MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Office Coffee ఆఫీసులో కాఫీ తాగితే గుండెకు రిస్కా? ఇదెక్కడి బాధరా నాయనా?

Office Coffee ఆఫీసులో కాఫీ తాగితే గుండెకు రిస్కా? ఇదెక్కడి బాధరా నాయనా?

ఎక్కువ కాఫీతో హై రిస్క్: తమ ఉద్యోగులు ఆఫీసు పని నుంచి కాస్త సేద తీరడానికి ప్రతి ఆఫీసులో కాఫీ మెషిన్లు ఏర్పాటు చేయడం సహజం. అక్కడ కాఫీని ఆస్వాదించడమే కాదు.. కాసిన్ని కబుర్లు చెప్పుకొంటూ ఆహ్లాదం పొందుతుంటారు. ఈ ముచ్చట్లలో పడి కొందరైతే ఎడాపెడా కాఫీలు తాగేస్తుంటారు. అయితే చేయడం గుండెకు రిస్కు అంటోంది ఒక తాజా అధ్యయనం. అసలు విషయంలోకి వస్తే..

1 Min read
Author : Anuradha B
Published : Apr 15 2025, 10:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కాఫీ మిషన్ చాలా ప్రమాదకరం

కాఫీ మిషన్ చాలా ప్రమాదకరం

తక్షణ శక్తికి, మెదడు చురుగ్గా పని చేయడానికి మనం కాఫీలు తాగుతుంటాం. ఆఫీసులో అయితే బ్లాక్ కాఫీ, మిల్క్ కాఫీ అని బోలెడు రకాలుంటాయి. కానీ ఇంట్లోని కాఫీ, ఆఫీసులోని ఆర్టిఫిషియల్ కాఫీకి రుచిలోనే కాదు.. అది చూపే ప్రభావంలోనూ బోలెడు తేడా ఉంటుందనే విషయం మీకు తెలుసా? ఇలా నిత్యం ఆఫీసులో కాఫీ తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరమని డాక్టర్లు చెబుతున్నారు. మిషన్ కాఫీ తాగడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందో, లేదో వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
గుండెపై ప్రభావం

గుండెపై ప్రభావం

ఇటీవల జరిగిన ఒక అధ్యయనంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో తయారుచేసే కాఫీతో పోలిస్తే ఆఫీసులో ఉండే మిషన్ కాఫీలో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచే ప్రమాదకరమైన సమ్మేళనాలు ఉన్నాయని తేలింది. అందుకే మిషన్ కాఫీ ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో కొవ్వు శాతం పెరిగి గుండె ఆరోగ్యంలో సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

34
తాజా అధ్యయనం

తాజా అధ్యయనం

ఈ విషయం గురించి ఒక కంపెనీకి చెందిన కొంతమంది పరిశోధకులు 14 ఆఫీసుల్లో మిషన్ కాఫీ నమూనాలను విశ్లేషించారు. ఇంటి కాఫీతో పోల్చి చూసినప్పుడు ఆఫీసు మిషన్ కాఫీలో కెఫెస్టాల్, కాహ్వోల్ పరిమాణం ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. ఇది శరీరంలో కొవ్వు, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచే అంశమని పరిశోధకులు తేల్చారు. మీరు రోజుకు మూడు లేదా అంతకంటే ఎక్కువ కాఫీలు తాగితే మీ శరీరంలో తెలియకుండానే చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందని అధ్యయనంలో తేలింది.

44
ఎసిడిటీ సమస్య

ఎసిడిటీ సమస్య

ఆఫీసు మిషన్ కాఫీ మిమ్మల్ని చురుకుగా, అప్రమత్తంగా ఉండటానికి సహాయపడుతుంది. కానీ మీరు దీన్ని ఎక్కువగా తాగితే ఆందోళన, నరాల సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు మిషన్ కాఫీలో చక్కెర, సిరప్ కలుపుతారు. కాబట్టి మీరు దీన్ని ఎక్కువగా తాగితే బరువు పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. ఇది మాత్రమే కాదు ఈ కాఫీ తాగడం వల్ల గుండెల్లో మంట, ఎసిడిటీ వస్తుంది.

About the Author

AB
Anuradha B
అనురాధ 10 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఈమె ఎక్కువగా పలు సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్, ఆస్ట్రాలజీ, సినిమా, మహిళలకు తదితర రంగాలకు సంబంధించిన కథనాలు రాస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఏసియానెట్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
ఆహారం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
ఎప్పుడూ ఒక‌వైపే న‌మిలి తింటున్నారా.? ఏం జ‌రుగుతుందో తెలిస్తే వెంట‌నే ఆపేస్తారు
Recommended image2
ట్యాబ్లెట్స్ కంటే ఇంజ‌క్ష‌న్‌తో త్వ‌ర‌గా రిలీఫ్ ఎందుకు వ‌స్తుంది? వెనుకున్న సైన్స్ ఏంటంటే?
Recommended image3
సిగరెట్ లేకుండా మల విసర్జన కావడం లేదా? కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved