Pomegranate : తొక్కే కదా అని పారేయకండి.. దానిమ్మ తొక్కతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో!
Pomegranate Peels: సాధారణంగా దానిమ్మ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందో అందరికీ తెలిసిందే. కానీ దీని తొక్క గురించి మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఈ తొక్కతో ఎలాంటి ప్రయోజనం లేదని పారేస్తుంటారు. కానీ ఈ తొక్క కూడా మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. అదెలాగంటే?

దానిమ్మ తొక్కతో ప్రయోజనాలు
దానిమ్మ.. ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే దానిమ్మకు అన్ని కాలాల్లోనూ ఎక్కువ డిమాండ్. కానీ మనం దానిమ్మ తిన్న తర్వాత దాని తొక్కను చెత్తకుప్పలో పడేస్తాం. కానీ, దానిమ్మ తొక్క కూడా పండు లాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఆయుర్వేదంలో దానిమ్మ తొక్కలు ఔషధ గుణాలతో నిండి ఉన్నాయని చెబుతారు. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, కడుపు సమస్యలను తగ్గిస్తుంది. చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఇకపై దానిమ్మ తొక్కను పారేయకండి. మరి దానిమ్మ తొక్క తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం…
గుండె ఆరోగ్యం
దానిమ్మ తొక్కలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించి, రక్తనాళాలను శుభ్రంగా ఉంచుతాయి. ఫలితంగా, రక్తపోటు నియంత్రణలో ఉండి, గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.
ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ
దానిమ్మ తొక్కలో యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు ఉండటంతో కఫం తగ్గించి గొంతు ఇన్ఫెక్షన్‌కు ఉపశమనం కలిగిస్తుంది. కషాయం లేదా పొడి రూపంలో వాడితే మంచి ఫలితం.
జీర్ణక్రియకు మేలు:
దానిమ్మ తొక్కల్లో అధిక ఫైబర్ ఉండటంతో జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. ఇది అతిసారం, ఆమ్లత, కడుపు నొప్పికి ఉపశమనం ఇస్తుంది. శరీరంలో ఉన్న పురుగులు, విషాలను కూడా తొలగించడంలో సహాయపడుతుంది.
డిటాక్సిన్ గా
దానిమ్మ తొక్కలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన విషాలు బయటకు పంపబడతాయి. ఇది కాలేయం, మూత్రపిండాల శుద్ధికి తోడ్పడుతుంది. రక్తాన్ని శుభ్రపరిచి, చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.
మచ్చలేని చర్మం కోసం
దానిమ్మ తొక్కలో అధిక మొత్తంలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. ముఖంపై మచ్చలు, ముడతలు, మొటిమలను తగ్గించడంలో సహాయపడుతాయి. దానిమ్మ తొక్క పొడిని తయారు చేసి, దానిని ఫేస్ ప్యాక్‌గా కూడా వాడవచ్చు.