Beauty Tips : పెసర పిండితో ఇలా చేస్తే.. నిగనిగలాడే అందం మీ సొంతం..
Green Gram Flour Benefits : మెరిసే చర్మంతో అందంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. ఈ క్రమంలో చాలా మంది ఎన్నో రకాల ఖరీదైన సోపులు, క్రీములు ఫేస్ వాష్‌లు వాడుతుంటారు. కానీ, అందులో రసాయనాలు చర్మానికి హాని చేస్తాయి. సహాజ అందం కోసం పెసరపిండిని ఇలా వాడండి.

పెసరపిండితో అదిరిపోయే అందం
అమ్మమ్మల కాలం నుంచే పెసరపిండిని సౌందర్య సాధనంగా వాడుతున్నారు. ఈ పిండిలో ఉండే సహజ శుద్ధి లక్షణాలు చర్మాన్ని లోతుగా శుభ్రపరిచి, మృదుత్వాన్ని, కాంతిని అందిస్తాయి. కృత్రిమ రసాయనాలతో కూడిన సబ్బులకు బదులుగా పెసర పిండి చర్మ సౌందర్యానికి ఎంతో ఉపయోగకరం. ఇది చర్మానికి మృదుత్వం ఇచ్చి, సహజంగా, కాంతివంతంగా మార్చుతుంది.
ప్రయోజనాలు
పెసరపిండి లో చర్మానికి మేలు చేసే ఎన్నో లక్షణాలున్నాయి. ఇది చర్మంలోని మురికి, నూనెను తొలగించి, రంధ్రాలను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. మెల్లగా రుద్దినప్పుడు, చర్మంపై ఉన్న చనిపోయిన కణాలను తొలగించి, కొత్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. దీని వలన చర్మం మెరుపుగా, తాజాగా కనిపిస్తుంది. ముఖ్యంగా నూనె చర్మం ఉన్నవారికి పెసరపిండి వరం లాంటిది. ఇది అదనపు నూనెను పీల్చుకుని, మొటిమలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యల నుండి రక్షిస్తుంది. క్రమం తప్పకుండా పెసరపిండి వాడడం ద్వారా చర్మపు రంగు కూాడా మెరుగవుతుంది.
ఆరోగ్యానికి మంచిదేనా?
కొంతమంది పెసరపిండి వాడటం వల్ల చర్మం పొడిబారుతుందని లేదా దురద కలుగుతుందని అనుమానిస్తారు. కానీ, సరిగ్గా ఉపయోగిస్తే.. ఇది చర్మానికి ఎలాంటి హానికర ప్రభావం కలిగించదు. పెసరపిండి చర్మాన్ని శుభ్రపరచే, ఆరోగ్యంగా ఉంచే సహజ పదార్థం. చాలా అరుదుగా కొంతమందికి అలెర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మొదటిసారి వాడే వారు, ముందు చేతిపై కొద్దిగా పెసరపిండి రాసి పరీక్షించుకుంటే మంచిది.
ఎలా ఉపయోగించాలి?
1. రోజూ స్నానం పొడిగా: పెసరపిండి, శనగపిండి, కస్తూరి పసుపు, చందనం వంటివి సమపాళ్లలో కలిపి, సబ్బుకు బదులుగా స్నాన సమయంలో శరీరానికి రుద్ది వాడవచ్చు. ఈ మిశ్రమం చర్మాన్ని మృదువుగా, సువాసనగా ఉంచుతుంది. ఇది రసాయన రహితమైన, సహజ శుభ్రతకు సరైన మార్గం.
2. ముఖానికి ప్యాక్: ఒక చెంచా పెసరపిండికి అవసరమైనంత నీరు లేదా గులాబీ నీరు కలిపి గట్టి పేస్ట్ తయారు చేసి ముఖానికి రాయాలి. ఇది 15–20 నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగితే ముఖం శుభ్రంగా, ప్రకాశవంతంగా మారుతుంది. వారానికి 2–3 సార్లు వాడటం ఉత్తమం.
3. పాలు లేదా పెరుగుతో: పొడి చర్మం ఉన్నవారు పెసరపిండి లో పాలు లేదా పెరుగు కలిపి ముఖానికి లేదా శరీరానికి రుద్దాలి. ఇది చర్మానికి తేమను అందించి, పొడితనాన్ని తగ్గిస్తుంది. చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా మార్చుతుంది.
పెసర పిండి మంచిదేనా?
పెసరపిండి అన్ని రకాల చర్మాల వారికీ అనుకూలంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఆయిల్ స్కీన్ ఉన్నవారికి, మొటిమల సమస్యలతో బాధపడేవారికి, నిస్తేజంగా కనిపించే చర్మం ఉన్నవారికి ఇది ఎంతో ప్రయోజనకరం. పెసరపిండి చర్మాన్ని లోతుగా శుభ్రపరచి, రంధ్రాలను మూసివేస్తుంది. దీనివల్ల చర్మం మృదువుగా, కాంతివంతంగా మారటమే కాదు, మొటిమలను నిరోధిస్తుంది. సహజమైన ఈ పదార్థం ద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
గమనించాల్సిన అంశాలు
పెసరపిండి వాడిన తర్వాత చర్మాన్ని మెల్లగా తుడవడం ముఖ్యం. బలంగా రుద్ది తుడవడం వల్ల చర్మానికి నెగటివ్ ప్రభావాలు కలగవచ్చు.
ఎక్కువగా వాడడం వల్ల చర్మం పొడిబారే ప్రమాదం ఉంది. ఎప్పుడూ శుభ్రమైన, నాణ్యమైన పెసరపిండి వాడాలి.
మార్కెట్లో దొరికే రసాయనాలతో కలసిన ఉత్పత్తులకు బదులుగా, ఇంట్లోనే నూరిన పెసరపిండి వాడడం ఉత్తమమైన ఎంపిక.
వైద్యుల సూచనల ప్రకారం, పెసరపిండి చర్మానికి ఎంతో మేలు చేస్తుందని అంగీకరించారు.
సహజంగా చర్మాన్ని శుభ్రపరిచే, సంరక్షించే ఓ అద్భుతమైన పదార్థం. అందుకే, దీన్ని మీ అందం సంరక్షణ రోజువారీ జాబితాలో తప్పకుండా చేర్చుకోవచ్చు.