MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Health
  • Neem Leaves: రోజూ గుప్పెడు వేపాకులు తింటే శరీరంలో జరిగే 5 మార్పులు ఇవే!

Neem Leaves: రోజూ గుప్పెడు వేపాకులు తింటే శరీరంలో జరిగే 5 మార్పులు ఇవే!

ఆయుర్వేదంలో వేపాకును సర్వరోగ నివారణిగా చెప్తారు. రోజూ గుప్పెడు వేపాకులు తింటే బోలేడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇమ్యూనిటీ నుంచి చర్మ ఆరోగ్యం వరకు వేపాకులు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

2 Min read
Author : Kavitha G
Published : Feb 25 2026, 06:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Neem leaves benefits
Image Credit : our own

Neem leaves benefits

నిపుణుల ప్రకారం ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో గుప్పెడు వేపాకులు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. వేప ఆకులు చేదుగా ఉన్నా, వాటిలో ఉండే ఔషధ గుణాలు శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. వేపలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. రోజూ పరిమిత మోతాదులో వేపాకులు తీసుకుంటే కలిగే ముఖ్యమైన ఐదు లాభాల గురించి ఇక్కడ చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
రోగనిరోధక శక్తి
Image Credit : Getty

రోగనిరోధక శక్తి

వేపలో ఉన్న శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. దీనివల్ల ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధులు, చర్మ సమస్యల ప్రమాదం తగ్గుతుంది. మితంగా వేపాకులను తీసుకోవడం ద్వారా రక్త శుద్ధితో పాటు శరీరంలోని విషపదార్థాలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.

37
షుగర్ నియంత్రణకు..
Image Credit : stockPhoto

షుగర్ నియంత్రణకు..

కొన్ని అధ్యయనాల ప్రకారం వేప ఆకుల్లో గ్లూకోజ్ మెటబాలిజాన్ని ప్రభావితం చేసే సంయోగాలు ఉన్నాయి. షుగర్ స్థాయిలను కంట్రోల్లో ఉంచుకోవాలి అనుకునేవారికి వేపాకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది మందులకు ప్రత్యామ్నాయం కాదనే విషయాన్ని కూడా వారు స్పష్టం చేస్తున్నారు. డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్ సలహాతో మాత్రమే వేపాకు తీసుకోవాలని సూచిస్తున్నారు.

47
జీర్ణక్రియపై ప్రభావం
Image Credit : stockPhoto

జీర్ణక్రియపై ప్రభావం

వేపాకులు చేదుగా ఉండటం వల్ల జీర్ణరసాల ఉత్పత్తి పెరిగి, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తగ్గవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వేపాకులు తినడం వల్ల కొందరికి ఆకలి నియంత్రణలో ఉంటుందని, తద్వారా బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

57
చర్మ ఆరోగ్యానికి
Image Credit : pexels

చర్మ ఆరోగ్యానికి

వేపకులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు.. మొటిమలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, దద్దుర్లు వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. శరీరాన్ని లోపల నుంచి శుభ్రపరచడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే చాలా రకాల స్కిన్‌కేర్ ఉత్పత్తుల్లో వేపను ఉపయోగిస్తుంటారని వివరిస్తున్నారు.

67
నోటి ఆరోగ్యానికి..
Image Credit : Getty

నోటి ఆరోగ్యానికి..

నిపుణుల ప్రకారం వేపాకులు నోటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వేపలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు దంతాలపై బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గించడంలో సహాయపడతాయి. రోజూ కొన్ని వేపాకులు నమలడం వల్ల నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. చిగుళ్లు బలంగా మారుతాయి. 

77
మోతాదు ముఖ్యం
Image Credit : Getty

మోతాదు ముఖ్యం

నిపుణుల ప్రకారం వేపను అధిక మోతాదులో తీసుకోవడం మంచిది కాదు. కొంతమందికి వేపాకులు ఎక్కువగా తినడం వల్ల కడుపు మంట, వాంతులు, లేదా ఇతర అసౌకర్యాలకు దారితీయవచ్చు. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, చిన్నపిల్లలు లేదా ఇప్పటికే కాలేయ సమస్యలు ఉన్నవారు వేపను తీసుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవాలి. 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Recommended image2
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image3
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Related Stories
Recommended image1
Dates Benefits: రోజుకు రెండు ఖర్జూరాలు తింటే కలిగే 7 లాభాలు ఇవే!
Recommended image2
Weight Loss Drinks: ఉదయాన్నే ఈ డ్రింక్స్ తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved