MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Periods: హెవీ బ్లీడింగ్‌తో విసిగిపోయారా? ఈ చిట్కాలు మీ కోసమే

Periods: హెవీ బ్లీడింగ్‌తో విసిగిపోయారా? ఈ చిట్కాలు మీ కోసమే

Heavy Bleeding: మహిళలకు పిరియడ్స్ అనేది ఒక టాస్క్ లాంటిది. ఒక్కోసారి శరీరాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. హెవీ బ్లీడింగ్..మామూలు సమస్యగా భావించినా, అతర అనారోగ్యసమస్యలకు సంకేతం కావొచ్చు. అందుకే సమస్య తీవ్రం కాకముందే వైద్యులను కలవాలని సూచిస్తున్నారు. 

2 Min read
Author : Nandini Arava
Published : Feb 25 2026, 05:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
 పీరియడ్ సమస్యల్లో హెవీ బ్లీడింగ్ ఒకటి
Image Credit : Getty

పీరియడ్ సమస్యల్లో హెవీ బ్లీడింగ్ ఒకటి

మహిళల్లో ఎక్కువగా కనిపించే పీరియడ్ సమస్యల్లో హెవీ బ్లీడింగ్ ఒకటి. ఇది రోజువారీ జీవితం, పని, మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపుతుంది. సాధారణంగా ఒక గంటకంటే తక్కువ సమయంలోనే ప్యాడ్ మార్చాల్సి రావడం, ఏడు రోజులకంటే ఎక్కువ రోజుల పాటు బ్లీడింగ్ కొనసాగడం, పెద్ద పెద్ద క్లాట్స్ రావడం వంటి లక్షణాలు ఉంటే దాన్ని హెవీ బ్లీడింగ్‌గా చెప్తారు. కొందరికి ఎక్కువ బ్లీడింగ్ వల్ల అలసట, తల తిరగడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

24
సమస్యకు ప్రధాన కారణం..హార్మోన్ల అసమతుల్యత
Image Credit : Getty

సమస్యకు ప్రధాన కారణం..హార్మోన్ల అసమతుల్యత

ఈ ఆధునిక కాలంలో పీరియడ్ సమస్యలు ఎక్కువైపోయాయి. ఉద్యోగాలు చేసే మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. ఇంటి పని, ఆఫీస్, ఒత్తిడి, నిద్రలేమి, ఆలోచనలు, టైంకు తినకపోవడంతో ప్రాబ్లమ్ పెరుగుతోంది. పీరియడ్ సమస్యలను కొంతమంది పట్టించుకోరు.మరికొందరు సమస్యను చెప్పుకోవడానికి సిగ్గుపడటంతో...అది మరింత తీవ్రమవుతోంది.

ఈ సమస్యకు ప్రధాన కారణాల్లో హార్మోన్ల అసమతుల్యత ఒకటి. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరోన్ హార్మోన్లు బ్యాలెన్స్ తప్పితే గర్భాశయ గోడలపై పొర ఏర్పడి, అది విడిపోయే సమయంలో అధిక రక్తస్రావం జరుగుతుంది. పోలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS), థైరాయిడ్ సమస్యలు, అండం విడుదల కాకపోవడం వంటి పరిస్థితులు కూడా దీనికి కారణమవుతాయి. కొన్ని సందర్భాల్లో గర్భాశయ గడ్డలు లేదా ఇతర వైద్య సమస్యలు కూడా ఈ సమస్యను తీవ్రతరం చేయవచ్చు.

Related Articles

Related image1
Periods: బ్లీడింగ్ అవ్వకపోయినా... ప్రతి 4 గంటలకు మార్చాల్సిందే..!
Related image2
Periods: నెలకు రెండుసార్లు పీరియడ్స్ వస్తే ఏమౌతుంది?
34
లైఫ్ స్టైల్ లో మార్పులు తప్పనిసరి
Image Credit : Getty

లైఫ్ స్టైల్ లో మార్పులు తప్పనిసరి

ఈ సమస్యను పూర్తిగా నివారించాలంటే వైద్య పరీక్షలు, అవసరమైతే మందులు తప్పనిసరి. అయితే లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులు చేయడం ద్వారా లక్షణాలను కొంతవరకు నియంత్రించవచ్చు. ఐరన్ సమృద్ధిగా ఉన్న ఆకుకూరలు, పప్పులు, తక్కువ కొవ్వు ఉన్న మాంసం, గింజలు, Fortified Cereals వంటి ఆహారాలు తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. విటమిన్ C ఉన్న ఫ్రూట్స్ సహాయపడతాయి. తగినంత నీరు తాగడం తలనొప్పిని తగ్గిస్తుంది. వ్యాయామం, వాకింగ్, స్విమ్మింగ్ , సైక్లింగ్ చేస్తే హార్మోన్ల సమతుల్యతకు ఉపయోగపడతాయి. ఒత్తిడి తగ్గించడానికి యోగా, ధ్యానం, సరైన నిద్ర అవసరం. 

44
సమస్య పెద్దదైతే వైద్యులను కలవాల్సిందే..
Image Credit : Getty

సమస్య పెద్దదైతే వైద్యులను కలవాల్సిందే..

అయితే పీరియడ్స్ ఒక వారానికి మించి కొనసాగినా, తరచూ ప్యాడ్స్ మార్చాల్సి వచ్చినా తప్పకుండా వైద్యులను సంప్రదించడం మంచిది. సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకుంటే మెనోరేజియా(అధిక రక్తస్రావం)ను సమర్థంగా నియంత్రించవచ్చు. సో సమస్య ఏ స్థాయిలో ఉందో ఇప్పుడే గుర్తించి చికిత్స చేసుకుంటే…భవిష్యత్ ఆరోగ్యం బాగుంటుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో ఛానెల్లో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Weight Loss Drinks: ఉదయాన్నే ఈ డ్రింక్స్ తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు!
Recommended image2
Summer Health Tips: ఈ సమ్మర్ లో బెస్ట్ హెల్త్ టిప్స్ తో బయటపడొచ్చు...
Recommended image3
Holi Skin Hair Protection: రంగుల్లో ఆడినా గ్లో తగ్గదు…హోలీ ప్రీ, పోస్ట్ స్కిన్, హెయిర్ కేర్ టిప్స్
Related Stories
Recommended image1
Periods: బ్లీడింగ్ అవ్వకపోయినా... ప్రతి 4 గంటలకు మార్చాల్సిందే..!
Recommended image2
Periods: నెలకు రెండుసార్లు పీరియడ్స్ వస్తే ఏమౌతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved