Health: ఉదయం నిద్రవేలగానే నోటిలో చేదుగా ఉంటోందా.? మీలో ఈ సమస్య ఉన్నట్లే
Health: ఉదయం నిద్రలేచిన వెంటనే మనలో కనిపించే లక్షణాలు మన ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తాయని నిపుణులు చెబుతుంటారు. కొన్ని లక్షణాల ఆధారంగా మన ఆరోగ్యం ఎలా ఉందో చెప్పేస్తాయి. అలాంటి ఓ లక్షణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయం లేవగానే నోట్లో పుల్లగా లేదా చేదుగా అనినిస్తోందా.?
సాధారణంగా ఉదయం లేవగానే శరీరం తాజాగానే ఉండాలి. కానీ కొందరికి నోట్లో పుల్లగా లేదా చేదుగా రుచి వస్తుంది. ఇది ఒక్కసారిగా వస్తే పెద్ద సమస్య కాదు. రోజూ అదే అనుభూతి ఉంటే మాత్రం శరీరం ఇస్తున్న హెచ్చరికగా భావించాలి. ముఖ్యంగా ఇది కడుపు సమస్యకు సంకేతం కావచ్చు
నోటి సమస్యలకు కడుపుతో ఉన్న సంబంధం
నోట్లో వచ్చే చాలా సమస్యలు కడుపుతో నేరుగా సంబంధం కలిగి ఉంటాయి. కడుపు సరిగా పనిచేస్తే నోట్లో దుర్వాసన, చేదు రుచి వంటి సమస్యలు తగ్గుతాయి. కడుపులో జీర్ణక్రియ బలహీనపడితే ఆ ప్రభావం నోట్లో కనిపిస్తుంది. అందుకే ఉదయాన్నే చేదు రుచి రావడం కడుపు సరిగా లేనట్లు సూచిస్తుంది.
కడుపులో ఏ సమస్య వల్ల ఇలా జరుగుతుంది?
ఆధునిక వైద్య విధానంలో దీనిని ఆసిడ్ రిఫ్లక్స్ సమస్యగా చెబుతారు. కడుపులో ఆమ్లం ఎక్కువగా తయారై పైకి రావడం వల్ల నోట్లో పుల్లగా లేదా చేదుగా అనిపిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం ఇది పిత్త దోషం పెరగడం వల్ల జరుగుతుంది. పిత్తం ఎక్కువైతే కడుపులో ఆమ్లం పెరుగుతుంది. దీని ప్రభావం జీర్ణవ్యవస్థపై మాత్రమే కాదు, ఎముకలు, కీళ్ల బలంపైనా పడుతుంది.
రాత్రి చేసే తప్పులు ఈ సమస్యను పెంచుతాయి
రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం. ఆల్కహాల్ పొగాకు అలవాట్లు. ఎక్కువసేపు ఆకలితో ఉండడం. జీర్ణశక్తి తగ్గిపోవడం. కాలేయం సరిగా పనిచేయకపోవడం. వంటివి కడుపులో ఆమ్లాన్ని పెంచుతాయి. ఫలితంగా ఉదయం నోట్లో చేదు రుచి వస్తుంది.
ఆయుర్వేద చిట్కాలు, జీవనశైలి మార్పులు
త్రిఫల చూర్ణం ఈ సమస్యకు మంచి పరిష్కారం. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటితో అర చెంచా త్రిఫల చూర్ణం తీసుకోవాలి. ఇది ఉదయం మలబద్ధకం లేకుండా చేస్తుంది, పిత్తాన్ని తగ్గిస్తుంది.
రాత్రి భోజనం త్వరగా చేయాలి. భోజనం చేసిన వెంటనే పడుకోకూడదు. కొద్దిసేపు నడవాలి. ఎడమ వైపు తిరిగి పడుకోవడం మంచిది. ఇలా చేస్తే కడుపు ఆమ్లం పైకి రావడం తగ్గుతుంది.
రాగి పాత్రలో రాత్రి నీరు ఉంచి ఉదయం తాగడం కూడా ఉపయోగకరం. ఇది కడుపులో ఆమ్లాన్ని తగ్గిస్తుంది, శరీరాన్ని శుద్ధి చేస్తుంది. భోజనం తర్వాత సోంపు నమలడం జీర్ణక్రియకు సహాయపడుతుంది.
మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం చాలా అవసరం. ఒత్తిడి ఎక్కువైతే కడుపులో ఆమ్ల ఉత్పత్తి సాధారణం కంటే ఎక్కువగా పెరుగుతుంది.
గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

