Health Tips: ఈ పండ్లు పొరపాటున కూడా తినకండి.. ప్రాణాలకే ముప్పు
Seedless Fruits: మార్కెట్లో విత్తనాలు లేని పండ్లు విరివిగా దొరుకుతున్నాయి. తినడానికి సులభం కాబట్టి చాలామంది వీటిని ఇష్టపడుతున్నారు. కానీ విత్తన రహిత పండ్లను తినడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా?

విత్తన రహిత పండ్లు
ప్రస్తుతం వాణిజ్య ప్రయోజనాల కోసం తయారుచేసిన విత్తనరహిత పండ్లు మార్కెట్‌లో విస్తృతంగా లభ్యమవుతున్నాయి. సహజంగా విత్తనాలుండే పండ్లను హైబ్రిడ్ విధానంలో విత్తనాలు లేకుండా మార్చుతున్నారు. అయితే వీటి దుష్ప్రభావాలపై ప్రజలు శ్రద్ధ చూపడం లేదు. వైద్యుల ప్రకారం.. ఈ రకాల పండ్లు దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. అందుకే, సహజ పండ్లను ఎంచుకోవడం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు.
దుష్ప్రభావాలు
విత్తన రహిత పండ్లు ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తాయి. మానవుడు తన స్వలాభం కోసం వాటి సహజ రీతిని మార్చేస్తున్నాడు. కాలానుగుణంగా జన్యుపరమైన చేస్తూ.. పండ్ల స్వభావాన్ని మార్చేస్తున్నాడు. ఉదాహరణకు, 2000 సంవత్సరాల క్రితం అరటిలో పెద్ద విత్తనాలు ఉండేవి, కానీ, ఇప్పుడు అవి కనిపించకుండా పోయాయి. దీని వల్ల ప్రయోజనాలేమో గానీ, వ్యాధులు పెరిగే అవకాశం ఉంది.
కార్పొరేట్ల చేతుల్లోకి
వాస్తవానికి పండ్ల విత్తనాల్లో పుష్కలంగా ఔషధ గుణాలు ఉంటాయి. ఉదాహరణకు ద్రాక్ష విత్తనాల్లోని రెస్వెరాట్రాల్ అనే రసాయనం ఉంటుంది. ఇందులో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉంటాయి. విదేశాల్లో వీటికి గిరాకీ ఎక్కువ. కానీ, మనదేశంలో విత్తనాలున్న పండ్లను నిర్లక్ష్యం చేస్తున్నారు. విత్తనరహిత పండ్ల తింటున్నారు. ఈ వినియోగం పెరిగితే.. సహజ పరాగసంపర్కం తగ్గి, భవిష్యత్తులో విత్తనాల కోసం కార్పొరేట్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఈ పండ్ల వినియోగం అధికం
విత్తన రహిత పండ్లను ‘పార్థినోకార్పిక్’ పద్ధతిలో సాగు చేస్తారు. ఇందులో ఆక్సిన్ అనే రసాయనాన్ని వాడటం వల్ల గుజ్జు ఎక్కువగా, విత్తనాలు లేకుండా పండ్లు ఏర్పడతాయి. తియ్యగా ఉండటంతో ప్రజలు, జ్యూస్ షాపుల్లో వీటినే ఎక్కువ వినియోగిస్తున్నారు.
ప్రకృతికి విరుద్ధంగా
విత్తన రహిత పండ్ల వల్ల కొన్ని అంటువ్యాధులు రావొచ్చు. క్యాన్సర్ ప్రమాదం కూడా ఎక్కువేనని పరిశోధకులు చెబుతున్నారు. వీటిలోని రసాయనాల వల్ల అలెర్జీలు, జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. జన్యుమార్పులతో పండిన ఈ పండ్లను తినడం వల్ల.. జన్యువుల్లో మార్పులు సంభవించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా, ఈ పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు తక్కువగా ఉంటాయి.
ఆ పండ్లే ఆరోగ్యానికి మేలు
వ్యాధుల నివారణ కోసం విత్తన రహిత పండ్లను సాగు చేస్తున్నారు. అయితే.. ఈ సాగులో అధికంగా ఎరువులు, పురుగుమందులు వాడే అవకాశం ఉంది. దీనివల్ల పండ్లలో సహజ పోషకాలు తగ్గిపోయి, రుచి కూడా మారుతుంది. ఈ పండ్లు ఆరోగ్యానికి హానికరమని తేల్చలేనప్పటికీ, నిపుణుల అభిప్రాయం ప్రకారం సహజంగా పండ్లే పండ్లు, కూరగాయలే ఆరోగ్యానికి మేలు. కాబట్టి, విత్తనాలున్న పండ్లను తినడం అలవాటు చేసుకోవడం ఆరోగ్య రీత్యా ఉత్తమం.