Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • Health
  • Beetroot juice: రోజుకో గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగితే.. బీపీ, షుగర్ తగ్గుతుందా?

Beetroot juice: రోజుకో గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగితే.. బీపీ, షుగర్ తగ్గుతుందా?

బీట్ రూట్ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతమేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజుకో గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగితే చాలు అన్ని వ్యాధులకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు. 

Kavitha G | Published : Feb 06 2025, 01:31 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

బీట్ రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది. చాలామంది దీన్ని జ్యూస్, హల్వా లేదా స్మూతీ చేసుకుని తింటుంటారు. ముఖ్యంగా రోజూ ఉదయం బీట్ రూట్ జ్యూస్ తాగితే హెల్త్ కి చాలా మంచిదంటున్నారు నిపుణులు. బీట్ రూట్ లో ఉండే పోషకాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ జ్యూస్ రక్తహీనత సమస్యను నివారించడంతో పాటు చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.

25
రక్తహీనత సమస్యకు చెక్:

రక్తహీనత సమస్యకు చెక్:

శరీరంలో ఐరన్ లోపం వల్ల హిమోగ్లోబిన్ తగ్గడం మొదలవుతుంది. దీనివల్ల రక్తహీనత సమస్య వస్తుంది. బీట్ రూట్ లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. హిమోగ్లోబిన్ ను పెంచుతుంది. కాబట్టి రక్తహీనత సమస్య ఉన్నవారు రోజూ ఉదయం ఒక గ్లాసు బీట్ రూట్ జ్యూస్ తాగడం మంచిది.

కొవ్వును తగ్గిస్తుంది:

బీట్ రూట్ లో ఉండే ఫైటోన్యూట్రియెంట్స్ శరీరంలో ఉండే చెడు కొవ్వును తగ్గించడంలో చాలా సహాయపడతాయి. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది.

35
బీపీ నియంత్రణకు:

బీపీ నియంత్రణకు:

అధిక రక్తపోటు సమస్య ఉన్నవారికి బీట్ రూట్ జ్యూస్ ఒక అద్భుతమైన ఔషధం. అధ్యయనాల ప్రకారం, రోజూ ఒక గ్లాసు బీట్ రూట్ జ్యూస్ తాగితే బీపీ నియంత్రణలో ఉంటుంది. బీట్ రూట్ జ్యూస్ లో నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది:

రోజూ ఉదయం ఒక గ్లాసు బీట్రూట్ జ్యూస్ తాగితే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ జ్యూస్ లో ఉండే నైట్రేట్ గుండె జబ్బులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

45
కాలేయం ఆరోగ్యంగా..

కాలేయం ఆరోగ్యంగా..

కాలేయం శరీరంలో ముఖ్యమైన భాగం. దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగడం మంచిది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది:

బీట్ రూట్ లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీనివల్ల అంటువ్యాధుల నుంచి బయటపడవచ్చు.

55
బీట్ రూట్ ప్రయోజనాలు

బీట్ రూట్ ప్రయోజనాలు

- బీట్ రూట్ లో తగినంత ఫైబర్ ఉండటం వల్ల ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.

- బీట్ రూట్ జ్యూసులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కొవ్వు కూడా ఉండదు కాబట్టి దీన్ని రోజూ తాగితే బరువు సులభంగా తగ్గవచ్చు.

- బీట్ రూట్ జ్యూసులో ఉండే అలెర్జీ నిరోధక లక్షణాలు శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడతాయి.

- డయాబెటిస్ ఉన్నవారు రోజూ ఒక గ్లాసు బీట్ రూట్ జ్యూస్ తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.

Kavitha G
About the Author
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories