MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • కమ్మని వాసనొచ్చే కరివేపాకును తినే అలవాటు లేదా? అయితే మీరు ఈ లాభాలను మిస్ అయినట్టే పో..

కమ్మని వాసనొచ్చే కరివేపాకును తినే అలవాటు లేదా? అయితే మీరు ఈ లాభాలను మిస్ అయినట్టే పో..

ఒక్క కరివేపాకు చాలు పోపు కమ్మని వాసన రావడానికి. అంతేనా.. కరివేపాకు వంటల టేస్ట్ ను అలా అలా పెంచేస్తుంది. కానీ కొంతమంది ఆకే కాదా అని పక్కన పెట్టేస్తుంటారు. ఇలాంటి వారే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను మిస్ అయిపోతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 04 2023, 07:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

చాలా మంది కరివేపాకును ప్రతి కూరలో వేస్తుంటారు. అయినా వాటిని మాత్రం తినరు. నిజానికి కరివేపాకు వంటల రుచిని పెంచుతుంది. అంతేకాదు ఈ ఆకులు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. కానీ కరివేపాకును తినే వారు చాలా తక్కువ మందే ఉంటారు. ప్లేట్ లో కరివేపాను ఓ పక్కన పెట్టేవారు ఎన్నో లాభాలను మిస్ అవుతారని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

కరివేపాకులో ఉండే కార్బజోల్ ఆల్కలాయిడ్స్ మీ శరీరం బరువు పెరగకుండా ఆపుతాయి. అలాగే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. అందుకే మీరు బరువు తగ్గాలనుకుంటే ఎండిన కరివేపాకును చిరుతిండిగా తినడానికి ప్రయత్నించండి. లేదా సలాడ్ లేదా ఇతర వంటకాలు, మీ భోజనంలో తాజా లేదా డ్రై కరివేపాకును జోడించండి. 
 

35

విరేచనాలు, విరేచనాలు, మలబద్ధకం నయం

విరేచనాలు, మలబద్ధకం, విరేచనాలతో సహా కడుపు నొప్పికి కరివేపాకు దివ్య ఔషదంలా సహాయపడుతుంది. ఇవి ప్రేగు కదలికను ప్రోత్సహిస్తాయి. అలాగే జీర్ణ ఎంజైమ్లను పెంచుతాయి. ఇవి ఈ జీర్ణ సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. ఎండిన కరివేపాకును గ్రైండ్ చేసి మజ్జిగలో కలిపి పరగడుపున తాగొచ్చు. లేకపోతే పచ్చి, లేత కరివేపాకును ఖాళీ కడుపుతో కూడా తినొచ్చు.

45

మార్నింగ్ సిక్ నెస్, వికారం నుంచి ఉపశమనం

మొదటి త్రైమాసికంలో ఉన్న, మార్నింగ్ సిక్ నెస్,  వికారం ఎదుర్కొంటున్న గర్భిణీ స్త్రీలకు కరివేపాకులు ఎంతో మేలు చేస్తాయి. కరివేపాకులను తింటే మంచి అనుభూతి కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కరివేపాకు శరీరంలో జీర్ణ రసాలను పెంచుతుంది. ఇది వికారం, మార్నింగ్ సిక్ నెస్, వాంతులు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 
 

55

బ్యాక్టీరియాను తొలగిస్తుంది

కరివేపాకులో కార్బజోల్ ఆల్కలాయిడ్స్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. కరివేపాకులో లినోలోల్ అనే సమ్మేళనం కూడా ఉంటుంది. ఇది వాటికి ప్రత్యేకమైన సువాసననిస్తుంది. అలాగే బ్యాక్టీరియాను చంపుతుంది.  శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను తొలగించడానికి లినోలోల్ సహాయపడుతుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Constipation: మలబద్ధకం బాగా వేధిస్తోందా? రోజూ ఈ 3 అలవాట్లు పాటిస్తే మాయం
Recommended image2
Heartburn: ఇదొక్కటి తినడం తగ్గిస్తే చాలు..ఛాతీలో మంట కంట్రోల్ అవుతుంది
Recommended image3
Chicken Biryani: 30 నిమిషాల్లో ఘుమఘుమలాడే పొట్లం బిర్యానీ.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved