MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Health
  • Holi Skin Hair Protection: రంగుల్లో ఆడినా గ్లో తగ్గదు…హోలీ ప్రీ, పోస్ట్ స్కిన్, హెయిర్ కేర్ టిప్స్

Holi Skin Hair Protection: రంగుల్లో ఆడినా గ్లో తగ్గదు…హోలీ ప్రీ, పోస్ట్ స్కిన్, హెయిర్ కేర్ టిప్స్

Holi Skin Hair Protection: అన్ని పండుగల్లో కల్లా అత్యంత ఉత్సాహంగా జరుపుకునే పండుగలలో ఒకటి హోలీ. వండర్ ఫుల్ మూమెంట్ కూడా. అయితే కెమికల్ కలర్ వల్ల చర్మం, జుట్టు డ్యామేజ్ అవడం పక్కా. అందుకే Pre and Post-Holi Care తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.  

2 Min read
Author : Nandini Arava
Published : Feb 25 2026, 01:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హోలీ అనేది ఒక వండర్ ఫుల్ మూమెంట్
Image Credit : Getty

హోలీ అనేది ఒక వండర్ ఫుల్ మూమెంట్

అన్ని పండుగల్లో కల్లా అత్యంత ఉత్సాహంగా జరుపుకునే పండుగలలో ఒకటి హోలీ. మార్చి 4న హోలీ జరుపుకోనున్నారు. రంగుల పండుగ రోజు ఆటపాటలు, సెలబ్రేషన్స్ తో చిన్నా పెద్దా అంతా ఫుల్ జోష్ లో ఉంటారు. అంతేకాకుండా సిటీల్లో పెద్ద పెద్ద ఈవెంట్స్ కూడా ఏర్పాటు చేస్తారు. హోలీ అనేది ఒక వండర్ ఫుల్ మూమెంట్ కూడా.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హోలీ హడావిడిలో స్కిన్, హెయిర్ కేర్ మర్చిపోవద్దు
Image Credit : Getty

హోలీ హడావిడిలో స్కిన్, హెయిర్ కేర్ మర్చిపోవద్దు

అయితే కెమికల్స్ కలిసిన రంగుల వల్ల చర్మం, జుట్టుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. పొడిబారడం, అలర్జీలు, చర్మం ఎర్రబడడం, జుట్టు ఫ్రిజ్ అవడం, పగిలిపోవడం వంటి సమస్యలు హోలీ తర్వాత సాధారణంగా కనిపిస్తాయి. దానివల్ల చికాకుగా ఉంటుంది. అందుకే ముందే జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. హోలీకి ముందు, తర్వాత సరైన స్కిన్, హెయిర్ కేర్ రొటీన్ పాటిస్తే పండుగను ఎంజాయ్ చేస్తూనే మీ అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చంటున్నారు. 

Related Articles

Related image1
Holi 2025: దుస్తులకు అంటిన హోలీ రంగులను వదిలించేదెలా?
Related image2
Holi 2025: హోలి వేడుకల్లో కళ్లను కాపాడుకునేదెలా?
35
హోలీకి ముందు, తర్వాత స్కిన్ కేర్ ప్రిపరేషన్
Image Credit : Getty

హోలీకి ముందు, తర్వాత స్కిన్ కేర్ ప్రిపరేషన్

ముందుగా ఫేస్‌ను మైల్డ్ క్లెన్సర్‌తో క్లీన్ చేసుకుని మంచి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఇది ఒక ప్రొటెక్టివ్ లేయర్‌లా పనిచేస్తుంది. బయట ఎక్కువసేపు ఉండాల్సి వస్తే సన్‌స్క్రీన్ తప్పనిసరి. కలర్స్ సన్‌లైట్‌తో రియాక్ట్ అయి స్కిన్ సెన్సిటివిటీ పెంచవచ్చు. ఫేస్, నెక్, హ్యాండ్స్, ఫీట్‌లాంటి ఎక్స్‌పోజ్ అయ్యే పార్ట్స్‌పై మందంగా క్రీమ్ లేదా ఆయిల్ రాస్తే కలర్స్ లోపలికి వెళ్లకుండా ఉంటాయి. హెవీ మేకప్ హోలీ రోజు వాడకపోవడం మంచిది.

