర్తిస్థాయి విశ్రాంతినిస్తూ, తదుపరి రోజుకు శక్తిని అందిస్తుంది. 

66
ఒత్తిడిని ఎదుర్కొనలేకపోతే…?
Image Credit : stockPhoto

ఒత్తిడిని ఎదుర్కొనలేకపోతే…?

కొన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా పని ఒత్తిడిని తట్టుకోలేకపోవచ్చు. అలాంటి సమయంలో, మీరు ఒంటరిగా బాధపడాల్సిన అవసరం లేదు. మీ మనస్థితి గురించి సహోద్యోగులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడండి . ఇలా చెప్పుకోవడం వల్ల మనసుకు ఊరట కలుగుతుంది. అవసరమైతే.. కౌన్సెలర్ లేదా మానసిక ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి. వారు మీకు సరైన మార్గదర్శకత్వం అందించి, ఈ ఒత్తిడి నుండి బయటపడటానికి సహాయం చేస్తారు.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఆరోగ్యం
ఆహారం
మహిళలు
పురుషులు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Recommended image2
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image3
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Related Stories
Recommended image1
Oral Health Tips: నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిట్కాలు ఫాలోకండి..
Recommended image2
Health Tips: ఈ పండ్లు తిన్న తర్వాత వాటర్ అస్సలు తాగద్దు.. ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved