MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Health
  • Weight Loss: వేగంగా బరువు తగ్గాలా? పిరమిడ్ వాకింగ్ ట్రై చేయండి!

Weight Loss: వేగంగా బరువు తగ్గాలా? పిరమిడ్ వాకింగ్ ట్రై చేయండి!

Pyramid Walking for Weight Loss: మన ఆరోగ్యానికి నడక ఎంతో ముఖ్యం. అయితే, సాదా నడక కంటే మరింత ఫలితాలిచ్చే పద్ధతి ఉంది. అదే పిరమిడ్ వాకింగ్. ఇంతకీ పిరమిడ్ వాకింగ్ అంటే ఏమిటి? వాకింగ్ ఎలా చేయాలి?  దాని ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం.

1 Min read
Author : Rajesh K
Published : Jul 09 2025, 01:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పిరమిడ్ వాకింగ్ అంటే..?
Image Credit : Getty

పిరమిడ్ వాకింగ్ అంటే..?

నడక (Walking)..  శారీరక ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. రోజూ నడక అలవాటు బరువు తగ్గడంలో, గుండె ఆరోగ్యం మెరుగుపడటంలో సహాయపడుతుంది. అయితే.. పిరమిడ్ వాకింగ్ మాత్రం కొంచెం ప్రత్యేకమైనది.  పిరమిడ్ వాకింగ్ ఎలా చేస్తారు? పిరమిడ్ వాకింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటీ? తెలుసుకుందాం..  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బరువు తగ్గించడంలో పిరమిడ్ వాకింగ్ పాత్ర
Image Credit : Getty

బరువు తగ్గించడంలో పిరమిడ్ వాకింగ్ పాత్ర

పిరమిడ్ వాకింగ్ అనేది నడకలో వేగాన్ని పిరమిడ్ ఆకారంలో మారుస్తూ చేసే వ్యాయామం. దీనిని 20–25 నిమిషాలపాటు చేస్తే, సాధారణ నడక కంటే చాలా ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. ఉదాహరణకు: మొదట 5 నిమిషాలు నెమ్మదిగా నడవాలి, తర్వాత 5 నిమిషాలు వేగంగా నడవాలి, మళ్లీ 5 నిమిషాలు నెమ్మదిగా నడవాలి. 

ఈ విధంగా వేగాన్ని నియంత్రిస్తూ నడక కొనసాగించడం వల్ల శరీరంలోని కండరాలు బలపడతాయి, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు అనుసరించదగిన, సమర్థవంతమైన వ్యాయామం.

34
ప్రయోజనాలు
Image Credit : stockPhoto

ప్రయోజనాలు

పిరమిడ్ వాకింగ్ వల్ల శరీరంలో ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. దీని ఫలితంగా బరువు తగ్గడంలో వేగంగా మార్పు కనిపిస్తుంది. సాధారణ నడకతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ ప్రయోజనాలను ఇస్తుంది. మధ్యస్థ, వేగవంతమైన నడక కండరాలకు ఉత్తేజాన్ని ఇస్తాయి. వేగాన్ని పెంచుతూ-తగ్గిస్తూ నడవడం మెరుగైన కార్డియో వ్యాయామంగా పనిచేస్తుంది. ఇది గుండె పనితీరును మెరుగుపరచి, శ్వాసకోశాలను బలోపేతం చేస్తుంది. 

44
కండరాల బలోపేతం
Image Credit : stockPhoto

కండరాల బలోపేతం

పిరమిడ్ వాకింగ్ వల్ల కాళ్లు, తుంటి, మధ్య భాగంలోని కండరాలను బలోపేతం అవుతాయి. వేగం పెరిగే సమయంలో కండరాలు పటిష్టంగా మారతాయి. అదే సమయంలో శరీరం కూడా మెరుగవుతుంది. అలాగే.. కీళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్రమం తప్పకుండా పిరమిడ్ వాకింగ్ చేస్తే కీళ్ల చలనం మెరుగవుతూ, నొప్పులు తగ్గతాయి. కీళ్ల చుట్టూ ఉన్న కండరాలు బలపడడంతో నెమ్మదిగా నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఆరోగ్యం
ఆహారం
మహిళలు
పురుషులు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
నీళ్లు తాగిన వెంటనే పరిగెత్తితే క‌డుపులో ఒక‌వైపు నొప్పి ఎందుకు వస్తుంది? దీనికి కార‌ణం ఏంటంటే?
Recommended image2
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image3
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Related Stories
Recommended image1
Weight Loss: ఎన్ని చేసినా బరువు తగ్గడం లేదా? 30-30-30 ఫార్ములాను ఫాలో అవ్వండి..
Recommended image2
Weight Loss: డైట్, వ్యాయామం చేసినా బరువు తగ్గట్లేదా? కారణాలివే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved