MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • రాత్రిపూట ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? వెంటనే వైద్యులను సంప్రదించాల్సిందే

రాత్రిపూట ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? వెంటనే వైద్యులను సంప్రదించాల్సిందే

రాత్రిపూట కనిపించే కొన్ని లక్షణాలతో మన గుండె, కిడ్నీ, లివర్ సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించొచ్చు.

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 26 2025, 02:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఈ లక్షణాలు కనపడుతున్నాయా?
Image Credit : Getty

ఈ లక్షణాలు కనపడుతున్నాయా?

చాలా మందికి రాత్రి నిద్ర మధ్యలో మూత్రం వస్తూ ఉంటుంది. ఇది చాలా కామన్. కానీ, పదే పదే మూత్ర విసర్జన కోసం లేవడం మాత్రం నార్మల్ కాదు.  అంతేకాదు, పడుకున్నప్పుడు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడటం, నిద్ర లేచిన వెంటనే ఎక్కువగా చెమటలు పట్టడం, రాత్రిపూట సరిగా నిద్రపట్టకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి అంటే..  ఏదో ఆరోగ్య సమస్య రాబోతుందని అర్థం. ముఖ్యంగా మీ గుండె, లివర్, కిడ్నీ ల్లో ఏదైనా సమస్య ఉందని  సంకేతం కావచ్చు.

27
రాత్రి పూట కనిపించే లక్షణాలు..
Image Credit : stockPhoto

రాత్రి పూట కనిపించే లక్షణాలు..

రాత్రిపూట మాత్రమే కనిపించే ఈ సంకేతాలను ప్రజలు చాలా వరకు నిర్లక్ష్యం చేస్తారని వైద్యులు చెబుతున్నారు. కానీ ఇవి గుండె వైఫల్యం  ప్రారంభ సంకేతాలు కావచ్చు. నిజానికి, ఈ సమస్యలు రక్త నాళాల అడ్డంకి, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (CKD) , లివర్ దెబ్బతినడం వల్ల కూడా సంభవించవచ్చు.

Related Articles

Related image1
Iron Rich Food: రక్తం తక్కువగా ఉందా? రోజూ తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్స్!
Related image2
Kidney Health: కిడ్నీ ప్రాబ్లమ్స్‌కు తులసితో చెక్.. ఈ ఆయుర్వేద మొక్కతో ఇన్ని లాభాలా?
37
మూత్ర విసర్జన..
Image Credit : Getty

మూత్ర విసర్జన..

అంతేకాదు, రాత్రిపూట మూత్ర విసర్జన కోసం పదే పదే లేస్తూ ఉంటే దానిని నోక్టురియా అంటారు. ఇది సాధారణ సమస్య కాదు, కానీ గుండె వైఫల్యం లేదా మూత్రపిండ వ్యాధి  ప్రారంభ సంకేతం కావచ్చు.

47
వైద్యులు ఏమన్నారంటే..
Image Credit : Getty

వైద్యులు ఏమన్నారంటే..

అపోలో హాస్పిటల్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విక్రమ్ బి. కోల్హరి చెప్పినట్లుగా, రాత్రి పడుకున్నప్పుడు ద్రవం రక్తంలో కలిసి మూత్రపిండాల ద్వారా ఫిల్టర్ అవుతుంది. తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి ఉంటుంది. రోగికి మూత్రపిండ సంబంధిత సమస్యలు ఉంటే మూత్రపిండాలు వాటి ఫిల్టరింగ్ సామర్థ్యాన్ని కోల్పోతాయి. దీనివల్ల పగలు , రాత్రి తేడా లేకుండా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా రాత్రి పూట ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది.

57
వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?
Image Credit : Google

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?

రాత్రి ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తుంటే, మీ కాళ్ళు వాచి ఉంటే, అలసట , ఊపిరి ఆడకపోతే, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

67
ఊపిరితిత్తుల్లో సమస్య
Image Credit : social media

ఊపిరితిత్తుల్లో సమస్య

రాత్రి ఊపిరి ఆడకపోవడం అంటే ఊపిరితిత్తులలో ద్రవం చేరడం వల్ల మీ గుండె రక్తాన్ని సరిగ్గా పంప్ చేయలేకపోవచ్చు. కాబట్టి, ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.

77
ఎక్కువగా చెమటలు పడితే..
Image Credit : Getty

ఎక్కువగా చెమటలు పడితే..

రాత్రిపూట మీకు ఎక్కువగా చెమట పడుతుంటే కూడా వైద్యులను సంప్రదించడం ఉత్తమం. ఇది రక్త నాళాలలో అడ్డంకి లక్షణం. ఈ సమయంలో మీకు ఛాతి నొప్పి, అధిక ఒత్తిడి  అనిపిస్తే,  గుండె సమస్య లేదా అధిక రక్తపోటు ఉండవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు అశ్రద్ధ చేయకూడదు. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Neem Leaves: రోజూ గుప్పెడు వేపాకులు తింటే శరీరంలో జరిగే 5 మార్పులు ఇవే!
Recommended image2
Summer Skin Care: మండే ఎండల్లోనూ మెరిసే చర్మం.. ఇదొక్కటి చేస్తే చాలు
Recommended image3
Periods: హెవీ బ్లీడింగ్‌తో విసిగిపోయారా? ఈ చిట్కాలు మీ కోసమే
Related Stories
Recommended image1
Iron Rich Food: రక్తం తక్కువగా ఉందా? రోజూ తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్స్!
Recommended image2
Kidney Health: కిడ్నీ ప్రాబ్లమ్స్‌కు తులసితో చెక్.. ఈ ఆయుర్వేద మొక్కతో ఇన్ని లాభాలా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved