Diabetes: ఖాళీ కడుపుతో ఈ డ్రింక్స్ తాగితే.. షుగర్ ఇట్టే కంట్రోల్ అవుతుందట..
Diabetes: షుగర్ వచ్చిదంటే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో శ్రద్ధ వహించాలి. డయాబెటిస్ ఉన్నవారు పరగడుపున కొన్ని రకాల పానీయాలు తాగితే.. రక్తంలో చక్కెర స్థాయిని సహజంగా తగ్గుతాయంట. ఇంతకీ ఆ డ్రింక్స్ ఏంటో తెలుసుకుందాం..

షుగర్ తగ్గించే అద్భుత పానీయాలు
జీవనశైలీలో చిన్న చిన్న మార్పులు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఉదాహరణకు, కొంతమంది డయాబెటిస్ రోగులు మందులు వాడుతున్నప్పటికీ, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలోకి తీసుకురాలే పరిస్థితి ఉంటుంది. అలాంటి సమయంలో పరిగడుపున కొన్ని సహజ పానీయాలు తాగడం ద్వారా షుగర్ లెవెల్ నియంత్రణలోకి రావచ్చు. ఇక్కడ సూచించిన పానీయాల్లో ఏదైనా ఒకదాన్ని రోజూ తీసుకోవచ్చు. వాటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
మెంతుల నీరు
మెంతుల నీరు శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. రాత్రి మెంతులను నానబెట్టి, ఉదయం పరగడుపున తాగితే మలబద్దకానికి ఉపశమనం, రక్తంలో చక్కెర శోషణ తగ్గింపు, ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుదల వంటి ప్రయోజనాలు కలుగుతాయి. ఇది చర్మం, జుట్టు ఆరోగ్యం, వాపుల తగ్గింపు, ఋతుక్రమ సమస్యల నివారణకు సహాయపడుతుంది. సహజమైన ఈ పద్ధతి రోజువారీ జీవనశైలిలో భాగం చేసుకుంటే.. ఆరోగ్యంగా మెరుగుపడుతుంది.
దాల్చిన చెక్క నీరు
దాల్చిన చెక్క జీర్ణక్రియను మెరుగుపరచడంలో, రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలోని ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది, ప్రత్యేకంగా డయాబెటిస్ రోగులకు ఉపయోగకరం. అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని లేదా చిన్న ముక్కను ఒక కప్పు వేడి నీటిలో మరిగించి, చల్లారిన తర్వాత ఉదయం లేదా భోజనం తర్వాత తాగితే మెరుగైన ఫలితాలు లభిస్తాయి.
కాకరకాయ జ్యూస్
కాకరకాయ జ్యూస్.. రుచికి చేదుగా ఉన్నప్పటికీ, డయాబెటిస్ నియంత్రణకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే సమ్మేళనాలు శరీరంలో సహజ ఇన్సులిన్ లాగా పనిచేస్తూ, కణాల్లో గ్లూకోజ్ శోషణను మెరుగుపరుస్తాయి. ఇందుకోసం.. కాకరకాయను ముక్కలుగా కోసి, నీటిలో నానబెట్టి, దానికి నిమ్మరసం లేదా దోసకాయ కలిపి ఉదయం భోజనానికి ముందు తాగితే మంచి ఫలితాలు కలుగుతాయి. వారంలో 1–2 సార్లు తాగడం ఆరోగ్యానికి మేలు.
ఉసిరికాయ నీరు
విటమిన్ సి అధికంగా ఉన్న ఉసిరికాయ ప్రతి రోజు తాగడం వల్ల క్లోమం పనితీరు మెరుగుపరుచుతుంది. ఇది జీర్ణక్రియకు, చక్కెర నియంత్రణకు ఉపయోగపడుతుంది. భోజనానికి తర్వాత తాగితే.. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇందుకోసం.. ఉసిరికాయను దంచి ఒక గ్లాసు నీటిలో వేయాలి. అవసరమైతే ఉప్పు కలుపుకోవాలి. ఈ జ్యూస్ ను ఉదయం లేదా మధ్యాహ్నం తాగవచ్చు. ఇది శరీరానికి శక్తిని, చర్మానికి ఆరోగ్యాన్ని అందిస్తుంది.
గమనిక: ఈ పానీయాలు తాగినప్పుడు షుగర్ మాత్రను ఆపకూడదు. అది వైద్యుని సలహా మేరకు చేయాలి.