Lifestyle
రంగుల పండుగ హోలీ. భారతదేశంలో ఇది పెద్ద పండుగ. పిల్లలు, పెద్దలు అందరూ కలిసి హోలీని బాగా జరుపుకుంటారు.
హోలీ వేడుకల్లో రంగులు ఒకరిపై ఒకరు చల్లుకుంటూ సందడి చేస్తారు.
హోలీ రోజు రంగులు చల్లుకునేటప్పుడు కళ్లని కాపాడుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే దురద, మంట, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.
కళ్లలో ఏదైనా పడితే చేత్తో రుద్దడం మామూలే. కానీ అలా రుద్దకూడదు. రుద్దితే ఇంకా లోపలికి పోయే ప్రమాదం ఉంది.
కళ్ల చుట్టూ నూనె రాస్తే రంగులు తొందరగా పోతాయి. అంతేకాదు, మీ కళ్లని కూడా కాపాడుతుంది.
కళ్లల్లో దుమ్ము, ధూళి పోవాలంటే శుభ్రమైన, గోరువెచ్చని నీటితో కడగడం చాలా మంచిది.
స్నేహితుల చేతుల్లో రంగులు చూస్తే పారిపోవాలనిపిస్తుంది కదా. కానీ అలా పారిపోతే కళ్లల్లో రంగు పడే ఛాన్స్ ఉంది. కంటికి కళ్ల జోడు పెట్టుకోవడం క్షేమం
రోజూ స్ట్రాబెర్రీలు తింటే ఏమవుతుందో తెలుసా?
ఆఫీస్ వేర్ చీరలు కావాలా.. ఈ శ్రీలీల శారీలు ట్రై చేయండి
ప్లెయిన్ కుర్తాను స్టైలిష్ గా మార్చడమెలా?
పిస్తా తింటే కంటి సమస్యలు కూడా తగ్గుతాయా? నిజం ఇదిగో