MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?

Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?

Fast Food: వాతావరణం చల్లగా ఉందని అలా బయటకు వెళ్లి ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? వేడి వేడిగా బజ్జీలు, పునుగులు, పకోడీలు నోరూరిస్తున్నాయా..? ఆగండాగండి అవి తినేముందు అవి వేగుతున్న నూనెను ఒక్క సారి గమనించండి.

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 04 2026, 05:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
నేటి వంటల్లో నూనె పాత్ర కీలకం..
Image Credit : Gemini AI

నేటి వంటల్లో నూనె పాత్ర కీలకం..

ఈరోజుల్లో ఇంట్లో వండుకుని తినే ఓపిక చాలా మందిలో ఉండటంలేదు. బయట తిండికి బాగా అలవాటు పడిపోతున్నారు. ఉదయం వేడి వేడిగా బ్రేక్ ఫాస్ట్ లు.. సాయంత్రం వేడి వేడి బజ్జీలు, బోండాలు అన్నీ బయట నుంచి తెచ్చుకుని తినడానికి అలవాటు పడుతున్నారు. కానీ అది ఎంత ప్రమాదమో మాత్రం గమనించడంలేదు. మన రోజువారీ వంటకాల్లో వంటనూనె పాత్ర అత్యంత కీలకమైనది. 

అయితే, నేటి వేగవంతమైన జీవితంలో వీధి దుకాణాల్లో, హోటళ్లలో లేదా ఇళ్లలోనే పదేపదే మరిగించిన నూనెను వాడటం మనం చూస్తుంటాం. ఇది ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తుంది. భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) ప్రకారం, మనం వాడే నూనె నాణ్యతను కేవలం 10 సెకన్లలో గుర్తించడానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ 10 సెకన్ల చెక్‌లిస్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
నూనె నాణ్యతను పరీక్షించే సులభమైన సూత్రాలు
Image Credit : ChatGPT

నూనె నాణ్యతను పరీక్షించే సులభమైన సూత్రాలు

మీరు ఫాస్ట్ ఫఉడ్ తినడానికి వెళ్లినప్పుడు అక్కడ పదార్ధాలు రుచి మాత్రమే కాదు నూనె ఎలా ఉందా అనేది కూడా చూడండి. తాజా మంచి నూనె ఎల్లప్పుడూ బంగారు పసుపు (Golden Yellow) లేదా లేత గోధుమ రంగులో ఉంటుంది. నూనె చాలా నల్లగా లేదా ముదురు గోధుమ రంగులోకి మారితే అది పాడైపోయిందని అర్థం. అంతే కాదు ఆహార పదార్థాలు నూనెలో వేయకముందే నూనె నుంచి పొగ వస్తుంటే, అది అధిక ఉష్ణోగ్రతకు చేరిందని లేదా నూనెలోని పోషకాలు దెబ్బతిని పాడవుతోందని గ్రహించడండి. ఇది ఒక్కటే కాదు నూనెను వేడిచేస్తున్నప్పుడు దాని ఉపరితలంపై నిరంతరం ఎక్కువ నురుగు కనిపిస్తే, అది పదేపదే వాడిన నూనె కావచ్చు. అటువంటి చోట అసలు తినకపోవడం ఉత్తమం.

Related Articles

Related image1
Washing Machine: టాప్ లోడ్.. ఫ్రంట్ లోడ్ డిటర్జెంట్ లిక్విడ్స్ మధ్య తేడా ఏంటి? విడి విడిగా ఎందుకు వాడాలి?
Related image2
Husband Health: మీ భర్త హెల్తీగా ఉండాలంటే.. భార్యలు తప్పక తెలుసుకోవాల్సిన 5 ఆరోగ్య సూత్రాలు
36
తాజా నూనె వాసన బట్టి తెలుస్తుంది.
Image Credit : Asianet News

తాజా నూనె వాసన బట్టి తెలుస్తుంది.

తాజా నూనెకు ఎటువంటి దుర్వాసన ఉండదు. కానీ కాలిన వాసన, పులిసిన వాసన లేదా అసహజమైన వాసన వస్తే ఆ నూనె వాడుతున్న చోట పదార్ధాలు తినకపోవడం చాలా మంచిది. ఈ విషయంలో వారిని మీరు హెచ్చరించవచ్చు కూడా. అంతే కాదు నూనెలో వేయించిన పదార్థాలు బయట నల్లగా ఉండి, లోపల సరిగా ఉడకకపోతే నూనె ఉష్ణోగ్రత లేదా నాణ్యత లోపించిందని గ్రహించాలి. అలాగే పదార్థాలు ఎక్కువ నూనెను పీల్చుకుని జిడ్డుగా మారినా నూనె నాణ్యత సరిగా లేదని అర్థం.

