MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • తస్మాత్‌ జాగ్రత్త.. వీధి కుక్కలతో వ్యాపించే వ్యాధులు

తస్మాత్‌ జాగ్రత్త.. వీధి కుక్కలతో వ్యాపించే వ్యాధులు

Street Dogs: వీధి కుక్కలు అంటే భయపడిన వారు ఉండరు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎవరి మీద పడితే వారిపై దాడి చేస్తుంటాయి.వీధి కుక్కల దాడి చేయడం వల్ల రేబిస్‌ మాత్రమే కాదు, అనేక ఇతర ప్రమాదకర వ్యాధులను కూడా వ్యాప్తి చేస్తాయట. ఆ వ్యాధులేంటో తెలుసుకుందాం. 

2 Min read
Author : Rajesh K
Published : Jul 03 2025, 09:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రేబిస్ ఇంతా ప్రమాదకరమా?
Image Credit : stockPhoto

రేబిస్ ఇంతా ప్రమాదకరమా?

వీధి కుక్కలు కరిచినప్పుడు, గోళ్ళతో గీరినపుడు, లేదా మలం, మూత్రం, పరాన్నజీవుల ద్వారా ప్రమాదకరమైన వ్యాధులు వ్యాపించే అవకాశముంది. వాటిలో రేబిస్ అత్యంత ప్రమాదకారి. ఈ వైరస్ కుక్కల లాలాజలంలో ఉంటుంది. కుక్క కరిచినప్పుడు ఈ వైరస్ సోకుతుంది. ఈ వ్యాధి సమయంలో జ్వరం, తలనొప్పి, వణుకు, నీటికి భయం, మతిస్థిమితం కోల్పోవడం, పక్షవాతం, చివరికి మరణం కూడా సంభవించవచ్చు.

  • ఈ వ్యాధి ఒకసారి తీవ్రంగా మారితే చికిత్స లేదు. అందుకే, వీధి కుక్కలు కరిచిన వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. ప్రతి కుక్కకు రేబిస్ టీకా వేయించాలి. చిన్నారులను వీధి కుక్కల దగ్గరకు పోనీయకుండా చూసుకోవాలి. 
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టెటనస్, రింగ్‌వార్మ్
Image Credit : stockPhoto

టెటనస్, రింగ్‌వార్మ్

టెటానస్ అనేది మట్టి లేదా జంతువుల మలంలో ఉండే క్లోస్ట్రిడియం టెటానీ అనే బాక్టీరియా వల్ల కలిగే ప్రమాదకరమైన వ్యాధి. కుక్కలు కరిచినా, గీరినా, మట్టి తగిలిన గాయాల ద్వారా ఈ బాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది.

లక్షణాలు:

  • దవడలు బిగుసుకోవడం
  • తీవ్రమైన కండరాల నొప్పులు, వణుకు
  • మింగడంలో ఇబ్బంది

జ్వరం, తీవ్రతరమైన కదలికల అడ్డంకి

నివారణ:  

  • గాయం జరిగిన వెంటనే శుభ్రపరచడం.
  • టెటానస్ టీకా వేయించుకోవడం.

రింగ్‌వార్మ్: కుక్కల నుంచి వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్ రింగ్‌వార్మ్. ఇది ఒక చర్మవ్యాధి. ఇది వ్యాధిగ్రస్త కుక్కలను తాకినప్పుడు లేదా అవి పడుకునే ప్రదేశాల ద్వారా మనకు సోకుతుంది.

లక్షణాలు:

  • చర్మంపై వృత్తాకార ఎర్రటి మచ్చలు
  • తీవ్రమైన దురద
  • మచ్చలు పొడిగా ఉండటం, తొలచడం

నివారణ:  

  • కుక్కలతో సంబంధం ఉన్న తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి
  •  ఇన్ఫెక్షన్ ఉన్న నాయలకు చికిత్స చేయాలి
  •  వ్యక్తిగత పారిశుధ్యాన్ని పాటించాలి
35
లెప్టోస్పిరోసిస్, గజ్జి
Image Credit : stockPhoto

లెప్టోస్పిరోసిస్, గజ్జి

లెప్టోస్పైరోసిస్: మూత్రంలోనుంచి వచ్చే ముప్పు లెప్టోస్పైరోసిస్ అనేది వ్యాధిగ్రస్త నాయల మూత్రం ద్వారా వ్యాపించే బ్యాక్టీరియల్ వ్యాధి. మూత్రంతో కలిసిన మట్టి, నీరు, ఆహారం ద్వారా ఇది మనుషులకు సోకుతుంది.

