Telugu

Sleeping: సరిగా నిద్రలేకపోతే.. శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయంటే?

Telugu

మెదడుపై ప్రభావం

నిద్ర సరిగా లేకపోతే మెదడు పనితీరును తగ్గించి, ఏకాగ్రత కోల్పోతాం. ఇది మానసిక స్థితి మార్పులు, ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలకు దారితీస్తుంది.

Image credits: Social Media
Telugu

అలసట

రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే రోజంతా అలసిపోయి బలహీనంగా ఉంటారు. దీనివల్ల ఏ పనీ సరిగ్గా చేయలేరు.

Image credits: iSTOCK
Telugu

గుండె సమస్యలు

నిద్రలేమి వల్ల అధిక రక్తపోటు, క్రమరహిత హృదయ స్పందన, గుండె నొప్పి వంటి సమస్యలకు దారితీస్తుంది. కొన్నిసార్లు గుండెపోటు కూడా వచ్చే అవకాశముంది. 

Image credits: Social Media
Telugu

బరువు పెరగడం

నిద్రలేమి జీవక్రియను తగ్గించి, బరువు వేగంగా పెరగడానికి కారణమవుతుంది. తక్కువ నిద్ర, హార్మోన్ల అసమతుల్యత, ఆకలి పెరగడం వంటి అనేక మార్గాల ద్వారా బరువు పెరగడానికి దారితీస్తుంది.

Image credits: Social Media
Telugu

డయాబెటిస్

నిద్రలేమి శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను దెబ్బతీసి, రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది.

Image credits: Getty
Telugu

చర్మ సమస్యలు

నిద్రలేమి వల్ల చర్మాన్ని పొడిగా, నిర్జీవంగా మారుతుంది. అలాగే.. కళ్ళ కింద నల్లటి వలయాలను కూడా ఏర్పడుతాయి.  

Image credits: social media
Telugu

హార్మోన్ల అసమతుల్యత

ప్రతిరోజూ సరిగ్గా నిద్రపోకపోతే ఒత్తిడి హార్మోన్ పెరుగుతుంది. ఇది శరీరంలోని ఇతర హార్మోన్లను ప్రభావితం చేసి కళ్ళలో మంట, తలనొప్పి వంటి పలు ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు.  

Image credits: Getty

Hair Care Tips: ఇదొక్కటి తింటే చాలు.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది!

Acid Reflux : తరచూ గొంతులో త్రేన్పులు , ఛాతి మంట? ఈ చిన్న చిట్కాలతో..

Mosquitoes: ఇంట్లో దోమలు చంపేస్తున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే పరార్!

Health Tips: జిమ్‌కి వెళ్లట్లేదా? ఇంట్లోనే ఈ సింపుల్ వ్యాయామాలు చేయండి