ఉసిరిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, శరీరంలో వాపులను తగ్గిస్తుంది. జుట్టు పెరిగేందుకు ఉపయోగపడుతుంది.
Image credits: Getty
Telugu
కంటి చూపును మెరుగుపరుస్తుంది
ఉసిరికాయను రోజూ తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కంటి చూపు సమస్యలు తగ్గుతాయి. డయాబెటిస్‌ను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
ఇన్ఫెక్షన్లు, జలుబు, జ్వరం దూరం
ఉసిరిలో ఉండే విటమిన్ సి తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. దీనివల్ల శరీరం ఇన్ఫెక్షన్లు, జలుబు, జ్వరం వంటి వాటితో పోరాడటానికి సిద్ధంగా ఉంటుంది.
Image credits: Getty
Telugu
మలబద్ధకానికి చెక్
ఉసిరిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. అలాగే అసిడిటీ, కడుపు ఉబ్బరం సమస్యలను కూడా తగ్గిస్తుంది.
ఉసిరికాయ రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా మెరుగుపరుస్తుంది.
Image credits: our own
Telugu
అతిగా తినడాన్ని అరికడుతుంది
ఉసిరిలో ఉండే ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దీనివల్ల అతిగా తినాలనే కోరిక తగ్గి, బరువు నియంత్రణలో ఉంటుంది.
Image credits: Pinterest
Telugu
రోజుకు 1 లేదా 2 ఉసిరికాయలు చాలు
ఉసిరిని ఉప్పుతో, జ్యూస్‌గా లేదా ఏ రూపంలోనైనా తినొచ్చు. రోజుకు 1 లేదా 2 ఉసిరికాయలు తినడం మంచిది. పొడి రూపంలో అయితే, 1-2 చెంచాల పొడిని తేనెతో కలిపి తీసుకోవచ్చు.