హోలీ తర్వాత స్కిన్‌ను హ్యాండిల్ చేసే విధానం కూడా చాలా ముఖ్యం. ఇంటికి వచ్చాక వెంటనే బలంగా రుద్దుతూ కడగకండి. గోరువెచ్చని నీటితో మైల్డ్, సోప్-ఫ్రీ క్లెన్సర్ వాడాలి. స్టబ్బర్న్ స్టెయిన్స్ ఉంటే సాఫ్ట్ ఎక్స్‌ఫోలియేటర్ వాడొచ్చు కానీ ఓవర్ స్క్రబ్బింగ్ చేయకూడదు. ఆ తర్వాత అలొవెరా జెల్, కూలింగ్ ఫేస్ ప్యాక్ వాడితే రెడ్‌నెస్, ఇర్రిటేషన్ తగ్గుతాయి. స్కిన్ హైడ్రేషన్ చాలా కీలకం. మంచి మాయిశ్చరైజర్ లేదా హైడ్రేటింగ్ సీరమ్ అప్లై చేయడం, ఎక్కువగా నీళ్లు తాగడం స్కిన్ రికవరీకి సహాయపడుతుంది.

45
హెయిర్ కేర్ ప్లానింగ్
Image Credit : Getty

హెయిర్ కేర్ ప్లానింగ్

హెయిర్ కేర్ విషయానికి వస్తే, హోలీకి ముందు రోజు జుట్టుకు నూనె రాయడం బెస్ట్ ప్రొటెక్షన్. కొబ్బరి, బాదం ఆయిల్ అప్లై చేస్తే హెయిర్పై ఒక లేయర్ ఏర్పడి కలర్స్ లోపలికి చేరకుండా కాపాడుతుంది. హోలీ రోజు హెయిర్‌ను ఓపెన్‌గా వదిలేయకుండా బన్ వేసుకోవడం మంచిది. స్కార్ఫ్ లేదా క్యాప్ వాడటం మరీ మంచిది. హోలీకి ఒకటి రెండు రోజులు ముందు షాంపూ చేయకుండా ఉంటే నేచురల్ ఆయిల్స్ మాడును కాపాడుతాయి.

పోస్ట్ హోలీ హెయిర్ వాష్ కూడా కేర్‌తో చేయాలి. ముందుగా డ్రై హెయిర్‌ను మెల్లగా దువ్వి రంగులు తొలగించాలి. తర్వాత చల్లటి లేదా గోరువెచ్చని నీటితో కడిగి సల్ఫేట్-ఫ్రీ షాంపూ వాడాలి. తప్పనిసరిగా కండిషనర్ అప్లై చేసి, వారంలో ఒకసారి డీప్ కండిషనింగ్ హెయిర్ మాస్క్ వాడితే జుట్టు మృదువుగా, షైనీగా మారుతుంది. హోలీ తర్వాత వెంటనే హెయిర్ కలరింగ్ చేయడం అసలు మంచిది కాదు, కనీసం కొన్ని వారాలు గ్యాప్ ఇవ్వాలి.

55
చిన్న చిన్న జాగ్రత్తలతో మీ అందానికి ఏ బెంగా ఉండదు
Image Credit : Getty

చిన్న చిన్న జాగ్రత్తలతో మీ అందానికి ఏ బెంగా ఉండదు

చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే హోలీ ఆనందం తగ్గకుండా, మీ స్కిన్ గ్లో, హెయిర్ హెల్త్ అలాగే మెయింటైన్ చేసుకోవచ్చు. రంగులు పోయినా మీ అందం అలాగే ఉండాలంటే ముందస్తు ప్లానింగ్ తప్పనిసరి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Related Stories
Recommended image1
Holi 2025: దుస్తులకు అంటిన హోలీ రంగులను వదిలించేదెలా?
Recommended image2
Holi 2025: హోలి వేడుకల్లో కళ్లను కాపాడుకునేదెలా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved