కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ 7 మార్గాలు పాటించండి
మన శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైన అవయవాలు. వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం. ఈ ఏడు చిట్కాలు పాటిస్తే చాలు.
health-life Mar 12 2026
Author: Nandini Arava Image Credits:Our own
Telugu
మంచి నీళ్లు తాగాలి
కిడ్నీలు సరిగ్గా పనిచేయాలంటే.. ముఖ్యంగా చేయాల్సిన పని రోజూ తగినన్ని నీళ్లు తాగడం. ఇది శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడంలో సాయపడుతుంది.
Image credits: Getty
Telugu
లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్ట్ చేయించుకోండి
తీవ్రమైన నడుము నొప్పి, మూత్రంలో రక్తం, జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించి కిడ్నీ వ్యాధి ఉందో, లేదో నిర్ధారించుకోవాలి.
Image credits: Our own
Telugu
బీపీ, షుగర్ కంట్రోల్‌లో ఉంచుకోండి
మీ రక్తపోటు (బీపీ), రక్తంలో చక్కెర స్థాయిలను (షుగర్) ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. దీనివల్ల సమస్యలను ముందుగానే గుర్తించి, కిడ్నీలను కాపాడుకోవచ్చు.
Image credits: Getty
Telugu
సొంత వైద్యం అస్సలు వద్దు
నొప్పి నివారణ మందులు, కొన్ని సప్లిమెంట్లు సొంతంగా, తరచుగా వాడటం వల్ల కిడ్నీ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. డాక్టర్ సలహా లేకుండా మందులు వాడొద్దు.
Image credits: Getty
Telugu
సమతుల్య ఆహారం తినండి
ఆహారంలో ఉప్పు తగ్గించండి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినండి. ఆరోగ్యకరమైన బరువును మెయింటెయిన్ చేయండి. సిగరెట్, మందు లాంటి అలవాట్లను మానేయండి.
Image credits: Getty
Telugu
రెగ్యులర్‌గా హెల్త్ చెకప్స్ చేయించుకోండి
కిడ్నీ పనితీరును తెలిపే రక్త, మూత్ర పరీక్షలు చేయించుకోవాలి. GFR (గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ రేట్), మూత్రంలో ప్రోటీన్ (ప్రోటీన్యూరియా) ఉన్నాయో లేదో చెక్ చేయించుకోవాలి.