MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Health
  • Onion Juice Benefits: అందం.. ఆరోగ్యం.. ఉల్లిరసంతో మీ సొంతం..!

Onion Juice Benefits: అందం.. ఆరోగ్యం.. ఉల్లిరసంతో మీ సొంతం..!

Onion Juice Benefits: ‘ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు’ అంటారు. ఉల్లి కేవలం వంటకాలను రుచిగా మార్చడంలోనే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచడం నుంచి షుగర్ ను  నియంత్రించడం వరకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. అలాంటి ఉల్లిరసం తాగితే కలిగే ప్రయోజనాలేంటీ? 

2 Min read
Author : Rajesh K
Published : Jul 09 2025, 09:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఉల్లి రసం తాగితే ఏమవుతుంది?
Image Credit : gemini

ఉల్లి రసం తాగితే ఏమవుతుంది?

ఉల్లిపాయ ఆరోగ్యానికి ఎంతోమేలు చేస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అలాగే ఉల్లిలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీబాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అలాంటి ఉల్లి రసాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే ఎలాంటి ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఉల్లిపాయలో ఉండే పోషకాలు :
Image Credit : Instagram

ఉల్లిపాయలో ఉండే పోషకాలు :

ఉల్లిపాయలో ఫోలేట్, విటమిన్ C, విటమిన్ B6, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో, శరీర క్రియాశీలతను మెరుగుపరచడంలో సహాయపడతాయి.  జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ (2024)లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఉల్లిపాయలో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేస్తాయి. 

Related Articles

Related image1
Onion Juice: ముఖానికి ఉల్లిరసం రాస్తే ఏమౌతుంది?
Related image2
Raw Onion: రోజూ పచ్చి ఉల్లిపాయ ఎందుకు తినాలి?
35
రోగనిరోధక శక్తిని బలోపేతం
Image Credit : Getty

రోగనిరోధక శక్తిని బలోపేతం

ఉల్లిపాయలో విటమిన్ C, జింక్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే, ఉల్లిపాయలోని యాంటీ అలెర్జీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు శరీరాన్ని బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. అలాగే జలుబు, దగ్గు వంటి సాధారణ శ్వాసకోశ వ్యాధులను నిరోధిస్తాయి. 

జీర్ణక్రియను మెరుగుపరిచే శక్తి కూడా! 

ఉల్లిపాయలో ఉండే ఇన్యులిన్ అనే ప్రీబయోటిక్ ఫైబర్ ప్రేగుల్లోమంచి బ్యాక్టీరియాల పెరుగుదలకు సహాయపడుతుంది. ఇవి జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఫుడ్ అండ్ ఫంక్షన్ జర్నల్ ప్రకారం.. ఉల్లిపాయ రసం తరచుగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది, అలాగే మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.

45
సహజ డిటాక్స్, షుగర్ కంట్రోల్‌
Image Credit : Freepik

సహజ డిటాక్స్, షుగర్ కంట్రోల్‌

ఉల్లి రసం ఒక సహజ డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తుంది. ఇది శరీరంలో టాక్సిన్లను బయటకు పంపడమే కాకుండా, జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. అంతేకాదు, రక్తంలో చక్కెర, కొవ్వు స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే దీన్ని సరైన మోతాదులో మాత్రమే తీసుకోవాలి.

చక్కెర వ్యాధిగ్రస్తులకు: ఉల్లి రసం రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే సహజ గుణాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి, గ్లూకోజ్ శోషణను మెరుగుపరుస్తాయి. దీంతో షుగర్ లెవెల్స్ అదుపులో ఉండే అవకాశం ఉంటుంది.

55
చర్మ సంరక్షణ
Image Credit : Freepik

చర్మ సంరక్షణ

చర్మ సంరక్షణ: ఉల్లిపాయ రసం చర్మం టోన్‌ను మెరుగుపరుస్తుంది. మచ్చలు, మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే… చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.

గుండె ఆరోగ్యానికి ఉల్లి రసం: ఉల్లిపాయలో ఉండే క్వెర్సెటిన్ (Quercetin), ఇతర శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ఉల్లి రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలు తగ్గుతాయి. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. తద్వారా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. ఇవి గుండె ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో సహాయపడతాయి.

గమనిక: ఉల్లి రసం ఆరోగ్యానికి మంచిదే అయినా, గుండె జబ్బులు ఉన్నవారు లేదా మందులు వాడుతున్నవారు ఉల్లి రసాన్ని ఉపయోగించే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఆరోగ్యం
ఆహారం
మహిళలు
పురుషులు
సౌందర్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Related Stories
Recommended image1
Onion Juice: ముఖానికి ఉల్లిరసం రాస్తే ఏమౌతుంది?
Recommended image2
Raw Onion: రోజూ పచ్చి ఉల్లిపాయ ఎందుకు తినాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved