టీ తాగుతూ సిగరేట్ కాల్చితే ఏమౌతుందో తెలుసా?

చాలా మంది ఒత్తిడిని, అలసటను తగ్గించుకోవడానికి టీ తాగుతూ మధ్య మధ్యలో సిగరెట్ కాల్చుతుంటారు. కానీ ఈ అలవాటు మిమ్మల్ని ఎన్ని వ్యాధుల బారిన పడేస్తుందో తెలుసా? 

Side effects of smoking cigarettes with tea rsl

ఆఫీసులో పనిచేసేవారైనా, బయటిపనులకు వెళ్లేవారైనా పని మధ్యలో అలసిపోకుండా పని మధ్య మధ్యలో రిఫ్రెష్ అవ్వడానికి చాలా మంది టీ బ్రేక్ తీసుకుంటుంటారు. అయితే చాలా మంది ఆఫీసు లోపల కాకుండా బయటకే ఎక్కువగా వెళతారు. ఎందుకంటే చాలా మంది టీ తాగుతూ సిగరేట్ కాల్చే అలవాటు ఉంటుంది. ఈ కాంబినేషన్ మీ ఒత్తిడిని , అలసటను తగ్గించినా.. ఇది మీ ఆరోగ్యాన్ని మాత్రం బాగా దెబ్బతీస్తుంది. 

మీకు టీ తాగుతూ సిగరేట్ కాల్చే అలవాటు గనుక ఉంటే.. మీకు మీరే వ్యాధులను కొని తెచ్చుకున్న వారవుతారు. అవును టీ, సిగరెట్ల కాంబినేషన్ మీకు గుండె జబ్బులొచ్చేలా చేయడంతో పాటుగా ఎన్నో వ్యాధులు వచ్చేలా చేస్తుంది. 

సిగరేట్, టీ కాంబినేషన్

Side effects of smoking cigarettes with tea rsl

మీకు తెలుసా? ఒక్క సిగరెట్ లో 6 నుంచి 12 మి.గ్రా నికోటిన్ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. అంటే ఇతరుల కంటే సిగరెట్ తాగేవారికే గుండెపోటు వచ్చే అవకాశం 2-3 రెట్లు ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సిగరెట్ లో ఉండే నికోటిన్ మీ గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో సంకోచాన్ని కలిగిస్తుంది. దీంతో మీ గుండెకు శుభ్రమైన రక్తం సరఫరా కాదు. అలాగే గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని కూడా చాలా వరకు పెంచుతుంది. 

ఇకపోతే టీ లో  పాలీఫెనాల్స్ అని పిలువబడే సహజ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి గుండెకు ఆరోగ్యకరమైనవిగా పరిగణిస్తారు. కానీ పాలను టీ లో కలపడం వల్ల దాని మంచి గుణాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అంటే పాలలో ఉండే ప్రోటీన్ టీ లోని పాలీఫెనాల్ మూలకాల ప్రభావాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల మీరు టీ ని ఎక్కువగా తాగితే మీ గుండె కొట్టుకొనే వేగం పెరుగుతుంది. అలాగే మీకు అధిక రక్తపోటు సమస్య కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఈ రెండు గుండె ఆరోగ్యాన్ని రిస్క్ లో పడేస్తాయి. 

టీ తాగుతూ సిగరెట్ కాల్చితే వచ్చే సమస్యలు 

టీ తాగుతూ సిగరేట్ కాల్చితే క్యాన్సర్ వచ్చే అవకాశాలు 30 శాతం పెరుగుతాయని ఓ తాజా అధ్యయనంలో తేలింది. టీ లో ఉండే టాక్సిన్స్ సిగరెట్ పొగతో కలిసి క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు కారణమవుతాయి.  అందుకే ఎట్టి పరిస్థితిలో టీ తో పాటు సిగరేట్ ను కాల్చకూడదు. 