లక్షణాలు:

  • తీవ్రమైన జ్వరం
  • తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, 
  • కామెర్లు, మూత్రపిండ సమస్యలు, 

నివారణ: 

  • కుక్కలకు టీకాలు వేయించడం
  •  పరిశుభ్రత పాటించడం
  • నీరు నిల్వ ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉండడం

స్కేబీస్: చర్మాన్ని కొరికి వదిలే సూక్ష్మ శత్రువు స్కేబీస్ అనేది చర్మానికి సోకే పరాన్నజీవి (mites) ద్వారా కలిగే ఇన్ఫెక్షన్. ఇది వ్యాధిగ్రస్త కుక్కలతో ప్రత్యక్ష సంబంధం వల్ల మనుషులకు సోకుతుంది.

లక్షణాలు:

  • రాత్రిపూట తీవ్రమైన దురద
  • చర్మంపై ఎర్రటి దద్దుర్లు, 

నివారణ:  

  • వ్యాధి సోకిన కుక్కలతో దూరంగా ఉండాలి 
  • వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి
  • అనుమానాస్పద లక్షణాలైతే వైద్యుడిని సంప్రదించాలి
45
లికింగ్ ఇన్ఫెక్షన్
Image Credit : stockPhoto

లికింగ్ ఇన్ఫెక్షన్

లికింగ్ ఇన్ఫెక్షన్: కుక్కల లాలాజలం ద్వారా వచ్చే అరుదైన వ్యాధి. ఇది కాప్నోసైటోఫాగ కానిమోర్స్ (Capnocytophaga canimorsus) అనే బాక్టీరియా వల్ల వచ్చే అరుదైన ఇన్ఫెక్షన్. ఈ బాక్టీరియా కుక్కల లాలాజలంలో ఉండి, చర్మంపై ఉన్న గాయాలు, కళ్ల, ముక్కు, నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది.

లక్షణాలు:

  • జ్వరం, తలనొప్పి
  • వాంతులు, విరేచనాలు
  • అరుదుగా సెప్సిస్ (రక్తంలో ఇన్ఫెక్షన్) 
  • అవయవాల వైఫల్యం (కిడ్నీలు, కాలేయం మొదలైనవి)

నివారణ: 

  • కుక్కల వద్దకి రానివ్వకండి 
  •  గాయాలపై వెంటనే శుభ్రపరచి, అవసరమైతే వైద్యుడిని సంప్రదించండి 
  • రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు కుక్కలకు దూరంగా ఉండాలి. 
55
జాగ్రత్తలు
Image Credit : stockPhoto

జాగ్రత్తలు

రేబిస్, టెటానస్, లెప్టోస్పైరోసిస్, స్కేబీస్, రింగ్‌వార్మ్, పేగు పురుగులు వంటి అనేక వ్యాధులు వీధి కుక్కల ద్వారా మనుషులకు సోకే ప్రమాదం ఉంది. అంతేకాదు, వీధి కుక్కల శరీరంపై ఉండే పేలు, తేళ్ళు, ఇతర పరాన్నజీవులు కూడా మన ఆరోగ్యానికి హానికరం.

  •  వీధి కుక్కలకు దూరంగా ఉండాలి 
  • వాటిని తాకిన వెంటనే చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి 
  • కుక్క కరిచినా, గీరినా వెంటనే గాయాన్ని శుభ్రపరిచి వైద్యుని సంప్రదించాలి 
  • ఆవశ్యకమైన టీకాలు వేయించుకోవాలి

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
మహిళలు
పురుషులు
ఆరోగ్యం
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
ఎప్పుడూ ఒక‌వైపే న‌మిలి తింటున్నారా.? ఏం జ‌రుగుతుందో తెలిస్తే వెంట‌నే ఆపేస్తారు
Recommended image2
ట్యాబ్లెట్స్ కంటే ఇంజ‌క్ష‌న్‌తో త్వ‌ర‌గా రిలీఫ్ ఎందుకు వ‌స్తుంది? వెనుకున్న సైన్స్ ఏంటంటే?
Recommended image3
సిగరెట్ లేకుండా మల విసర్జన కావడం లేదా? కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.?
Related Stories
Recommended image1
Dogs Crying: రాత్రిపూట కుక్కలు ఏడిస్తే నిజంగానే ఎవరైనా చనిపోతారా?
Recommended image2
Health Tips: రాత్రిపూట ఈ లక్షణాలుంటే.. హార్ట్, లివర్, కిడ్నీ డేంజర్ లో ఉన్నట్లే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved