MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Sperm Count Test : కేవలం 5 నిమిషాల్లో .. ఇంట్లోనే మీ స్పెర్మ్ కౌంట్ను చెక్ చేసుకోండిలా!

Sperm Count Test : కేవలం 5 నిమిషాల్లో .. ఇంట్లోనే మీ స్పెర్మ్ కౌంట్ను చెక్ చేసుకోండిలా!

Sperm Count Test : ఈ మధ్యకాలంలో సంతానం సమస్య చాలామందిని బాధిస్తోంది మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక సమస్యలు వంటి కారణాల వల్ల సహజగర్భధారణ కష్టతరం అవుతోంది. అలాగే.. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తక్కువ అవ్వడం కూడా ప్రధాన సమస్యగా మారింది. అయితే..చాలా మంది స్పెర్మ్ కౌంట్‌ పరీక్షలను బయట ల్యాబ్ లో చేయించుకోవడానికి ఇబ్బంది పడుతారు. కాస్త అభద్రత భావానికి లోనవుతారు. అలాంటి వారు ఇంట్లోనే తమ స్పెర్మ్ కౌంట్ చేసుకోవచ్చు. ఇందు కోసం  కొత్త మెడికల్ కిట్‌లు,  స్మార్ట్‌ఫోన్ ఆధారిత యాప్ అందుబాటులోకి  వచ్చాయి. వీటి సహాయంతో మీరు ఆసుపత్రికి వెళ్లకుండానే మీ స్పెర్మ్ కౌంట్‌ను చెక్ చేసుకోవచ్చు. 

2 Min read
Author : Rajesh K
Published : May 18 2025, 11:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
ఇంట్లోనే చెక్

ఇంట్లోనే చెక్

ఇప్పుడు ఇంట్లోనే జ్వరం, షుగర్, బీపీని చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా గర్భవతి అవునా కాదా అని తెలుసుకోవడానికి మార్కెట్లో మెడికల్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.

28
స్పెర్మ్ కౌంట్

స్పెర్మ్ కౌంట్

స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటే పురుషుల్లో వంధ్యత్వానికి దారితీస్తుంది. ఈ మధ్యకాలంలో జీవనశైలి కారణంగా పురుషుల్లో వంధ్యత్వ సమస్య పెరుగుతోంది. స్పెర్మ్ కౌంట్ తెలుసుకోవాలంటే క్లినిక్‌కి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఇంట్లోనే మీరు ఈ పరీక్ష చేసుకోవచ్చు.

Related Articles

Related image1
Kidney: వీటిని తింటే.. మూత్రపిండాలు ఆరోగ్యరంగానికి ఢోకా లేదు..!
Related image2
Beauty Care: రాత్రి పడుకునే ముందు పెదాలకు నెయ్యి రాస్తే ఏమౌతుంది?
38
ల్యాబ్ కు వెళ్లవల్సిన అవసరం లేదు.

ల్యాబ్ కు వెళ్లవల్సిన అవసరం లేదు.

గతంలో స్పెర్మ్ కౌంట్ తెలుసుకోవడానికి పురుషులు ఫెర్టిలిటీ క్లినిక్ లేదా ల్యాబ్‌కి వెళ్లాల్సి వచ్చేది. అక్కడ మీ స్పెర్మ్ నమూనాను తీసుకొని ల్యాబ్‌లో పరీక్షించి నివేదిక ఇచ్చేవారు. కానీ దీనివల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందని చాలామంది పురుషులు అభిప్రాయపడేవారు. 

48
మెడికల్ కిట్

మెడికల్ కిట్

ఇప్పుడు ఇంట్లోనే మీ స్పెర్మ్ కౌంట్ తెలుసుకోవడానికి మార్కెట్లోకి మెడికల్ కిట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ కిట్ వాడటం వల్ల మీ గోప్యతకు ఎలాంటి భంగం కలగదు. 2025లో పబ్లిష్ అయిన జర్నల్ ఆఫ్ ఫెర్టిలిటీ అండ్ స్టెరిలిటీ, పిఎంసి ఐడి ఒక హోమ్ టెస్టింగ్ కిట్‌ను తీసుకవచ్చింది. ఈ కిట్ చాలా ప్రభావవంతమైనది.

