MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • Periods: బ్లీడింగ్ అవ్వకపోయినా... ప్రతి 4 గంటలకు మార్చాల్సిందే..!

Periods: బ్లీడింగ్ అవ్వకపోయినా... ప్రతి 4 గంటలకు మార్చాల్సిందే..!

Periods: మహిళలను పీరియడ్స్ ప్రతి నెలా పలకరిస్తూనే ఉంటాయి. ఆ సమయంలో పరిశుభ్రతను పాటించకపోతే.. అనేక ఆరోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్యాడ్ వాడే విషయంలో కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు.

1 Min read
Author : ramya Sridhar
Published : Oct 22 2025, 05:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Sanitary Pads
Image Credit : Getty

Sanitary Pads

పీరియడ్స్ సమయంలో మహిళలు రెగ్యులర్ గా ప్యాడ్స్ వాడటం చాలా కామన్. ప్రస్తుతం మార్కెట్లో టాంపూన్లు, డిస్పోజబుల్ ప్యాంటీలు, మెన్స్టువల్ కప్పులు వంటి అనేక ఉత్పతులు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ... చాలా మంది ప్యాడ్స్ మాత్రమే వాడుతూ ఉంటారు. అయితే... పీరియడ్ మొదటి రెండు రోజులు రక్త స్రావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఆ సమయంలో వెంట వెంటనే ప్యాడ్స్ మారుస్తారు. కానీ... నాలుగో రోజు తర్వాత బ్లీడింగ్ తగ్గుతూ వస్తుంది. దీంతో.. ఒకటే ప్యాడ్ ని కంటిన్యూ చేస్తారు. కానీ, దీని వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని మీకు తెలుసా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం...

23
ప్యాడ్ ని ఎంత తరచుగా మార్చాలి?
Image Credit : our own

ప్యాడ్ ని ఎంత తరచుగా మార్చాలి?

రక్త స్రావం ఎక్కువగా ఉన్న సమయంలో ప్రతి 4 నుంచి 6 గంటలకు ఒకసారి ప్యాడ్స్ మారుస్తూ ఉండటం చాలా సహజం. కానీ, బ్లీడింగ్ తక్కువగా అయినప్పుడు కూడా ప్యాడ్ ని 4 గంటలకు ఒకసారి మార్చి తీరాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే... ప్యాడ్ ని ఎక్కువ సేపు ఉంచడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు... UTIలు, యోని ఇన్ఫెక్షన్లు రెండూ వస్తాయి. కాబట్టి, ప్రతి నాలుగు గంటలకు మీ ప్యాడ్‌ను మార్చడం మర్చిపోవద్దు.

అదనంగా, మార్కెట్‌లోని చాలా ప్యాడ్‌లలో రసాయనాలు ఉంటాయి. ఈ ప్యాడ్‌లను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల ఎండోమెట్రియోసిస్ , క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.

Related Articles

Related image1
Seeds For Women Health: రోజూ ఈ ఐదు గింజలు తింటే చాలు... ఆ సమస్యలన్నింటికీ చెక్..!
Related image2
Periods: పీరియడ్స్ సమయంలో పొరపాటున కూడా ఈ ఐదు పనులు చేయకూడదు..!
33
పీరియడ్ ప్యాడ్స్ వల్ల కలిగే నష్టాలు...
Image Credit : our own

పీరియడ్ ప్యాడ్స్ వల్ల కలిగే నష్టాలు...

మీరు ఒకే ప్యాడ్‌ను 4-5 గంటల కంటే ఎక్కువసేపు ఉపయోగిస్తే, అది దురద, దద్దుర్లు కలిగిస్తుంది. ఇది ల్యూకోరియా కూడా దారితీస్తుంది.

మీకు తక్కువ రక్తస్రావం ఉన్నప్పటికీ, ప్యాడ్‌లో తడిగా అనిపించకపోయినా, ప్రతి 3-4 గంటలకు దాన్ని మార్చడం ఋతు పరిశుభ్రతకు చాలా కీలకమని నిపుణులు అంటున్నారు. ఈ విషయంలో ఏవైనా అనుమానాలు ఉంటే, మీరు డైరెక్ట్ గా గైనకాలజిస్ట్ ని సంప్రదించవచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Hair Growth: రోజూ ఇవి తింటే.. ఒత్తైన జుట్టు మీ సొంతం
Recommended image2
Beauty Tips: పగిలిన మడమలు మీ బ్యూటీని డామినేట్ చేస్తున్నాయా? ఇంట్లోనే సీక్రెట్ ఇంగ్రీడియంట్
Recommended image3
Silver Anklets: వర్కింగ్ ఉమెన్స్ కోసం సింపుల్ డిజైన్ లో వెండి పట్టీలు
Related Stories
Recommended image1
Seeds For Women Health: రోజూ ఈ ఐదు గింజలు తింటే చాలు... ఆ సమస్యలన్నింటికీ చెక్..!
Recommended image2
Periods: పీరియడ్స్ సమయంలో పొరపాటున కూడా ఈ ఐదు పనులు చేయకూడదు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved