MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Health: గుండె ఆరోగ్యానికి మంచిద‌ని వైన్ తెగ తాగేస్తున్నారా.. ఏమ‌వుతుందో తెలుసా.?

Health: గుండె ఆరోగ్యానికి మంచిద‌ని వైన్ తెగ తాగేస్తున్నారా.. ఏమ‌వుతుందో తెలుసా.?

Health: ఆల్క‌హాల్ అల‌వాటు వారు కూడా వైన్ తాగుతుంటారు. అంతేకాకుండా వైన్ తాగితే గుండె ఆరోగ్యం బాగుంటుంద‌నే చ‌ర్చ న‌డుస్తుంటుంది. ఇంత‌కీ నిజంగానే వైన్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందా.? ఇందులో ఎంత వ‌ర‌కు నిజం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. 

1 Min read
Author : Narender Vaitla
Published : Feb 07 2026, 01:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రెడ్ వైన్ మంచిదంటూ
Image Credit : Getty

రెడ్ వైన్ మంచిదంటూ

చాలా కాలంగా వైన్ గుండె ఆరోగ్యానికి మంచిదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యంగా రెడ్ వైన్‌పై ఈ ప్రచారం ఎక్కువగా జ‌రుగుతుంది. రోజుకు ఒక గ్లాస్ వైన్ తాగితే గుండెను కాపాడుతుందన్న వాద‌న ఎక్కువ‌గా వినిపిస్తోంది. అయితే ఇందులో ఎంత నిజం ఉందన్నది తెలుసుకోవాల్సిన విషయం.

25
రెడ్ వైన్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు
Image Credit : Getty

రెడ్ వైన్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు

రెడ్ వైన్‌లో రెస్వెరాట్రాల్ అనే సహజ పదార్థం ఉంటుంది. ఇది ద్రాక్ష తొక్కలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పదార్థం యాంటీఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉండటం వల్ల రక్తనాళాల లోపలి పొరను రక్షించడంలో సహాయపడవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. చెడు కొలెస్ట్రాల్ ఆక్సిడేషన్ తగ్గడంలో కూడా ఇది కొంతవరకు ఉపయోగపడవచ్చు.

Related Articles

Related image1
రేష‌న్ కార్డు ఉన్న వారి ఖాతాలోకి నేరుగా డ‌బ్బులు.. కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.
Related image2
తుల‌సి మొక్క కింద రూపాయి కాయిన్ పెట్టి చూడండి.. జీవితంలో ఊహ‌కంద‌ని మార్పులు ఖాయం
35
మంచి కొలెస్ట్రాల్‌పై ప్రభావం
Image Credit : Getty

మంచి కొలెస్ట్రాల్‌పై ప్రభావం

కొన్ని అధ్యయనాల ప్రకారం తక్కువ మోతాదులో వైన్‌ తీసుకుంటే హెచ్డిఎల్ అనే మంచి కొలెస్ట్రాల్ స్థాయి స్వల్పంగా పెరగవచ్చు. ఈ కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకుపోయిన అదనపు కొవ్వును కాలేయానికి తరలించడంలో సహాయపడుతుంది. దీని వల్ల రక్తనాళాల్లో బ్లాకేజీ ప్రమాదం కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రభావం చాలా స్వల్పమే.

45
ఎంత మోతాదులో తాగాలి.?
Image Credit : our own

ఎంత మోతాదులో తాగాలి.?

వైన్‌తో గుండెకు మేలు జరుగుతుందన్నది పూర్తిగా తక్కువ మోతాదుకే పరిమితం. వైద్య నిపుణుల సూచన ప్రకారం మహిళలకు రోజుకు ఒక డ్రింక్, పురుషులకు రోజుకు రెండు డ్రింక్స్ తీసుకుంటే మంచిద‌ని అంటారు. ఒక డ్రింక్ అంటే సుమారు 120 నుంచి 150 మిల్లీలీటర్ల వైన్‌గా పరిగణిస్తారు. దీన్ని మించి తాగితే లాభాలు రావు, ప్రమాదాలే పెరుగుతాయి.

55
వైన్‌తో న‌ష్టాలున్నాయా.?
Image Credit : Getty

వైన్‌తో న‌ష్టాలున్నాయా.?

ఎక్కువ మోతాదులో వైన్ తాగితే గుండె ఆరోగ్యానికి ముప్పు పెరుగుతుంది. అధిక రక్తపోటు, గుండె వేగంగా కొట్టు కోవ‌డం, ఊబకాయం, కాలేయ సమస్యలు, స్ట్రోక్ ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుంది. వైన్ ఔష‌ధం కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే అప్పుడప్పుడు తాగేవారికి పెద్ద నష్టం లేకపోవచ్చు. కానీ తాగని వారు గుండె ఆరోగ్యం కోసమని కొత్తగా మొదలు పెట్టాల‌ని వైద్యులు ఎప్పుడూ సూచించ‌రు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Ajwain Water: 7 రోజులపాటు ఖాళీ కడుపుతో వాము వాటర్ తాగితే కలిగే 5 లాభాలు ఇవే!
Recommended image2
Fenugreek Water: 11 రోజులపాటు మెంతుల నీళ్లు తాగితే శరీరంలో జరిగే 5 మార్పులు ఇవే!
Recommended image3
Lemon Water: 7 రోజుల పాటు ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీళ్లు తాగితే కలిగే 5 లాభాలు ఇవే!
Related Stories
Recommended image1
రేష‌న్ కార్డు ఉన్న వారి ఖాతాలోకి నేరుగా డ‌బ్బులు.. కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.
Recommended image2
తుల‌సి మొక్క కింద రూపాయి కాయిన్ పెట్టి చూడండి.. జీవితంలో ఊహ‌కంద‌ని మార్పులు ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved