Diabetes: రోజూ అరగంట ఇలా చేస్తే చాలు.. షుగర్‌కి చెక్ పెట్టొచ్చు..
Diabetes: ఇటీవల దేశవ్యాప్తంగా డయాబెటిస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా చాలామంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. డయాబెటిస్ వచ్చిన వారి రక్తంలో షుగర్ లెవల్స్ హెచ్చుతగ్గులకు గురవుతాయి. డయాబెటిస్ ఒక దీర్ఘకాలిక వ్యాధి. అయితే చిన్న చిన్న ఆహారపు అలవాట్లు పాటిస్తే.. వ్యాధి సోకే ముప్పు తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. వాకింగ్ చేసేటప్పుడు ఈ చిట్కాలు ఫాలో అయితే డయాబెటిస్ రిస్క్ నుంచి బయటపడవచ్చంట.

షుగర్‌కి చెక్ పెట్టొచ్చు
టైప్ 2 డయాబెటిస్ ఇన్సులిన్ సెన్సిటివిటీ అసమతుల్యత వల్ల వస్తుంది. ఈ వ్యాధికి ప్రధాన కారణం మన జీవనశైలి. తగినంత శారీరక శ్రమ లేకపోవడం, అంతర్గత అవయవాలు, ఉదరం చుట్టూ పేరుకుపోయే కొవ్వు ఇన్సులిన్ పనితీరును ప్రభావితం చేస్తాయి. దీనివల్ల టైప్ 2 డయాబెటిస్ వస్తుంది. దీనికి జీవనశైలిలో చిన్న మార్పులు చేసుకోవాలి. ప్రతిరోజూ నడవాలి.
నడక
వేగంగా నడిచేవారికి డయాబెటిస్ వచ్చే అవకాశాలు తక్కువ అని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల జరిపిన ఒక సమీక్షలో గంటకు 4 కి.మీ. వేగంతో నడిచేవారికి డయాబెటిస్ వచ్చే అవకాశం తక్కువగా ఉందని తేలింది.
వేగవంతమైన నడక
మీరు ప్రతిరోజూ వేగంగా నడిస్తే మీ రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. శరీరంలో కొవ్వు శాతం తగ్గుతుంది. జీవక్రియ పెరిగి బరువు తగ్గుతారు. ఇన్సులిన్ సెన్సిటివిటీ, కండరాలలో గ్లూకోజ్ శోషణ మెరుగుపడతాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. రోజుకు 30 నిమిషాలు వేగంగా నడవాలని సూచిస్తున్నారు.
ఎంతసేపు నడవాలి?
పూర్తి ప్రయోజనాలు పొందడానికి 20 నుండి 30 నిమిషాలు నడవడం అలవాటు చేసుకోండి. మీరు నడుస్తున్నప్పుడు క్రమంగా మీ వేగం పెంచుకోవాలి. దీనివల్ల శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యం, కండరాల బలం, కొవ్వు తగ్గడం వంటివి నడక వల్ల కలిగే అదనపు ప్రయోజనాలు చేకూరుతాయి. డయాబెటిస్ ఉన్నవారు తిన్న వెంటనే 10 నిమిషాలు నడవవచ్చు.