Skin Care: బీట్‌రూట్‌తో నిగనిగలాడే అందం మీ సొంతం.. ఎలా వాడాలో తెలుసా?
Beetroot benefits: బీట్ రూట్ శరీర ఆరోగ్యానికే కాక, ముఖ సౌందర్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మాన్ని శుభ్రంగా ఉంచుతాయి. బీట్‌రూట్‌ను ఇలా సహజ పద్ధతుల్లో క్రమం తప్పకుండా వాడితే.. మెరిసే ముఖాన్ని పొందవచ్చు.

బీట్‌రూట్ తో ప్రకాశించే చర్మం
బీట్‌రూట్‌లో విటమిన్ C ఉంటుంది, ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరచి చర్మాన్ని యవ్వనంగా, దృఢంగా మార్చుతుంది. ఇందులో ఉండే బీటాలైన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు చర్మంలోని విషాలను బయటకు పంపి, వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఇది మొటిమలు, మచ్చలను తగ్గించడంలో సహాయకారిగా ఉంటుంది. అలాగే, బీట్‌రూట్‌లో అధిక నీటి శాతం ఉండటంతో, ఇది చర్మాన్ని తేమతో నిండి, హైడ్రేటెడ్‌గా మార్చుతుంది. శరీరానికి శక్తిని, చర్మానికి సహజకాంతిని అందించే అద్భుతమైన సౌందర్య మూలికగానూ పనిచేస్తుంది.
బీట్ రూట్, తేనె ఫేస్ ప్యాక్:
బీట్‌రూట్, తేనె ఫేస్ ప్యాక్ చర్మానికితక్షణ నిగారింపు ఇవ్వడమే కాకుండా మృదువుగా మార్చుతుంది.
తయారీ విధానం:
- ఒక చిన్న బీట్‌రూట్‌ను తీసుకుని, అందులో నుంచి రసాన్ని తీసుకోవాలి.
- ఆ రసంలో 1 టీస్పూన్ తేనె కలిపి పేస్ట్ తయారు చేయాలి.
- ముఖాన్ని శుభ్రపరిచిన తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై అప్లై చేయాలి.
- 15–20 నిమిషాల పాటు ఆరనిచ్చి, చల్లటి నీటితో కడగాలి. వారానికి 2–3 సార్లు వాడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
ప్రయోజనాలు
- తేనె ఒక సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. అలాగే మొటిమల్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
- బీట్‌రూట్‌లోని సహజ వర్ణద్రవ్యం చర్మానికి తక్షణ గులాబీ రంగు ఇచ్చి, ఫ్రెష్‌గా, ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది.
బీట్ రూట్, పెరుగు ఫేస్ ప్యాక్:
బీట్ రూట్, పెరుగు ఫేస్ ప్యాక్ చర్మానికి తక్షణ కాంతి ఇవ్వడమే కాకుండా, చర్మాన్ని మృదువుగా, తాజాగా మార్చుతుంది.
తయారీ విధానం:
- ఒక చిన్న బీట్‌రూట్‌ను తొక్క తీసి, మిక్సీలో నీరు లేకుండా పేస్ట్‌లా చేయాలి. అందులో 1 టీస్పూన్ పెరుగు కలిపి బాగా మిశ్రమం చేయాలి.
- ఈ పేస్ట్‌ను ముఖం, మెడపై సమానంగా అప్లై చేసి, 20–25 నిమిషాల పాటు ఆరనివ్వాలి.
- ఆ తర్వాత గోరువెచ్చని నీటితో మెల్లగా రుద్ది కడగాలి. వారానికి రెండు సార్లు వాడితే చర్మం నిగారింపుగా కనిపిస్తుంది.
ప్రయోజనాలు:
- పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చర్మంపై ఉండే చనిపోయిన కణాలను తొలగించి, కొత్త కణాల ఏర్పాటుకు దోహదం చేస్తుంది.
- బీట్‌రూట్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని రక్షించి, వాపులు, నష్టాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఈ ప్యాక్ చర్మాన్ని తేమతో నింపి, సహజ గ్లోను ఇస్తుంది.
