Sunstroke: వడదెబ్బ నుంచి ఉపశమనం పొందాలంటే.. ఈ వంటింటి చిట్కాలు ఫాలోకండి!
Sunstroke: ఎండాకాలంలో చాలా మంది వడదెబ్బ బారిన పడుతున్నారు. ఈ పరిస్థితిలో శరీర ఉష్ణోగ్రత అనేది ప్రమాదకర స్థాయికి పెరుగుతుంది. ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి, ఈ కింది వంటింటి చిట్కాలను పాటించి సురక్షితంగా ఉండండి.

వడదెబ్బ నుంచి ఉపశమనం
వేసవిలో ప్రజలు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. మే-జూన్ నెలల్లో ఉష్ణోగ్రతలు 40-45 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో పలువురు వడదెబ్బ బారిన పడుతున్నారు. వడదెబ్బ వల్ల జ్వరం, వాంతులు, విరేచనాలు, చర్మ సమస్యలు వస్తాయి. శరీర ఉష్ణోగ్రతను అదుపుతప్పితే.. ప్రాణాలకే ప్రమాదం. అలాంటి ప్రమాదకరమైన వడదెబ్బ నుంచి మిమ్మల్ని రక్షించే 5 ఈ వంటింటి చిట్కాలు మీ కోసం..
సత్తు పానీయం
శనగపప్పును వేయించి సత్తు పిండి తయారు చేస్తారు. సత్తులో ఐరన్, సోడియం, ఫైబర్, ప్రొటీన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. దీన్ని నీళ్లలో కలిపి, చిటికెడు ఉప్పు, నిమ్మరసంతో తాగాలి. ఈ డ్రింక్ ను ఖాళీ కడుపుతో తాగితే శరీరంలోని టాక్సిన్లన్నీ బయటకు వెళ్లిపోతాయి. అలాగే.. వేసవి అలసటను తగ్గిస్తుంది, వడదెబ్బ నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది.
మామిడి పానకం
మామిడి పానకం శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడుతుంది. ఉడికించిన కాయ మామిడి, బెల్లం/చక్కెర, పుదీనా, జీలకర్ర పొడితో ఈ పానకాన్ని తయారు చేయండి. ఈ పానకంతో జీర్ణక్రియ మెరుగవుతుంది.
మజ్జిగ
మజ్జిగ – దేశీ ఎలక్ట్రోలైట్: ప్రోబయోటిక్స్‌తో నిండి ఉంటుంది. ఇది శరీరానికి చల్లదనాన్నిస్తుంది. కడుపును ప్రశాంతంగా ఉంచుతుంది. ఒక గ్లాసు మజ్జిగలో వేయించిన జీలకర్ర, నల్ల ఉప్పు, పుదీనా కలపండి. ఈ డింక్స్ చెమటతో బయటకు వెళ్లే ఖనిజాలను రిస్టోర్ చేయడంతో ఉపయోగపడుతుంది.
తులసి
తులసి, గులాబీ నీటి లేపనం: చర్మానికి చల్లదనాన్నిస్తుంది, ఎండ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తులసి రసం, గులాబీ నీటిని కలిపి ముఖం, మెడ, చేతులు, కాళ్లకు పట్టించండి. ఇది వడదెబ్బ వల్ల చర్మంలో కలిగే మంట, దద్దుర్ల నుంచి రక్షణ కల్పిస్తుంది.
ఉల్లిపాయ
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అన్నట్టు వేసవిలో ఉల్లిపాయ సహజ శీతలీకరిణిగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ భోజనంతో పాటు ఉల్లిపాయ తినండి. ఇలా చేయడం వల్ల వడదెబ్బ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. చర్మానికి చల్లదనాన్నిస్తుంది.