Jaggery Milk: రాత్రివేళ బెల్లం పాలు తాగితే ఏమవుతుందో తెలుసా?
Milk with Jaggery Benefits: రాత్రిపూట పడుకునే ముందు చాలా మందికి పాలు తాగే అలవాటు ఉంటుంది. వేడి వేడి పాలు తాగడం వల్ల మెరుగైన నిద్రకు సహాయపడుతుంది. అదే పాలల్లో చిన్న బెల్లం ముక్క కూడా వేసుకొని తాగితే రెట్టింపు ప్రయోజనం చేకూరుతుందట. ఆయా లాభాలేంటో ?

బెల్లం పాలు
పాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా దీన్ని సరైన కలయికతో తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇప్పటికే పాలతో పసుపు వంటివి కలిపి తాగి ఉంటారు. కానీ బెల్లంతో కలిపిన పాలు తాగడం వల్ల ఏమవుతుందో మీకు తెలుసా? పాలు, బెల్లం కలయిక శరీరానికి శక్తిని ఇచ్చే సహజ టానిక్‌గా పనిచేస్తుంది. మరి బెల్లంలో పాలు కలుపుకుని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం..
జీర్ణక్రియ మెరుగుదల
బెల్లం జీర్ణ ఎంజైమ్‌లను ఉత్తేజపరచి, పాలను సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఇది గ్యాస్, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఎముకల ఆరోగ్యం
పాలలో ఉండే కాల్షియం, బెల్లంలో ఉండే భాస్వరం కలిసి ఎముకలను బలంగా ఉంచుతాయి. ఇవి ఆస్టియోపోరోసిస్‌ను నివారించడంలో సహాయపడతాయి.
రక్తహీనత నుండి ఉపశమనం
బెల్లంలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. పాలతో కలిపి తీసుకుంటే.. శరీరంలో ఇనుము శోషణ మరింత మెరుగవుతుంది.
అలసట, బలహీనత
బెల్లం–పాలు మిశ్రమం రోజువారీ అలసటను తగ్గించడమే కాదు, శరీరానికి వెంటనే శక్తిని అందిస్తుంది. ఇది బలహీనతకు మంచి పరిష్కారంగా పనిచేస్తుంది
మెరుగైన నిద్ర
రాత్రి పడుకునే ముందు బెల్లం పాలు తాగడం వల్ల ఒత్తిడి తగ్గించడంలో, మంచి నిద్రకు ఎంతో సహాయపడుతుంది. ఇందులో ఉండే ట్రిప్టోఫాన్ వంటి అమైనో ఆమ్లాలు మెదడులో సెరోటొనిన్, మెలటొనిన్ హార్మోన్ల ఉత్పత్తిని పెంచి నిద్రకు మెరుగుపరుస్తాయి.
రోగనిరోధక వ్యవస్థ
పాలు-బెల్లం కలయిక రోగనిరోధక శక్తిని బలపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. బెల్లంలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు శరీరాన్ని రక్షించే శక్తిని పెంచి, జలుబు, దగ్గు వంటి చిన్న వ్యాధులను తుడిచిపెట్టేలా సహాయపడతాయి.
చర్మ ఆరోగ్యం
బెల్లం-పాలు మిశ్రమం శరీరాన్ని లోపలి నుంచి శుద్ధి చేస్తుంది. రక్తాన్ని శుభ్రపరచి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో మొటిమలు, మచ్చలు వంటి చర్మ సమస్యలు తగ్గుతాయి.
గుర్తుంచుకోవాల్సిన విషయాలు...
బెల్లం కలిపిన పాలు తీసుకునే ముందు మధుమేహ రోగులు వైద్యుని సలహా తీసుకోవాలి. వేడి పాలలోనే 1-2 చెంచాల బెల్లాన్ని కలపాలి. ఈ రుచికరమైన కలయిక శరీరానికి శక్తిని ఇచ్చే అమృతంగా పనిచేస్తుంది. దినచర్యలో చేర్చుకుంటే ఆరోగ్యంపై స్పష్టమైన మార్పును చూడవచ్చు.