ఆకలి ఎందుకు ఎక్కువ అవుతుంది?
కొంతమందికి కడుపు నిండా తిన్నా గానీ మళ్లీ ఆకలి అవుతూనే ఉంటుంది. కానీ ఇలా ఆకలి అవుతుంది కదా అని ఎప్పుడు పడితే అప్పుడు అతిగా తినేస్తే మాత్రం మీ బరువు పెరగడమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అవును ఇలా తినడం ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
మీకు ఎప్పుడూ ఆకలి అవుతుందా? తిన్న కొద్ది సేపటికే మళ్లీ ఏదైనా తినాలనిపిస్తుందా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టేనంటున్నారు నిపుణులు. అవును ఈ అలవాటు మీ శరీరం లోపల సంభవించే కొన్ని తీవ్రమైన వ్యాధులను సూచిస్తుందని నిపుణులు అంటున్నారు. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఆకలి పెరగడానికి కారణాలు
హైపోగ్లైసీమియా
హైపోగ్లైసీమియా సమస్య వల్ల మీ శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి తగ్గడం ప్రారంభమవుతుంది. దీనివల్లే మీకు ఎప్పుడూ ఆకలి అవుతుంటుంది. అందుకే ఈ సమస్యను మీరు తేలిగ్గా తీసుకోకండి.
hungry always
శరీరంలో నీరు లేకపోవడం..
శరీరంలో నీరు లేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇది జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలను కలిగించడమే కాకుండా.. చర్మం, జుట్టుపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది. కానీ ఇది తరచుగా ఆకలికి కారణమవుతుంది. చలికాలంలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ సీజన్ లో చాలా మంది నీళ్లను ఎక్కువగా తాగరు. అందుకే తిన్న అరగంట తర్వాత నీరు తాగాలి. దీంతో కడుపు నిండుగా ఉంటుంది.
ప్రోటీన్ లోపం
మీరు తినే ఆహారంలో తగినంత ప్రోటీన్ లేకపోవడం వల్ల కూడా మళ్లీ మళ్లీ ఆకలి అవుతుంది. నిజానికి కడుపు నిండిన హార్మోన్లను తయారు చేయడానికి ప్రోటీన్ సహాయపడుతుంది. అందుకే శరీరానికి సరైన మొత్తంలో ప్రోటీన్ లభించనప్పుడు మీరు తిన్నా కడుపు ఖాళీగానే అనిపించి ఆకలి అవుతుంది.
హైపోథైరాయిడిజం
శరీరంలో థైరాయిడ్ హార్మోన్ స్థాయి పెరిగితే హైపర్ థైరాయిడిజం సమస్య వస్తుంది. ఈ సమస్య వల్ల కూడా తిన్నా.. తరచుగా ఆకలి అవుతుంది.
కేలరీల లోటు
బరువు తగ్గే ప్రాసెస్ లో చాలా మంది తక్కువ కేలరీలున్న ఆహారాన్ని రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటారు. కానీ దాని పరిణామాలపై దృష్టి పెట్టరు. దీనివల్ల ఆకలి బాగా కలుగుతుంది. మీ శరీరం పనిచేయడానికి కేలరీలు కూడా చాలా అవసరం. అందుకే మీ ఆహారంలో కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారాలు కూడా ఉండాలి.