Health Tips: కొబ్బరి బొండంలో కొబ్బరి తింటే ఆ సమస్యలన్నీ తీరిపోతాయి
Health Tips: మంచి ఎండలో కొబ్బరి బొండం తాగితే ఎంత హాయిగా ఉంటుందో కదా.. మనలో చాలా మంది కొబ్బరి బొండం తాగి పడేస్తారు. కాని అందులో ఉండే కొబ్బరి కూడా తింటే చాలా ఆరోగ్య సమస్యలు తీరిపోతాయని డాక్టర్లు చెబుతున్నారు. కొబ్బరిలో ఎలాంటి పోషకాలు ఉంటాయి? వాటి వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కొబ్బరి తినాలంటే చాలా మందికి ఉన్న అనుమానం ఏంటంటే.. దగ్గు వస్తుందని. కొబ్బరి తింటే దగ్గు వస్తుందని చాలా మంది కొబ్బరి తినరు. దీని వల్ల కొబ్బరిలో ఉండే పోషకాలు అందక శరీరం అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్న వారు కొబ్బరి తింటే దగ్గు వస్తుంది. అందులోనూ కొబ్బరి ఎక్కువగా తింటే దగ్గు వస్తుంది తప్ప కొంచెం తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదు.
కొబ్బరిలో కాపర్, ఐరన్, జింక్, పొటాషియం, పాస్ఫరస్ లాంటి మినరల్స్ ఉంటాయి. వీటితో పాటు విటమిన్ బి, సి, ఈ వంటి విటమిన్స్ కూడా ఉంటాయి. అందువల్ల తరచూ కొబ్బరి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రత్యేకంగా కొబ్బరి తినమంటే తినలేం కాబట్టి కొబ్బరి నీళ్లు తాగిన తర్వాత అందులో ఉండే కొబ్బరిని తినడం మంచిది. అందుకే చాలా ఆలయాల్లో ప్రసాదంగా కొబ్బరి ముక్కలు పెడతారు.
పచ్చి కొబ్బరిలో యాంటీవైరల్, యాంటీఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే కొబ్బరి తింటే శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. తరచూ కొబ్బరి తినడం వల్ల ఇన్ఫెక్షన్లు సోకవు. బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు రాకుండా ఉంటాయి. ఒకవేళ ఇలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా రోగ నిరోధక శక్తి వల్ల శరీరం దీటుగా పోరాడుతుంది.
కొబ్బరిలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. జుట్టు, చర్మం పొడిబారకుండా చేస్తుంది. చర్మంపై ముడతలు రాకుండా కాపాడుతుంది. వచ్చిన ముడతలు తగ్గేలా చేస్తుంది. బీపీని కంట్రోల్ లో ఉంచుతుంది. గుండె సంబంధిత రోగాలు రాకుండా కాపాడుతుంది.
కొబ్బరి తింటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ప్రత్యేకంగా కొబ్బరి తినడం అంటే సాధ్యం కాదు కాబట్టి ఆలయాల్లో ప్రసాదంగా కొబ్బరి ముక్క పెడతారు. కొబ్బరి శరీరానికి మేలు చేసేదే అయినప్పటికీ అతిగా తింటే ఎన్నో ఇబ్బందులను కూడా కలిగిస్తుంది. అందువల్ల కొబ్బరి కూడా మితంగా తినడమే మంచిది.