క్యాన్సర్ :  సిగరెట్లు కాల్చితే  క్యాన్సర్ రిస్క్ బాగా పెరుగుతుంది. ముఖ్యంగా నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గొంతు క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా వరకు పెరుగుతుంది. దీనికి తోడు టీతో సిగరెట్లను కాల్చితే ఈ ప్రమాదం మరింత పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే టీ మీ శరీర కణాలను ఉత్తేజపరిస్తే.. సిగరేట్ ట్యాక్సిన్స్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. 

జీర్ణవ్యవస్థపై ప్రభావం: టీ, సిగరేట్ కాంబినేషన్ మీ జీర్ణవ్యవస్థపై కూడా ప్రభావం చూపెడుతుంది. ముఖ్యంగా ఇది మీ పేగులు, కడుపుపై చెడు ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తుంది. దీనివల్ల కడుపు నొప్పి, ఎసిడిటీ, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. 

మానసిక ఒత్తిడి:  సిగరెట్ ను కాల్చే ప్రతి ఒక్కరికీ దీనిని తాగుతున్నంత సేపు రిలాక్స్ గా అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత ఇది వారిలో మానసిక ఒత్తిడిని, ఆందోళనను పెంచుతుంది. ఇకపోతే టీలో ఉండే కెఫిన్ కంటెంట్ వల్ల మీకు నిద్రసరిగ్గా ఉండదు. స్ట్రెస్, ఆందోళన కూడా మరింత పెరుగుతాయి. 

Side effects of smoking cigarettes with tea rsl

దంతాలు, నోటి ఆరోగ్యంపై ప్రభావం: ఛాయ్, సిగరెట్ పొగలో ఉండే టానిన్లు దంతాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ముఖ్యంగా మీ తెల్లని దంతాలను పసుపు పచ్చ రంగులోకి మార్చేస్తాయి. అలాగే దంతాల బలాన్ని తగ్గిస్తాయి. అంతేకాకుండా సిగరెట్లను కాల్చడం వల్ల నోట్లో నుంచి దుర్వాసన వస్తుంది. ముఖ్యంగా ఇది మీకు నోటి క్యాన్సర్ వచ్చే రిస్క్ ను కూడా బాగా పెంచుతుంది. 

టీ తాగుతూ సిగరెట్ ను కాల్చే అలవాటును ఎలా మానుకోవాలి?

మీకు టీ తాగుతూ సిగరేట్ కాల్చే అలవాటు గనుక ఉంటే.. దాన్ని తగ్గిస్తూ.. మొత్తానికి మానేయండి. ఇందుకోసం మీరు టీని తాగకండి. దీనికి బదులు వేడినీళ్లు లేదా హెర్బల్ టీ ని తాగడం అలవాటు చేసుకోండి.  సిగరెట్ వ్యసనం నుంచి బయటపడలేకపోతే డాక్టర్ సలహా తీసుకోండి. 

మీకు తెలుసా? టీ ఎక్కువగా తాగితే.. మూత్రవిసర్జన ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ఇది మీ మూత్రపిండాలపై చెడు ప్రభావాన్ని చూపెడుతుంది. అలాగే మీ శరీరాన్ని డీహైడ్రేషన్ బారిన పడేలా చేస్తుంది. ఈ రెండూ మీ ఆరోగ్యానికి మంచివి కావు. అందుకే మీరు ఈ అలవాటును మానకపోతుంటే ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ సహాయం తీసుకోండి. 

చాలా మంది బాగా ఒత్తిడికి గురైనప్పుడు టీని ఎక్కువగా తాగుతుంటారు. లేదా సిగరెట్లను కాల్చుతూనే ఉంటారు. కానీ ఈ టీ, సిగరెట్లు మీ ఒత్తిడిని మరింత పెంచుతాయి. అందుకే ఈ అలవాటును మానుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే టీ, సిగరెట్లకు అలవాటు పడిన కొంచెం ఒత్తిడికి గురైనా టీ తాగుతూ సిగరెట్లను కాల్చడం మొదలుపెడతారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios