Weight Loss: గ్రీన్ టీనా? బ్లాక్ కాఫీనా? బరువు తగ్గడానికి ఏది బెస్ట్?
Green Tea vs Black Coffee: అధిక బరువును తగ్గడానికి చాలామంది నానాతంటాలు పడుతుంటారు. కొంతమంది తమ డైట్ లో రకరకాల పానీయాలను యాడ్ చేసుకుంటారు. అందులో గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ ఉంటాయి. అయితే.. ఈ రెండింటిలో బరువు తగ్గడానికి ఏది మంచిది? అనే విషయం తెలుసుకుందాం.

గ్రీన్ టీనా? బ్లాక్ కాఫీనా?
బరువు తగ్గాలనుకునేవారు గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీ తాగుతారు. ఈ రెండింటిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు బరువు తగ్గడానికి సహాయపడతాయి. గ్రీన్ టీ, బ్లాక్ కాఫీలో కేలరీలు తక్కువగా, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీవక్రియను పెంచి, శరీరంలోని కొవ్వును తగ్గించి బరువు తగ్గడానికి దోహదం చేస్తాయి. కానీ ఈ రెండింటిలో ఏది బరువు తగ్గడానికి వేగంగా సహాయపడుతుందో ఈ పోస్ట్‌లో చూద్దాం.
గ్రీన్ టీ ప్రయోజనాలు
బరువు తగ్గాలనుకునేవారి ఫస్ట్ ఛాయిస్ గ్రీన్ టీ. చాలా మంది బరువు తగ్గడానికి రోజుకు 3-4 కప్పుల గ్రీన్ టీ తాగుతారు. గ్రీన్ టీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. దీనికి కారణం దానిలోని కెఫీన్, కాటెచిన్. ఒక అధ్యయనం ప్రకారం.. కాటెచిన్ శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. గ్రీన్ టీ సేవించడం వల్ల బరువు తగ్గడమే కాకుండా సరైన నిద్రకు సహాయపడుతుంది. ఇది టైప్ 2 డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలకు చెక్ పెడుతుంది. అల్జీమర్స్ వంటి సమస్యలను తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది. గ్రీన్ టీలో మెగ్నీషియం, ఫ్లేవనాయిడ్లు, విటమిన్ బి, ఫోలేట్ ఉంటాయి.
బ్లాక్ కాఫీ ప్రయోజనాలు
బరువు తగ్గడానికి మరో ఛాయిస్ బ్లాక్ టీ. బరువు తగ్గాలనుకునే చాలా మంది ఈ డింక్స్ ఇష్టపడతారు. గ్రీన్ టీ లాగే, ఈ పానీయంలో కెఫీన్ ఉండటం వల్ల ఇది బరువు తగ్గడానికి, డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. బ్లాక్ కాఫీ జీవక్రియను పెంచుతుంది. దీనివల్ల ఆకలి తగ్గి, అనారోగ్యకరమైన ఆహారం తినకుండా ఉంటారు. బ్లాక్ కాఫీలో విటమిన్ బి2, బి3, బి5, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పానీయాన్ని క్రమం తప్పకుండా తాగితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
బరువు తగ్గడానికి ఏది మంచిది?
ఈ రెండు పానీయాలు వేర్వేరు విధాలుగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. కానీ వాటి ప్రయోజనాలను పోల్చి చూస్తే, బ్లాక్ కాఫీ కంటే గ్రీన్ టీ మంచిది. ఎందుకంటే గ్రీన్ టీ ఆకులలో యాంటీఆక్సిడెంట్లు , పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కానీ మీరు ఈ రెండింటిలో దేనినైనా ఎంచుకున్నా, ఎక్కువగా తాగకండి. ఎందుకంటే, ఏదైనా ఎక్కువగా తీసుకుంటే అది ఆరోగ్యానికి బదులుగా అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది.
ఏం టైంలో తాగడం బెటర్
గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ రెండింటిలోనూ కెఫీన్ ఉంటుంది. కాబట్టి రోజుకు 2 కప్పుల కంటే ఎక్కువ తాగకూడదు. లేదంటే.. నిద్రలేమి సమస్య వస్తుంది. ఇది కాకుండా.. గుండె కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. బరువు తగ్గడంలో కూడా ఇబ్బంది కలుగుతుంది. బరువు తగ్గడానికి ఈ రెండు పానీయాలు మాత్రమే సరిపోవు, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, మంచి నిద్ర కూడా ముఖ్యం.