Constipation: మలబద్ధకం బాగా వేధిస్తోందా? రోజూ ఈ 3 అలవాట్లు పాటిస్తే మాయం
Constipation: ఇప్పుడు మలబద్ధకం సమస్య చాలా మందికి కామన్ అయిపోయింది. కానీ దాన్ని లైట్ తీసుకుంటే మాత్రం ఫైల్స్ వచ్చే ప్రమాదం ఉంది. చిన్న సమస్యే అనుకున్నా…సర్వరోగాలకు కారణమిదే. దానికి సింపుల్ సొల్యూషన్ ఇదే.

మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నారా?
మలబద్ధకం అని సింపుల్ గా తీసుకోకండి. అది శరీరంలో సర్వ రోగాలకు కారణం. కడుపు ఉబ్బరం, ఆకలి వేయకపోవడం, చికాకు, శరీరమంతా మెలిపట్టేసినట్లు ఉంటుంది. ఇంట్లో పనులపై శ్రద్ధ పెట్టలేరు, ఆఫీసులో వర్క్ చేయడానికి అసౌకర్యంగా ఉంటుంది. పదే పదే వాష్ రూంకు వెళ్లాల్సి ఉంటుంది. అందుకే పీచు పదార్థాలు ఎక్కువగా తినాలి. అది శరీరంలో వ్యర్థాలను బయటకు పంపించడానికి చాలా సహాయపడుతుంది.
మలవిసర్జన సరిగ్గా జరగకపోతే మలబద్ధకం వస్తుంది
మలవిసర్జన సరిగ్గా జరగనప్పుడు లేదా కష్టంగా ఉన్నప్పుడు మలబద్ధకం సమస్య వస్తుంది. సాధారణంగా, వారానికి మూడుసార్ల కంటే తక్కువ విరేచనాలు అయితే దానిని మలబద్ధకంగా పరిగణిస్తారు. కడుపంతా పట్టేసినట్లు ఉంటుంది.
వ్యక్తిని బట్టి మారుతూ ఉంటాయి.
సాధారణంగా మలవిసర్జన అలవాట్లు వ్యక్తిని బట్టి మారుతూ ఉంటాయి. అందరికీ ఒకేలా ఉండదు. కొందరికి రోజుకు ఎక్కువసార్లు విరేచనం అవుతుంది. మరికొందరికి వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే అవుతుంది. అదుపు చేయకపోతే…దీర్ఘకాల సమస్యలకు తెచ్చుకున్నవారవుతారు.
లక్షణాలు.
మలం గట్టిగా, పొడిగా రావడం, విరేచనం సమయంలో బాగా ముక్కాల్సి రావడం, నొప్పిగా ఉండటం వంటివి మలబద్ధకం సాధారణ లక్షణాలు. గట్టిగా రావడం వల్ల చర్మం చీలిపోయి రక్తం వచ్చే ప్రమాదం ఉంది. దానివల్ల విపరీతమైన నొప్పి ఉంటుంది. కూర్చోలేరు, నిల్చోలేరు.
మలబద్ధకానికి కారణాలు అనేకం.
జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి
ఆహారం, జీవనశైలిలో మార్పులు చేసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. మనం తినే ఫుడ్ జీర్ణవ్యవస్థపై చాలా ప్రభావం చూపుతుంది. అందుకే సరైన ఆహారం ఎంచుకోవడం ముఖ్యం. మలబద్ధకాన్ని తగ్గించే, పెంచే ఆహారాల గురించి తెలుసుకోవాలి.
ఉపశమనం కలిగించే ఆహారాలు
కివి, అవిసె గింజలు, చిలగడదుంప, ప్లమ్స్, పాలకూర, కాఫీ, ఓట్స్, పియర్ పండు, చియా సీడ్స్ వంటివి మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తాయి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మలాన్ని మృదువుగా చేసి, విరేచనం సాఫీగా అయ్యేలా చేస్తుంది. అంతేకాకుండా బెండకాయ, అరటికంద, చిక్కుళ్లు ఎక్కువగా తినాలి. దాంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
మలబద్ధకం సమస్యను మరింత పెంచే ఆహారాలు.
చీజ్, చాక్లెట్, నూనెలో వేయించిన పదార్థాలు, ఆల్కహాల్, వైట్ బ్రెడ్, ఫాస్ట్ ఫుడ్ వంటివి మలబద్ధకం సమస్యను మరింత పెంచుతాయి. వీటిలో ఫైబర్ తక్కువగా, కొవ్వు ఎక్కువగా ఉండటంతో జీర్ణం కావడం కష్టం.

