Weight Loss: బరువు తగ్గడానికి ఏ జ్యూసులు తాగితే మంచిది?
Weight Loss: అధిక బరువును తగ్గించుకొని ఫిట్‌గా మారడానికి ఒక్కొక్కరూ ఒక్కో ప్రయత్నం చేస్తుంటారు. బరువు తగ్గడానికి వ్యాయామం, ఫుడ్ డైట్ తో పాటూ చాలా టిప్స్ కూడా పాటిస్తారు. అయితే కొన్ని జ్యూస్ లు తాగితే బరువు ఈజీగా తగ్గవచ్చు. అవేంటంటే..

బరువు తగ్గించే జ్యూస్ లు
పాలకూర, దోస జ్యూస్
పాలకూరలో ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి, అలాగే దోసకాయలో నీరు, ఇతర పోషకాలు ఉంటాయి. ఈ రెండింటితో చేసిన జ్యూస్ ఆరోగ్యానికి మంచిది.
కావలసినవి: 1 కప్పు పాలకూర, 1 కప్పు దోసకాయ, ½ టీ స్పూన్ నిమ్మరసం, 1 కప్పు నీరు
తయారీ: పైన చెప్పిన అన్ని పదార్థాలను బాగా బ్లెండ్ చేయండి. ఆ తరువాత వడకట్టి సర్వ్ చేసుకుంటే చాలు.
కాలే గ్రీన్ యాపిల్ జ్యూస్
ఆకుపచ్చ ఆపిల్ జ్యూస్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి, ఈ ఆపిల్‌లో సహజ తీపి, పెక్టిన్ ఉంటాయి. ఇవి సులభంగా జీర్ణమవుతాయి. ఇది గట్ ఆరోగ్యాన్ని బాగు చేసి, జీవక్రియను మెరుగుపరుస్తుంది. కాలే పోషకాలతో నిండి ఉంటుంది. ఇది జ్యూస్ గట్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది.
కావలసినవి: 1 కప్పు కాలే ఆకులు, 1 కప్పు ఆకుపచ్చ ఆపిల్, ½ అంగుళం అల్లం (తురిమిన), ½ టీ స్పూన్ నిమ్మరసం
తయారీ: వీటన్నింటిని బ్లెడ్ చేసి, వడకట్టి తాజాగా త్రాగండి.
సెలెరీ, నిమ్మరసం
సెలెరీ జ్యూస్ శరీర వేడిని తగ్గించి, మూత్రపిండాలు, కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. రక్తపోటు, జీర్ణవ్యవస్థకు మేలు చేసి, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. నిమ్మలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. నిమ్మ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఈ జ్యూస్‌ను డిటాక్సిఫైయర్‌గా మారుస్తుంది.
కావలసినవి: 3 సెలెరీ కాడలు, ½ టీ స్పూప్ నిమ్మరసం, ½ కప్పు నీరు
తయారీ విధానం: పై చెప్పిన పదార్థాలను మెత్తగా బ్లెండ్ చేయండి. ఆ తరువాత వడకట్టి, తాగండి.
దోసకాయ పుదీనా జ్యూస్
దోసకాయ పుదీనా జ్యూస్ అద్భుతమైన పానీయం. దోసకాయలోని నీటి శాతం ఎక్కువ కావడంతో శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. పుదీనా జీర్ణక్రియ, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
కావలసినవి: 1 దోసకాయ, 10 పుదీనా ఆకులు, ½ టీ స్పూన్ నిమ్మరసం, 1 కప్పు నీరు.
తయారీ: అన్నీ పదార్థాలను సరైన పాళ్లలో వేసి మిక్స్ చేస్తే.. హెల్తీ బ్యూస్ రెడీ.
కాకరకాయ, గ్రీన్ ఆపిల్ జ్యూస్
కాకరకాయ, గ్రీన్ ఆపిల్ జ్యూస్ ఆరోగ్యానికి మంచిది. కాకరకాయ చేదుగా ఉంటే.. గ్రీన్ ఆపిల్ దాని రుచిని సమతుల్యం చేస్తుంది. ఈ జ్యూస్ లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి.
కావలసినవి: 1 కాకరకాయ, 1 ఆకుపచ్చ ఆపిల్, అల్లం ముక్క,
తయారీ: పై పదార్థాలను బాగా మిక్స్ చేయండి. ఆ తరువాత అవసరాన్ని బట్టి వడకట్టి, త్రాగండి.
పాలకూర, పైనాపిల్ జ్యూస్
పాలకూర ఇనుము, ఫైబర్ అందిస్తుంది, పైనాపిల్ జీర్ణ ఎంజైమ్‌లను అందిస్తుంది. కొవ్వు జీర్ణక్రియకు, ఉబ్బరం తగ్గించడానికి సహాయపడుతుంది.
కావలసినవి: 1 కప్పు పాలకూర ఆకులు, ½ కప్పు పైనాపిల్ ముక్కలు, ½ టీ స్పూన్ నిమ్మరసం, ½ కప్పు నీరు.
తయారీ: పై పదార్దాలుబాగా కలిపి తాజాగా త్రాగండి.