Health Tips : ఒత్తిడిని ఇలా జయించండి !
Stress Relief Tips : ప్రతి రంగంలో ఒత్తిడి కామన్. టెన్షన్ లేకుండా దాదాపు ఏ పనీ ఉండదు. అయితే, ఇది తీవ్రమైతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయన్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో ఒత్తిడి తగ్గించుకోవడానికి ఈ సింపుల్ టిప్స్ పాటించండి.

ఒత్తిడిని జయించండి
ఆరోగ్యకరమైన మెదడు పనితీరు, మీ శారీరక ఆరోగ్యాన్ని నిర్వహించడానికి నిద్ర సహయపడుతుంది. శారీరక, మానసిక సమతుల్యతను కాపాడుకోవాలంటే మీరు కొన్ని టిప్స్ పాటించండి. వీటి ద్వారా మీరు ఆరోగ్యంగా, ఉత్సాహంగా జీవించవచ్చు.
"4-7-8" శ్వాస పద్ధతి
రాత్రిళ్లు ఎంత ప్రయత్నించినా నిద్ర రావట్లేదా? త్వరగా నిద్రపోవాలంటే.. "4-7-8" శ్వాస పద్ధతిని ప్రయత్నించండి. 4 సెకన్లు గాలి పీల్చుకోవాలి, 7 సెకన్లు ఆపాలి, 8 సెకన్లు గాలిని విడిచేయాలి. ఈ శ్వాస విధానం మెదడుకు ప్రశాంతతను ఇచ్చి, నిద్ర త్వరగా పట్టేలా చేస్తుంది.
తలనొప్పికి ఇలా చెక్
తలనొప్పి ఎక్కువగా ఉందా? తలనొప్పి తగ్గాలంటే, మీ కనుబొమ్మల మధ్య ప్రదేశాన్ని నొక్కి పట్టుకోండి. అక్కడ నెమ్మదిగా మసాజ్ చేయండి. తలనొప్పి త్వరగా తగ్గుతుంది.
తల తిప్పుతుంటే..
తల తిప్పుతూ ఉండే ముక్కును గట్టిగా మూసుకుని, ఊపిరి బిగపట్టి మూడు సార్లు మింగండి. ఇది నరాల స్పందనను నియంత్రించి, తల తిప్పడం త్వరగా తగ్గించడంలో సహాయపడుతుంది.
చూయింగ్ గమ్
మానసిక ఒత్తిడి ఉంటే.. చూయింగ్ గమ్ నమలడం ఒక బెస్ట్ సొల్యూషన్. ఇది కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయిని తగ్గిస్తుంది. దాంతో మనసు ప్రశాంతంగా, సంతులితంగా ఉంటుంది.
ఒత్తిడి తగ్గాలంటే?
త్వరగా విశ్రాంతి కావాలంటే.. కొన్ని నిమిషాలు చేతిని బిగించి వదులుతూ ఉండండి. ఇలా చేయడం వల్ల ఒత్తిడిని తగ్గుతుంది.