46
వ్యాపారుల అలవాట్లు గమనించండి
Image Credit : Gemini AI

వ్యాపారుల అలవాట్లు గమనించండి

ఒక సారి వాడిన నూనెను రోజంతా మాత్రమే కాకుండా మరుసటి రోజు కూడా వాడుతున్నట్లు అనిపిస్తే అటువంటి చోట ఆహారం తినకపోవడం మంచిది. రోజువారీగా కొత్త నూనె పోస్తూ, నూనెను తరచూ వడకట్టి పరిశుభ్రంగా ఉంచే దుకాణాలనే ఎంచుకోండి. నూనెను ఎప్పుడు వాడకూడదొ తెలిపేందుకు కొన్ని సూచనలు ఉన్నాయి. నూనె ముదురు నలుపు రంగులోకి మారినప్పుడు కానీ..

వేడి చేస్తున్నప్పుడు నీలం-బూడిద రంగు పొగ వస్తున్నప్పుడు విపరీతమైన నురుగు, దుర్వాసన వస్తున్నప్పుడు..నూనె బాగా చిక్కబడి జిడ్డుగా (Sticky) మారినప్పుడు. ఆ నూనె వాడకానికి పనికి రాదు అని గుర్తించాలి.

56
పదేపదే వాడిన నూనె వల్ల కలిగే ప్రమాదాలు:
Image Credit : Gemini AI

పదేపదే వాడిన నూనె వల్ల కలిగే ప్రమాదాలు:

FSSAI ముఖ్యమైన మార్గదర్శకాల ప్రకారం డీప్ ఫ్రై కోసం ఒకే నూనెను 3 సార్లకు మించి మళ్లీ ఉపయోగించవద్దు. నూనెలో TPC (Total Polar Compounds) విలువ 25% దాటితే అది మానవ వినియోగానికి హానికరం. పదేపదే మరిగించిన నూనెలో టాక్సిక్ కాంపౌండ్లు పెరుగుతాయి. దీనివల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగి రక్తనాళాలు మూసుకుపోతాయి దాంతో గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. అంతే కాదు కాలేయంపై తీవ్ర ఒత్తిడి పడి కాలేయ సంబంధిత వ్యాధులు వస్తాయి. ఇటువంటి నూనెతో చేసిన పదార్ధాలు తింటే తీవ్రమైన అసిడిటీ, గ్యాస్, కడుపులో మంట వస్తాయి. ఇవి మాత్రే కాదు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ముప్పు పెరుగుతుంది.

66
ఆరోగ్యానికి మేలు చేసే మంచి అలవాట్లు:
Image Credit : Freepik

ఆరోగ్యానికి మేలు చేసే మంచి అలవాట్లు:

నూనెను అతిగా వేడి చేయకూడదు. ఒకసారి వాడిన నూనెను వడకట్టి, మూత ఉన్న పాత్రలో చల్లని ప్రదేశంలో నిల్వ చేయాలి. పొగ వచ్చేంత వరకు వేడి చేయకుండా, తరచూ కొత్త నూనెను వాడుతూ ఉండాలి. గుర్తుంచుకోండి ఈ 10 సెకన్ల సూచికలు ప్రాథమిక జాగ్రత్తల కోసం మాత్రమే. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంచుకోండి, జాగ్రత్తగా ఎంచుకోండి, ఆరోగ్యంగా ఉండండి

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Damaged Notes Exchange : చిరిగిన కరెన్సీ నోట్లను ఎలా మార్చుకోవాలి? RBI రూల్స్ ఏం చెబుతున్నాయో తెలుసా?
Recommended image2
World's Fastest Bird : బుల్లెట్ ట్రైన్ ను తలదన్నే స్పీడ్..! గంటకు 350-400 కి.మీ వేగంతో దూసుకెళ్లే జీవి ఏదో తెలుసా?
Recommended image3
USA: అమెరికాలో కూలీ ప‌నికి, పొలం ప‌నుల‌కు వీసా ఇస్తారా.? నెల‌కు ఎంత జీతం ఉంటుంది.?
Related Stories
Recommended image1
Washing Machine: టాప్ లోడ్.. ఫ్రంట్ లోడ్ డిటర్జెంట్ లిక్విడ్స్ మధ్య తేడా ఏంటి? విడి విడిగా ఎందుకు వాడాలి?
Recommended image2
Husband Health: మీ భర్త హెల్తీగా ఉండాలంటే.. భార్యలు తప్పక తెలుసుకోవాల్సిన 5 ఆరోగ్య సూత్రాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved