Chicken Khorma: ఈ సండే మరింత స్పెషల్.. క్రీమీ గ్రేవీతో అదిరిపోయే చికెన్ ఖోర్మా
Chicken Khorma: ఈ సండే కాస్త స్పెషల్‍గా ఉండాలా? అయితే ఈ హైదరాబాద్ ముస్లిం పెళ్లిళ్లలో చేసే చికెన్ ఖోర్మా...ట్రై చేసి చూడండి. మీ స్పెషల్ డేస్ ను మరింత మెమొరబుల్‍గా మార్చుకోవాలంటే... కచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే.

ఫ్లేవర్ ఫుల్ చికెన్ ఖోర్మా
ఈ ఫ్లేవర్ ఫుల్ చికెన్ ఖోర్మా ఎప్పుడైనా తిన్నారా? క్రీమీ గ్రేవితో, స్పైసీగా, ఎప్పటిమర్చిపోలేని డిఫరెంట్ ఈ చికెన్ రెసిపీ తింటే....మళ్లీ మళ్లీ కావాలంటారు. గ్యారెంటీ.
కావలసిన పదార్థాలు
ప్యాకెట్ పొట్లి మసాలా, వాటర్, 3 టేబుల్ స్పూన్ వేరుశెనగలు, 2 టేబుల్ స్పూన్ బాదం, 15 జీడిపప్పు, టేబుల్ స్పూన్ చిరోంజి, టేబుల్ స్పూన్ గసగసాలు, 4 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, కప్పు ఉల్లిపాయలు, 4 యాలకులు, లవంగాలు, 2 ముక్కల దాల్చినచెక్క, ఆఫ్ స్పూన్ షాహీజీరా, కొంచెం అల్లం, వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, అరకేజీ చికెన్, గరం మసాలా, రోజ్ వాటర్, కొత్తిమీర, పుదీనా,
తయారీ విధానం
ఒక గిన్నెలో ప్యాకెట్ పొట్లి మసాలా వేసుకోవాలి. ఇందులో 25 నుంచి 30 రకాల మసాలాలు ఉంటాయి. అర లీటరు నీళ్లు పోసి, అందులో కాస్త కొత్తిమీర కూడా వేసుకుని దగ్గర పడనివ్వాలి. 350 మిల్లీ లీటర్లకు రావాలి. అప్పుడు పక్కన పెట్టుకోవాలి.
మసాలా పేస్ట్
మరో ప్యాన్ లో 3 టేబుల్ స్పూన్ వేరుశెనగలు, 2 టేబుల్ స్పూన్ బాదం, 15 జీడిపప్పు, టేబుల్ స్పూన్ చిరోంజి, టేబుల్ స్పూన్ గసగసాలు, 4 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసి రంగు మారాక సన్నని సెగ వేయించాలి. ఆ తర్వాత దాన్ని ఒక మిక్సీలో వేసి కాస్త నీరు పోసి బరకగ బ్లెండ్ చేసుకోవాలి.
రెసిపీ
మళ్లీ మరో పాన్ లో 3-4టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో సన్నగా కట్ చేసిన ఉల్లి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసిన పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నూనెలో 4 యాలకులు, లవంగాలు, 2 ముక్కల దాల్చినచెక్క, ఆఫ్ స్పూన్ షాహీజీరా, కొంచెం అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. అందులోనే పసుపు, కారం, ఉప్పు వేసి కలిపి అందులో పప్పుల పేస్ట్ వేసుకోవాలి. అడుగు మాడకుండా మసాలా వేగనివ్వాలి, అందులో అరకప్పు నీళ్లు వేసి మూతపెట్టాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.
15-20 నిమిషాలు ఉడికించాలి
నూనె తేలాక అందులో అరకిలో చికెన్ వేసుకుని బాగా కలుపుకోవాలి. 10-15 నిమిషాలు..మసాలాలో చికెన్ ఉడికాక..అందులో పక్కన పెట్టుకున్న మసాలా వాటర్ వడ కట్టి పోసుకోవాలి. మూతపెట్టి 15-20 నిమిషాలు ఉడికించాలి.
స్పెషల్ చికెన్ ఖోర్మా రెడీ
నూనె పైకి తేలాక అప్పుడు ఫ్రైడ్ ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం, 4 పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఉడికినివ్వాలి. ఈ చికెన్ ఖోర్మాలో నూనె పడుతుంది.జీరా రైస్, బగారా, రోటీస్, నాన్, అన్నంతో కూడా ఈ చికెన్ ఖోర్మా బెస్ట్ కాంబినేషన్. ఇంకెందుకు ఆలస్యం..ఈ ఆదివారం మీ ఇంట్లో చేసి స్పెషల్ చేసుకోండి.

