Moringa Leaves : మునగాకు ఓ దివ్యౌషధం.. లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Health Benefits Of Moringa Leaves: సూపర్ ఫుడ్ గా పిలువబడే మునగాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని ప్రతిరోజు తినడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఎలా తీసుకోవాలి అనేది తెలుసుకుందాం.

మునుగాకు – పోషకాల ఖజానా
మునుగాకులో అనేక విటమిన్లు, ఖనిజాలు, ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ A, C, B1, B2, B3, B6, ఫోలేట్, E, K వంటి అనేక విటమిన్లు ఉంటాయి. పాలకంటే 4 రెట్లు కాల్షియం, అరటిపండుతో పోల్చితే 3 రెట్లు పొటాషియం, అలాగే ఐరన్, మెగ్నీషియం, భాస్వరం, జింక్, మాంగనీస్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. పెరుగుతో పోలిస్తే 2 రెట్లు ఎక్కువ ప్రోటీన్ ఉండే మునుగాకు, శక్తివంతమైన ప్రోటీన్ వనరుగా పనిచేస్తుంది.
మునుగాకు ఆరోగ్య రహస్యం
మునుగాకులో క్లోరోజెనిక్ యాసిడ్, క్వెర్సెటిన్, బీటా కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కణాలకు కలిగే నష్టాన్ని నివారించి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. మునగాకు పొడి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది డయాబెటిక్ వ్యక్తులకు ఎంతో ఉపయుక్తం. విటమిన్ C, ఇతర పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచి, ఆస్తమా, కీళ్లనొప్పులు వంటి సమస్యల నుండి రక్షణ కలిగిస్తాయి.
మునుగాకు ప్రయోజనాలు
మునుగాకుల పొడి పలు ప్రయోజనాలు :
- కాలేయానికి రక్షణ – ఫ్యాటీ లివర్, కాలేయ క్యాన్సర్ వంటి సమస్యలను తగ్గిస్తుంది.
- కొలెస్ట్రాల్ నియంత్రణ – చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.
- గుండె ఆరోగ్యానికి మేలు – గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
- బరువు నియంత్రణ – జీవక్రియను మెరుగుపరచి కొవ్వును కరిగిస్తుంది.
- జీర్ణవ్యవస్థకు మేలు – ఫైబర్ అధికంగా ఉండటంతో మలబద్ధకం నివారిస్తుంది.
- నాడీ వ్యవస్థకు రక్షణ – యాంటీఆక్సిడెంట్లు మెదడు, నరాల పనితీరును మెరుగుపరుస్తాయి.
ఇతర ప్రయోజనాలు
- కంటి సంరక్షణ : విటమిన్ A అధికంగా ఉండటం వల్ల కంటికి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
- చర్మం, జుట్టుకు పోషణ: ఇందులో విటమిన్లు, ఖనిజాలు చర్మం, జుట్టు ఆరోగ్యంగా కాపాడుతాయి.
- రక్తహీనత నివారణ: ఐరన్ అధికంగా ఉండటంతో అనేమియా నివారణకు సహాయపడుతుంది.
- క్యాన్సర్ కణాలపై ప్రభావం: కొన్ని అధ్యయనాల ప్రకారం క్యాన్సర్ కణాలను అణచివేసే లక్షణాలు మునగాకులో ఉన్నాయి.
- గాయాల నయం: చర్మంపై గాయాలను త్వరగా మాన్పుతుంది.
- వాడే విధానం: వేడి నీటిలో కలుపుకుని టీలా తాగవచ్చు లేదా అన్నంలో కలిపి కూరగా తినవచ్చు.
మునగాకు పొడి ఉపయోగాలు, జాగ్రత్తలు
మునగాకు పొడిని సూప్, చపాతీ పిండి, దోశ పిండి, కూర, సాంబార్‌ల్లో కలపవచ్చు.
నీరు లేదా రోజ్ వాటర్‌తో మునగాకు పొడిని కలిపి ఫేస్ ప్యాక్‌లా వాడితే ముఖం కాంతివంతంగా మారుతుంది.
జాగ్రత్తలు: సాధారణంగా దుష్ప్రభావాలు లేవు, కానీ వ్యక్తి ఆరోగ్యాన్ని బట్టి మారవచ్చు. కాబట్టి వైద్యుని సలహా తప్పనిసరి.