58
తక్కువ ధరలో

తక్కువ ధరలో

ఈ కిట్‌ ద్వారా తక్కువ ధరలో సులభంగా స్పెర్మ్ కౌంట్‌ను చెక్ చేసుకోవచ్చు. ఇది ప్రెగ్నెన్సీ కిట్ మాదిరిగా పనిచేస్తుంది. మీ నమూనాను సేకరించి కిట్‌లో వేయాలి. 10 నిమిషాల తర్వాత మీ స్పెర్మ్ కౌంట్ చూపిస్తుంది.

68
స్మార్ట్‌ఫోన్ సహాయంతో

స్మార్ట్‌ఫోన్ సహాయంతో

మీరు వాడే స్మార్ట్‌ఫోన్ సహాయంతో కూడా స్పెర్మ్ కౌంట్ మోటిలిటీని తెలుసుకోవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్‌కి కనెక్ట్ అయ్యే చాలా పరికరాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. నమూనాను మైక్రోచిప్‌లో లోడ్ చేసిన తర్వాత, అది మీ ఫోన్ స్క్రీన్‌పై లైవ్ వీడియోను చూపిస్తుంది. దీని ద్వారా స్పెర్మ్ కౌంట్, మోటిలిటీ ,  ప్రోగ్రెసివ్ మోటిలిటీని తెలుసుకోవచ్చు.

78
క్లినికల్ కిట్లు అందుబాటులోకి

క్లినికల్ కిట్లు అందుబాటులోకి

మీరు ఇంట్లో స్పెర్మ్ నమూనాను ల్యాబ్‌కి పంపించడానికి సురక్షితమైన కిట్‌ని ఉపయోగించాలి. ఈ కిట్‌లో ప్రత్యేక సంరక్షణ ద్రావణం ఉంటుంది. ఈ ద్రావణం నమూనాను 52 గంటల పాటు సురక్షితంగా ఉంచుతుంది. ల్యాబ్‌కి నమూనా పంపించడం ఇష్టంలేని వారు ఇంట్లోనే కొత్తకిట్‌ని ఉపయోగించ వచ్చు.

88
స్పెర్మ్ కౌంట్‌ను ఖచ్చితంగా తెలుసుకోవాలంటే

స్పెర్మ్ కౌంట్‌ను ఖచ్చితంగా తెలుసుకోవాలంటే

స్పెర్మ్ కౌంట్‌ను ఖచ్చితంగా తెలుసుకోవాలంటే 2-7 రోజుల ముందు స్కలనం నుండి దూరంగా ఉండాలి. అప్పుడే వీర్యకణాల సంఖ్యను ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఫలితం సాధారణంగా లేకపోతే, ఫెర్టిలిటీ నిపుణుడిని సంప్రదించవచ్చు. సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, ధూమపానం,మద్యపానాన్ని మానేయడం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా మీ వీర్యకణాల సంఖ్యను మెరుగుపరచుకోవచ్చు.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
ఆహారం
ఏషియానెట్ న్యూస్
జీవనశైలి
పురుషులు

Latest Videos
Recommended Stories
Recommended image1
Health: ఉద‌యం లేవ‌గానే నీరు తాగమ‌ని ఎందుకు చెప్తారో తెలుసా.? వీరికి మాత్రం డేంజ‌ర్
Recommended image2
Health: మ‌గ‌వారు అందుకు పనికి రార‌ని ఎలా తెలుస్తుంది.? బయట నుంచి చూసి చెప్పొచ్చా
Recommended image3
Health: 30 ఏళ్ల‌లో హైబీపీ వ‌స్తే దేనికి సంకేత‌మో తెలుసా.? వెంట‌నే అల‌ర్ట్ అవ్వాల్సిందే..
Related Stories
Recommended image1
Kidney: వీటిని తింటే.. మూత్రపిండాలు ఆరోగ్యరంగానికి ఢోకా లేదు..!
Recommended image2
Beauty Care: రాత్రి పడుకునే ముందు పెదాలకు నెయ్యి రాస్తే ఏమౌతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved