Loan: 72 గంటల్లో రూ. 5 లక్షల లోన్.. బ్యాంక్‌కి వెళ్లాల్సిన పని కూడా లేదు.
Loan: లోన్ కావాలంటే మంచి సిబిల్ స్కోర్ ఉండాలని తెలిసిందే. ఆ తర్వాత బ్యాంకుల చుట్టూ తిరగాలి. అయితే అలాంటిదేం లేకుండా ఫోన్‌లో ఒక సింగిల్ క్లిక్‌తో డబ్బులు మీ ఖాతాలోకి వస్తే భలే ఉంటుంది కదూ! అలాంటి ఓ ఫీచర్‌నే ఫోన్‌పే తీసుకొచ్చింది.

ఫోన్‌పే నుంచి లోన్.. బ్యాంక్ చుట్టూ తిరగాల్సిన పనిలేదు
అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు బ్యాంకుల వద్ద తిరగడం చాలామందికి పెద్ద తలనొప్పి. డాక్యుమెంట్లు, గ్యారంటీలు అంటూ ఆలస్యం అవుతుంది. ఈ పరిస్థితికి ఫోన్‌పే ఇప్పుడు సులభమైన పరిష్కారం చూపిస్తోంది. రోజూ డిజిటల్ చెల్లింపుల కోసం వాడే ఫోన్‌పే యాప్ నుంచే లోన్ తీసుకునే అవకాశం అందిస్తోంది.
ఎంత వరకు లోన్ పొందవచ్చు?
ఫోన్‌పే వివిధ బ్యాంకులు, NBFCలతో కలిసి పర్సనల్ లోన్స్ అందిస్తోంది. వినియోగదారుడి క్రెడిట్ ప్రొఫైల్ ఆధారంగా రూ.10 వేల నుంచి గరిష్టంగా రూ.5 లక్షల వరకు లోన్ లభిస్తుంది. ఇవి అన్‌సెక్యూర్డ్ లోన్స్ కావడంతో ఎలాంటి బంగారం లేదా ఆస్తి తాకట్టు అవసరం ఉండదు. చిన్న వ్యాపార ఖర్చులు, వైద్య అవసరాలు, కుటుంబ అవసరాలకు ఇది ఉపయోగపడుతుంది.
వడ్డీ రేట్లు, రీపేమెంట్ గడువు
లోన్ ఆమోదం పొందిన తరువాత డబ్బు గరిష్టంగా 72 గంటల్లో బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. రీపేమెంట్ కాలాన్ని 12 నెలల నుంచి 60 నెలల వరకు ఎంచుకోవచ్చు. వడ్డీ రేట్లు ఏడాదికి సుమారు 11.30 శాతం నుంచి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు, EMI వివరాలు ముందే స్పష్టంగా చూపిస్తారు.
ఎవరు అర్హులు? అవసరమైన అర్హతలు
ఈ లోన్ కోసం అప్లై చేయాలంటే వయస్సు 21 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి. నెలవారీ ఆదాయం కనీసం రూ.15,000 అవసరం. సిబిల్ స్కోర్ 650 కంటే ఎక్కువగా ఉంటే ఆమోదం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. స్థిరమైన ఆదాయం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
అప్లై చేసే విధానం, కావాల్సిన పత్రాలు
ఈ లోన్ ప్రక్రియ మొత్తం డిజిటల్ పద్ధతిలోనే జరుగుతుంది. ఆధార్ కార్డు, పాన్ కార్డు, గత ఆరు నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్, శాలరీ స్లిప్స్ ఉంటే సరిపోతుంది. అప్లై చేయాలంటే ముందుగా ఫోన్‌పే యాప్ ఓపెన్ చేయాలి. అనంతరం లోన్స్ విభాగంలోకి వెళ్లాలి, తర్వాత వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి. లోన్ మొత్తం, కాలపరిమితి ఎంచుకోవాలి చివరికి అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేయాలి.

