World Brain Day: వయసు పెరిగినా జ్ఞాపకశక్తి తగ్గకూడదంటే చేయాల్సినవి ఇవే..!
మెదడు మన శరీరంలో అత్యంత శక్తివంతమైన అవయవం. దీనిని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉంటుంది.
- FB
- TW
- Linkdin
Follow Us

మెదడు ఆరోగ్యం...
వయసు పెరుగుతుంటే మన మెదడు పనితీరు తగ్గిపోతూ ఉంటుంది. దీని వల్ల మనం చిన్న చిన్న విషయాలను కూడా మర్చిపోతూ ఉంటాం. అలా జరగకుండా ఉండాలంటే కొన్ని రకాల ఆహారాలను కచ్చితంగా తీసుకోవాల్సిందే. ఈ రోజు అంటే జులై 22వ తేదీని ప్రపంచ మెదడు దినోత్సవం. మరి, ఈ రోజున మనం మన మెదడును ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఏం చేయాలో తెలుసుకుందాం...
మెదడు మన శరీరంలో అత్యంత శక్తివంతమైన అవయవం. దీనిని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉంటుంది. ప్రతిరోజూ కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.మరి, ఆ ఫుడ్స్ ఏంటో చూద్దాం..
1. ఫ్యాటీ ఫిష్ : మెదడు కణాలకు ఒమేగా-3
ఫ్యాటీ ఫిష్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా సాల్మన్, సార్డిన్స్ వంటి చేప రకాలు తీసుకోవచ్చు. ఇవి మీ మెదడు ఆరోగ్యానికి సహాయపడతాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ .. మెదడు , నాడీ కణాలను నిర్మించడంలో సహాయపడతాయి. ఇవి మనం ఏదైనా విషయాన్ని నేర్చుకోవడానికి సహాయపడతాయి. అందుకే.. రెగ్యులర్ గా ఈ రకం చేపలను డైట్ లో భాగం చేసుకోవాలి.
2. బెర్రీలు: చిన్న పండ్లు.. పెద్ద ప్రభావం
బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, బ్లాక్‌బెర్రీస్ ఇతర యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి మీ మెదడు యవ్వనంగా ఉండేలా సహాయపడతాయి. అంటే.. మతి మరుపు రాకుండా సహాయపడతాయి. మెదడు కణాల మధ్య కమ్యూనికేషన్‌ను మెరుగుపరుస్తాయి.
ఈ బెర్రీలను తినడానికి ఉత్తమ సమయం: ఉదయం స్నాక్‌గా, పెరుగుతో లేదా స్మూతీలో కలిపి తీసుకోవచ్చు..
3. గింజలు, విత్తనాలు: జ్ఞాపకశక్తికి విటమిన్ E
వాల్‌నట్స్, బాదం, అవిసె గింజలు, చియా గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు విటమిన్ E తో నిండి ఉంటాయి. ఇవి మెదడు కణాలను వయస్సు సంబంధిత నష్టం నుండి రక్షిస్తాయి. మతిమరుపు సమస్య రాకుండా.. ఈ విటమిన్ E మనకు రక్షణ కవచంలా పని చేస్తుంది.
4. ఆకుకూరలు: ది ఒరిజినల్ సూపర్‌ఫుడ్
పాలకూర, కాలే, బ్రోకలీ వంటి ఆకుకూరలు విటమిన్ K, ఫోలేట్ , బీటా-కెరోటిన్‌తో నిండి ఉంటాయి. ఈ పోషకాలు అభిజ్ఞా క్షీణతను నెమ్మదిస్తాయి. మీ మెదడును పదునుగా ఉంచుతాయి. చురుకుగా పని చేసేలా సహాయం చేస్తాయి. వీటితో పాటు.. మనం రెగ్యులర్ గా తినే వైట్ రైస్ కి బదులుగా బ్రౌన్ రైస్ తీసుకోవాలి. ఇది కూడా మన మెదడు ఆరోగ్యంగా పని చేయడానికి సహాయపడుతుంది.
5.డార్క్ చాక్లెట్:
డార్క్ చాక్లెట్‌లో జ్ఞాపకశక్తి ని పెంపొందించే ఫ్లేవనాయిడ్లు, చురుకుదనాన్ని అందించే కెఫిన్ , మెదడు ఆరోగ్యానికి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అయితే, వీటిని చాలా తక్కువ మొత్తంలో మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిదేమీ కాదు.
6. పసుపు:
పసుపులో ఉండే క్రియాశీల సమ్మేళనం కర్కుమిన్.. మెడదుకు రక్త ప్రసరణ సరిగా జరిగేలా చేస్తుంది. మానసిక స్థితి, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుందని, ఆందోళన , నిరాశ లక్షణాలను కూడా తగ్గిస్తుందని. ఇది సెరోటోనిన్ , డోపమైన్‌ను కూడా పెంచుతుంది. మీరు వండే వంటల్లో పసుపు చేర్చుకుంటే సరిపోతుంది.