- Home
- Telangana
- Hyderabad: రాసిపెట్టుకోండి.. 10 ఏళ్లలో ఈ గ్రామం మరో జూబ్లీహిల్స్ కానుంది.. ఇప్పుడు కొంటే లాభాల పంట ఖాయం
Hyderabad: రాసిపెట్టుకోండి.. 10 ఏళ్లలో ఈ గ్రామం మరో జూబ్లీహిల్స్ కానుంది.. ఇప్పుడు కొంటే లాభాల పంట ఖాయం
హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తోంది. విద్య, ఉద్యోగ, వ్యాపార అవసరాల కోసం నగరానికి వేలాది మంది వస్తున్నారు. ఈ క్రమంలోనే నగర విస్తీర్ణం వేగంగా పెరుగుతోంది. రానున్న రోజుల్లో అభివృద్ధి చెందనున్న ఓ ప్రాంతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అభివృద్ధికి కేరాఫ్‌గా మోకిల
రంగారెడ్డి జిల్లాలో శంకర్‌పల్లి మండలానికి చెందిన మోకిల గ్రామం, ఇప్పుడు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. హైటెక్ సిటీ, గచ్చిబౌలీ వంటి టెక్ హబ్‌లకు దగ్గరగా ఉండడం వల్ల మోకిలకు రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పట్ల డిమాండ్ పెరిగింది. శంకర్‌పల్లి రోడ్, నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ద్వారా ఇది హైదరాబాద్‌తో బాగా కనెక్ట్ అయ్యే ప్రాంతంగా మారింది.
రింగ్‌రోడ్డు కలిసొచ్చే అంశం
మోకిలకు సమీపంలో ఉన్న హైదరాబాద్ విశ్వవిద్యాలయం, ఐస్ఫాయ్ వంటి ప్రఖ్యాత విద్యాసంస్థలు, విద్యార్థులకు మంచి అవకాశాలు కల్పిస్తున్నాయి. అలాగే నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. భవిష్యత్తులో రీజనల్ రింగ్ రోడ్ ద్వారా ఈ ప్రాంతం ఇంకా వేగంగా అభివృద్ధి చెందనుంది. ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రిండ్ రోడ్ మధ్యలో ఉండడంతో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున రియల్ బూమ్ పెరగనుంది.
వాణిజ్య కేంద్రాలు, ఐటీ కంపెనీలు
గచ్చిబౌలీ, కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ఐటీ హబ్‌లకు సమీపంగా ఉండటం వల్ల మోకిల చుట్టూ అనేక కంపెనీలు ఏర్పడ్డాయి. డిఎల్ఎఫ్ ఐటీ పార్క్, ఫీనిక్స్ ట్రివియం, యూనిస్పేస్, వీఈఎం టెక్నాలజీస్ వంటి సంస్థలు దగ్గరలో ఉన్నాయి. బ్రిడ్జ్ క్యూబ్స్, నిచ్ బ్రెయిన్స్ వంటి ఐటీ కంపెనీలు మోకిలలోనే ఉన్నాయి.
విద్య, వైద్యం, ట్రాన్స్‌పోర్ట్
మోకిలలో బిర్లా ఓపెన్ మైండ్స్, ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్, శ్రీ ఆర్యభట్ట స్కూల్ లాంటి స్కూల్స్ ఉన్నాయి. వసవి కాలేజ్, చైతన్య జూనియర్ కాలేజ్, న్యూ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి కాలేజీలు కూడా ఉన్నాయి. వైద్యంలోనూ సేహా పాలిక్లినిక్, హోలిస్టిక్ హీలింగ్ సెంటర్, స్వరాజ్ హాస్పిటల్, యశోదా డెంటల్ క్లినిక్ వంటి హాస్పిటల్స్ ఉన్నాయి.
ప్లాట్ల ధరలు వేగంగా పెరుగుతున్నాయి
2021లో మోకిలలో ఓపెన్ ప్లాట్ల ధరలు సగటున రూ.24,584గా ఉండగా, 2022లో ఇది రూ.34,021కి, 2023లో రూ.37,945కి పెరిగాయి. అంటే ప్లాట్ల విలువ సంవత్సరానికొకసారి గణనీయంగా పెరుగుతోంది. తాజాగా HMDA 300 ప్లాట్లను మోకిల ఫేజ్-2లో వేలానికి ప్రకటించింది. 300 నుండి 500 గజాల మధ్య ఉన్న ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి.
మరో జూబ్లిహిల్స్
ఒకప్పుడు హైదరాబాద్ నగరం సికింద్రాబాద్, అబిడ్స్ కేంద్రంగా ఉండేది. ఆ సమయంలో సినీ, రాజకీయ నాయకులు నగరానికి శివారు అన్న ఉద్దేశంలో జూబ్లిహిల్స్, బంజారాహిల్స్‌లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం వీరి చూపు మోకిల వైపు మళ్లుతోంది.
ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలనో, ప్రశాంత వాతావరణంలో ఉండాలన్న కారణంతోనో చాలా మంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు మోకిలాలో విల్లాలను నిర్మించుకుంటున్నారు. దీంతో వచ్చే 10 ఏళ్లలో మోకిల మరో జూబ్లిహిల్స్ కావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో భూమిపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి మోకిల ప్రస్తుతం హాట్‌స్పాట్‌గా మారిందని అభిప్రాయపడుతున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. కష్టపడి సంపాదించిన డబ్బును ఇన్వెస్ట్ చేసే ముందు చాలా ఆలోచించాలి. ఈ రంగంలో నిపుణులైన వారి నుంచి నేరుగా సలహాలు తీసుకోవడం మరీ మంచిది.