బీట్ రూట్, నారింజ ఫేస్ ప్యాక్:
చర్మాన్ని శుభ్రపరచడం, మొటిమలను తగ్గించడం, చర్మం ప్రకాశవంతంగా మెరువడానికి ఇది ఒక అద్భుతమైన ప్యాక్. ఇది ఒక ఎక్స్‌ఫోలియేటర్‌గా కూడా పనిచేస్తుంది.
తయారీ విధానం:
- ఒక టీస్పూన్ నారింజ తొక్క పొడిని బీట్‌రూట్ రసంలో కలిపి గట్టి పేస్ట్ చేయాలి.
- ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై అప్లై చేసి, మెల్లగా వృత్తాకారంలో 2–3 నిమిషాలు మసాజ్ చేయాలి.
- ఇది చనిపోయిన కణాలను తొలగించి చర్మానికి నూతనోత్సాహాన్ని ఇస్తుంది.
- 15–20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
- ఈ ప్యాక్‌ను వారానికి ఒక్కసారి వాడటం చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ప్రయోజనాలు: నారింజ తొక్కలోని విటమిన్ C చర్మానికి నిగనిగలాడేలా చేస్తుంది. బీట్‌రూట్‌లోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని రక్షించి, తేమను అందిస్తాయి. ఇది ముఖాన్ని ప్రకాశవంతంగా మార్చే అద్భుతమైన సహజ పరిష్కారం.
బీట్ రూట్ లిప్ మాస్క్:
పగిలిన, పొడి బారిన పెదాలను మృదువుగా చేయడానికి, వాటికి సహజమైన గులాబీ రంగును ఇవ్వడానికి బీట్ రూట్ చక్కటి మార్గం. ముఖ్యంగా చలికాలంలో పెదాలు పగలడం సాధారణం, దీనికి బీట్ రూట్ ఒక మంచి పరిష్కారం.
తయారీ విధానం:
- 1 కప్పు బీట్ రూట్ రసంలో 1/2 టీస్పూన్ పాల క్రీమ్ వేసి బాగా కలపండి.
- ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు పెదాలపై అప్లై చేయండి.
- ఉదయం లేచిన తర్వాత మెల్లగా తుడవండి లేదా కడగాలి.
- ప్రతిరోజూ రాత్రి ఇలా చేస్తే.. పెదాలకు సహజ గులాబీ రంగును అందిస్తుంది.
- పాల క్రీమ్ పెదాలను లోతుగా మాయిశ్చరైజ్ చేసి, పగుళ్లను సరిచేస్తుంది.
- కొబ్బరి నూనెను ఉపయోగిస్తే.. అది కూడా పెదాలను మృదువుగా మార్చుతుంది.
బీట్‌రూట్ ఐస్ క్యూబ్స్‌తో ఫ్రెష్ గ్లో
అలసిన కళ్లకు, ముఖానికి తక్షణ ఉపశమనం అందించే ఒక సులభమైన, సహజ పరిష్కారం బీట్‌రూట్ ఐస్ క్యూబ్స్ ఫ్యాక్. ఉదయం లేచిన వెంటనే ముఖం అలసిపోయినట్లు అనిపించినప్పుడు, బీట్‌రూట్, రోజ్ వాటర్ కలయికతో తయారు చేసిన ఐస్ క్యూబ్స్ ముఖానికి చల్లని స్పర్శను ఇస్తాయి.
తయారీ విధానం:
- బీట్‌రూట్ రసంలో 1/2 కప్పు నీరు లేదా రోజ్ వాటర్ కలిపి ఐస్ ట్రేలో పోసి ఫ్రిజ్ లోో పెట్టండి.
- ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం వేళ ఒక క్యూబ్‌ను సన్నని గుడ్డలో చుట్టి ముఖం, మెడపై మెల్లగా రుద్దాలి.
- కళ్ల చుట్టూ మృదువుగా రుద్దడం వలన నల్లటి వలయాలు తగ్గే అవకాశం ఉంటుంది.
- బీట్‌రూట్‌లోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మానికి నిగారింపునిస్తాయి.
- రోజ్ వాటర్ చర్మాన్ని తేమతో నింపి, తాజాగా మార్చుతాయి.